క్రికెట్ జట్టు ట్రైనర్ అనుమానాస్పద మృతి
ముంబై: భారత అండర్ 19 క్రికెట్ జట్టుకు ఫిట్‌నెస్ ట్రైనర్‌గా సేవలందిస్తున్న రాజేష్ సావంత్ అనుమానాస్పదంగా మృతి చెందారు. ఆదివారం ఉదయం ముంబైలోని హోటల్ రూంలో ఆయన మృతి చెంది ఉండటాన్ని గుర్తించారు.
సోమవారం నుంచి ఇంగ్లండ్ అండర్ 19 జట్టుతో తలపడనున్న భారత జట్టును సన్నద్ధం చేస్తున్న రాజేష్.. ఇవాళ్టి టీమ్ యాక్టివిటీస్ గురించి రిపోర్ట్ చేయలేదు. దీంతో టీం సభ్యులు ఆయన కోసం చూస్తుండగా.. హోటల్ రూంలో మృతి చెంది ఉన్నారన్న విషయం గుర్తించారని బీసీసీఐ జాయింట్ సెక్రెటరీ అమితాబ్ చౌదరి వెల్లడించారు. రాజేష్ మృతికి గుండెపోటు కారణమని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. భారత ఏ, రెస్టాఫ్ ఇండియా జట్లకు సైతం గతంలో రాజేష్ సేవలందించారు.