India Under-19
-
యువ భారత్‌దే టెస్టు సిరీస్
చెన్నై: ఆద్యంతం నిలకడగా రాణించిన యువ భారత్ జట్టు అదరగొట్టింది. ఆ్రస్టేలియా అండర్–19 జట్టుతో జరిగిన రెండో అనధికారిక టెస్టులో భారత జట్టు ఇన్నింగ్స్ 120 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఫలితంగా రెండు మ్యాచ్‌ల యూత్ సిరీస్‌ను టీమిండియా 2–0తో కైవసం చేసుకుంది. అంతకుముందు యూత్ వన్డేల్లోనూ ఆ్రస్టేలియాను క్లీన్‌స్వీప్ చేసిన యువ భారత్... సుదీర్ఘ ఫార్మాట్లోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. భారత బౌలర్ల ధాటికి మూడు రోజుల్లోనే మ్యాచ్ ముగియగా... బుధవారం ఒక్క రోజే 17 వికెట్లు నేలకూలడం విశేషం.ఓవర్‌నైట్ స్కోరు 142/3తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా అండర్–19 జట్టు చివరకు 80.2 ఓవర్లలో 277 పరుగులకు ఆలౌటైంది. కెపె్టన్ ఒలీవర్ పెక్ (199 బంతుల్లో 117;16 ఫోర్లు, ఒక సిక్స్) సెంచరీతో రాణించగా... అలెక్స్ లీ యాంగ్ (66; 9 ఫోర్లు) ఆకట్టుకున్నాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 166 పరుగులు జోడించి ఆదుకునే ప్రయత్నం చేశారు. ఒకసారి ఈ జోడీ విడిపోయాకా ఆసీస్ ప్లేయర్లు పెవిలియన్‌కు వరుస కట్టారు. 59 పరుగుల వ్యవధిలో ఆసీస్ చివరి 6 వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో మొహమ్మద్ ఇనాన్, అన్మోల్జీత్ సింగ్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు. దీంతో యువ భారత జట్టుకు 215 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. దీంతో ఆ్రస్టేలియా జట్టును ఫాలోఆన్ ఆడించింది. అప్పటికే తొలి ఇన్నింగ్స్‌లో పేలవ ప్రదర్శన చేసి ఉన్న కంగారూలు... రెండో ఇన్నింగ్స్‌లో ఆ మాత్రం కూడా పోరాడలేకపోయారు. 31.3 ఓవర్లలో 95 పరుగులకే కుప్పకూలారు. మొత్తం జట్టులో ముగ్గురు ప్లేయర్లు మాత్రమే రెండంకెల స్కోరు అందుకోగలిగారు.సిమోన్ బడ్జ్ (26; 3 ఫోర్లు, ఒక సిక్సర్), స్టీవెన్ హోగన్ (29;4 ఫోర్లు), పదకొండో స్థానంలో బరిలోకి దిగిన హ్యారీ హొకెస్ట్రా (20 నాటౌట్; 2 ఫోర్లు, ఒక సిక్స్) తలా కొన్ని పరుగులు చేశారు. మిగిలినవాళ్లంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో అన్మోల్ జీత్ సింగ్‌కు 5, లెగ్ స్పిన్నర్ మొహమ్మద్ ఇనాన్కు మూడు వికెట్లు దక్కాయి. అంతకుముందు యువ భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 492 పరుగులు చేసింది. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 9 వికెట్లు పడగొట్టిన అరంగేట్ర ఆఫ్ స్పిన్నర్ అన్మోల్జీత్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ మ్యాచ్‌లో అన్మోల్జీత్, ఇనాన్ కలిసి 16 వికెట్లు పడగొట్టడం విశేషం. -
