
Courtesy: Dabboo Ratani
Dabboo Ratnani Reaction On Kiara Advani Photoshoot: కంటికి కనిపించేదంతా నిజం కాదంటున్నాడు బాలీవుడ్ ప్రముఖ ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్ డబూ రతాని. చూసే విధానం మీదే అంతా ఆధారపడి ఉంటుందని, మన కళ్లే మనల్ని మోసం చేస్తాయంటున్నాడు. తన క్యాలెండర్ ఫోటోషూట్ కోసం ఎంతో మంది టాప్ హీరోయిన్లు, సెలబ్రిటీలను డబూ రతాని కెమెరా కంటిలో బంధిస్తాడన్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో స్టార్ హీరోయిన్ కియారా అద్వానీతో ఇప్పటికే మూడుసార్లు ఫొటోషూట్ నిర్వహించాడు. ఎటువంటి ఆచ్చాదన లేకుండా ఆకు చాటున కియారా నిల్చున్న ఫొటోలు అప్పట్లో సంచలనం రేపాయి. ఇక మూడు నెలల క్రితం.. ఈ బాలీవుడ్ బ్యూటీ మరోసారి డబూ ఫొటోషూట్‌లో పాల్గొంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా.. నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేశారు.
‘‘ఎన్నిసార్లు ఇలా టాప్‌లెస్‌గా ఫోజులిస్తావు’’ అంటూ ఘాటు కామెంట్లు చేశారు. బీచ్ ఒడ్డున కియారా నగ్నంగా ఉన్నట్లు ఫొటో కనిపించడమే ఇందుకు కారణం. అయితే, ఇదంతా తన పనితనమే తప్ప.. అందులో నిజం లేదంటున్నాడు డబూ రతాని.
ట్రోల్స్ గురించి తాజాగా స్పందిస్తూ.. ‘‘అవును.. చాలా నెగటివ్ కామెంట్లు చదివాను. అయితే, ఈసారి తను టాప్‌లెస్‌గా షూట్ చేయలేదు. చాలా మంది అది న్యూడ్ షూట్ అని ఊహించుకున్నారు. నిజానికి అదంతా కెమెరా మ్యాజిక్. అదొక బ్లాక్ అండ్ వైట్ ఫొటో’’ అంటూ డబూ రతాని కౌంటర్ ఇచ్చాడు.
చదవండి: నా దగ్గర బికినీ ఉన్న విషయం నాకే తెలియదే: నటి
Comments
Please login to add a commentAdd a comment