
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు కుటుంబానికి ఎంత ప్రాధాన్యత ఇస్తాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏ కొంచెం వీలు దొరికినా తన పిల్లలు గౌతమ్, సితారలతో కలిసి ఆటపాటలతో తెగ ఆల్లరి చేస్తుంటారు. ఇక కరోనా లాక్‌డౌన్ సమయంలో దొరికిన అనూహ్య సమయాన్ని పూర్తిగా కుటుంబంతో కలిసి సరదాగా గడుపుతున్నారు. మహేశ్-గౌతమ్-సితారలకు అల్లరికి సంబంధించిన ఫోటో, వీడియోలను నమ్రత ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా మహేశ్-సితారలు టంగ్ ట్విస్టర్ గేమ్ ఆడుతన్న ఓ వీడియోను నమ్రత తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. (మా నాన్న మాకు మంచి ఫ్రెండ్)
ఇక ఈ వీడియోలో టంగ్ ట్విస్టర్ గేమ్‌లో తను గెలిచినట్లు తండ్రితో సితార వాదన చేస్తుండటం చూడవచ్చు. ఇక ఈ గేమ్‌లో ఓడిస్తూ, ఓడిపోతూ సితు పాపతో మహేశ్ సరదాగా ఆడుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం మహేశ్‌బాబు ‘గీతగోవిందం’ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘సర్కారు వారి పాట’చిత్రంతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్లు అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీయంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్‌గా కీర్తీ సురేష్ కన్ఫార్మ్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా తాను మహేశ్‌బాబు సినిమాలో నటిస్తున్నట్లుగా వెల్లడించారు కీర్తీ సురేష్. (‘మా నాన్న నవ్వు.. మా బిడ్డ చిరునవ్వు’)
Comments
Please login to add a commentAdd a comment