‘ఆ దృశ్యాలు ఫైనల్ మ్యాచ్‌లోనే చూశాను’
న్యూఢిల్లీ : అండర్-19 ఫైనల్ మ్యాచ్‌లో బంగ్లా, భారత్ ఆటగాళ్ల ఘర్షణపై టీమిండియా మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడీ స్పందించారు. యువ భారత్ ఆటగాళ్ల ప్రవర్తన అసహ్యకరంగా ఉందని వ్యాఖ్యానించాడు. ‘మైదానంలో ఏ జట్టయినా చెత్త ప్రదర్శన చేయొచ్చు. ఇంత చెత్తగా తిట్టుకోవడం మాత్రం ఎప్పుడూ చూడలేదు’ అంటూ ఘాటుగా విమర్శించాడు. ఎప్పుడూ చూడని దృశ్యాలు ఫైనల్ మ్యాచ్‌లో ‘చూపించారు’అని ఎద్దేవా చేశాడు. (చదవండి : ‘అతి’కి సస్పెన్షన్ పాయింట్లు) ‘ఏ జట్టయినా చాలా చెత్తగా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ చేయొచ్చు. కానీ ఇంత చెత్తగా మాత్రంగా ప్రవర్తించకూడదు. ఇది చాలా అవమానకరమైన, అసహ్యకరమైన ప్రవర్తన’ బంగ్లా ఏం చేసిందో, ఎలా ఆడిందో అది వారి సమస్య. మనోళ్లు ఎలా ఆడారో అది మన సమస్య. కానీ, బండ బూతులు తిట్టుకోవడమేంటి..!’అని బిషన్ సింగ్ ఆసహనం వ్యక్తం చేశాడు. ఇక తొలిసారి అండర్-19 ప్రపంచకప్ ఫైనల్ చేరిన బంగ్లా జట్టు చివరి వరకు శ్రమించి మూడు వికెట్ల తేడాతో గెలిచి కప్పు కొట్టింది. అయితే, విజయం అనంతరం బంగ్లా శిబిరం నుంచి ఒక్కసారిగా ఆటగాళ్లు, జట్టు సిబ్బంది మైదానంలోకి చొచ్చుకురావడవంతో చిన్నపాటి ఘర్షణ చోటుచేసుకుంది. ఫీల్డ్ అంపైర్లు కలుగజేసుకోవడంతో వివాదం అక్కడితో ముగిసింది. ఐదుగురిపై చర్యలు.. అండర్–19 ప్రపంచకప్ ఫైనల్ ముగిశాక ఆటగాళ్ల ప్రవర్తన... లెవెల్–3 నియమావళికి విరుద్ధంగా ఉండటంతో ఐసీసీ చర్యలు చేపట్టింది. కప్ నెగ్గిన ఆనందంలో ‘అతి’గా సంబరపడిన బంగ్లాదేశ్ ఆటగాళ్లపై, దీనికి దీటుగా ఆవేశపడిన భారత ఆటగాళ్లపై సస్పెన్షన్ పాయింట్లు విధించింది. భారత్‌కు చెందిన ఆకాశ్ సింగ్‌కు 8 సస్పెన్షన్ పాయింట్లు (6 డి మెరిట్ పాయింట్లకు సమానం), రవి బిష్ణోయ్‌కి 5 సస్పెన్షన్ (2 డి మెరిట్) పాయింట్లు విధించారు. బంగ్లాదేశ్ ఆటగాళ్లలో తౌహిద్ హ్రిదోయ్ (10 సస్పెన్షన్=6 డి మెరిట్), షమీమ్ హుస్సేన్ (8 సస్సెన్షన్=6 డి మెరిట్), రకీబుల్ హసన్ (4 సస్పెన్షన్= 5 డి మెరిట్)లపై ఐసీసీ చర్యలు తీసుకుంది. రకీబుల్ ప్రవర్తించిన తీరుపై ఎక్కువ డి మెరిట్ పాయింట్ల నిషేధం విధించింది. ఆదివారం ఉత్కంఠ పెంచిన ‘లో’ స్కోర్ల మ్యాచ్‌లో బంగ్లాదేశ్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 3 వికెట్ల తేడాతో భారత్‌పై గెలిచింది. తొలిసారి ఐసీసీ ప్రపంచకప్ నెగ్గిన ఆనందంలో బంగ్లాదేశ్ యువ ఆటగాళ్లు విచక్షణ కోల్పోయారు. -
అండర్-19 ప్రపంచకప్ ఫైనల్
-
బంగ్లా, భారత్ ఆటగాళ్ల ఘర్షణ..!
-
అండర్-19 ప్రపంచకప్ ఫైనల్; తోసుకున్న ఆటగాళ్లు..!
పాచెఫ్‌స్ట్రూమ్ (దక్షిణాఫ్రికా): అండర్-19 ప్రపంచకప్ ఆసాంతం విజయపరంపర సాగించిన ‘యువ’భారత్ జట్టు ఫైనల్లో చేతులెత్తేసింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 47.2 ఓవర్లలో 177 పరుగులకే కుప్పకూలింది. తొలిసారి అండర్-19 ప్రపంచకప్ ఫైనల్ ఆడుతున్న బంగ్లా జట్టు చివరి వరకు శ్రమించి మూడు వికెట్ల తేడాతో గెలిచి ‘కప్పు’ను ముద్దాడింది. అయితే, తమ జట్టు విజయం అనంతరం బంగ్లా శిబిరం నుంచి ఒక్కసారిగా ఆటగాళ్లు, జట్టు సిబ్బంది మైదానంలోకి చొచ్చుకురావడవంతో చిన్నపాటి ఘర్షణ చోటుచేసుకుంది. (చదవండి : అయ్యో... ఆఖరికి ఓడింది) విజయానందంలో ఉన్న బంగ్లా ఆటగాళ్లలో ఒకరు టీమిండియా ఆటగాళ్లను ఉద్దేశించి ఎగతాళిగా మాట్లాడారు. అసలే ఓటమి బాధలో ఉన్న మన ఆటగాళ్లకు బంగ్లా ఆటగాళ్ల చేష్టలు కోపం తెప్పించాయి. దీంతో ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరికొకరు తోసుకునే దాకా మ్యాటర్ వెళ్లింది. వెంటనే స్పందించిన ఫీల్డ్ అంపైర్లు ఇరువురికీ నచ్చజెప్పడంతో వివాదం సద్దుమణిగింది. దీనికి సంబంధించిన వీడియోను దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జేపీ డుమినీ ట్విటర్లో పోస్టు చేశాడు. బంగ్లా గెలిచిందిలా..! 178 పరుగుల లక్ష్యంతో బంగ్లా ఛేదనకు దిగగా.. 41వ ఓవర్లో వర్షం రావడంతో కొంతసేపు మ్యాచ్ ఆగిపోయింది. అప్పటికి బంగ్లాదేశ్ 163/7 స్కోరుతో ఉంది. వర్షం తగ్గుముఖం పట్టాక లక్ష్యాన్ని డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 46 ఓవర్లలో 170 పరుగులుగా కుదించారు. దీంతో 42.1 ఓవర్లలో 7 వికెట్లకు 170 పరుగులు చేసి బంగ్లా విజయాన్నందుకుంది. బంగ్లా కెప్టెన్ అక్బర్ అలీ (77 బంతుల్లో 43 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) అజేయంగా నిలబడి గెలిపించాడు. భారత్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (121 బంతుల్లో 88; 8 ఫోర్లు, 1 సిక్స్) ఒంటరి పోరాటం చేశాడు. అక్బర్ అలీకి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’, యశస్వి జైస్వాల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి. -
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్
పాచెఫ్‌స్ట్రూమ్ (దక్షిణాఫ్రికా): అండర్–19 ప్రపంచ కప్ తుది సమరానికి తెరలేచింది. డిఫెండింగ్ చాంపియన్ ‘యువ’భారత్ తొలిసారి అండర్–19 ప్రపంచ కప్ ఫైనల్ చేరిన బంగ్లాదేశ్ జట్ల మధ్య ఆఖరి పోరులో టాస్ పడింది. బంగ్లా యువ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టైటిల్‌ను నిలబెట్టుకునేందుకు టీమిండియా బరిలోకి దిగుతుండగా.. ఈ సువర్ణావకాశాన్ని వదులుకోరాదని బంగ్లాదేశ్ పట్టుదలగా ఉంది. ఫైనల్ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. ఆదివారం ఇక్కడ భారీగా వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. అయితే ఐసీసీ సోమవారాన్ని ‘రిజర్వ్ డే’గా పెట్టింది. ఆ రోజూ మ్యాచ్ సాధ్యం కాకపోతే ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. ఇక టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా అజేయంగా నిలిచిన ఇరు జట్లూ.. బలాబలాలపరంగా చూస్తే దాదాపుగా సమ ఉజ్జీలుగా ఉన్నాయి. నాకౌట్ మ్యాచ్‌లలో ఆస్ట్రేలియా, పాకిస్తాన్లను భారత్ ఓడిస్తే... దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌లను బంగ్లాదేశ్ చిత్తు చేసింది. (చదవండి : 'ఫైనల్లో బంగ్లాదేశ్‌ను కుమ్మేయండి') తుది జట్లు : ఇండియా అండర్-19 : యశస్వి జైస్వాల్, దివ్యాన్ష్ సక్సేనా, తిలక్ వర్మ, ప్రియం గార్గ్ (కెప్టెన్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), సిద్ధేష్ వీర్, అధర్వ అంకోలేకర్, రవి బిష్ణోయ్, శశ్వత్ రావత్, కార్తీక్ త్యాగి, ఆకాష్ సింగ్ బంగ్లాదేశ్ అండర్-19 : పర్వేజ్ హుస్సేన్, టాంజిద్ హసన్, మహ్మద్ఉల్ హసన్, తోహిద్ హ్రిదోయ్, షాహదత్ హుస్సేన్, అవిషేక్ దాస్, అక్బర్ అలీ (కెప్టెన్/వికెట్ కీపర్), షమీమ్ హుస్సేన్, రాకిబుల్ హసన్, షోరిఫుల్ ఇస్లాం, టాంజిమ్ హసన్ షకీబ్ -
సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లిన టీమిండియా
పోష్‌స్ట్రూమ్ (దక్షిణాఫ్రికా) : అండర్ 19 ప్రపంచకప్‌లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగిస్తూ సెమీస్‌కు చేరింది. క్వార్టర్ ఫైనల్లో 74 పరుగుల తేడాతో ఆసీస్‌పై విజయం సాధించింది. జైశ్వాల్(62) , అన్కోలేకర్(55, నాటౌట్) అర్థ సెంచరీలతో రాణించగా...త్యాగి నాలుగు, ఆకాశ్ సింగ్ మూడు వికెట్లు తీసి అదరహో అనిపించారు. టాస్ ఓడిపోయి బ్యాటింగ్‌కు దిగిన భారత్.. నిర్ణీత ఓవర్లకు 233 పరుగు చేసింది. ఆ తర్వాత 234 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్.. భారత బౌలర్ల దాటికి 159 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ బ్యాట్స్‌మన్‌లో ఫన్నింగ్ 75 , స్కాట్ 35 పరుగులు చేయగా...ముగ్గురు డకౌట్లు, ఐదుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. 74 పరుగుల భారీ తేడాలో విజయం సాధించిన భారత్.. సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. నాలుగు వికెట్లు తీసి మ్యాచ్ విజయానికి కీలకమైన త్యాగికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. -
29 బంతుల్లోనే...
బ్లూమ్ఫొంటీన్ (దక్షిణాఫ్రికా): 1, 7, 0, 0, 0, 0, 0, 7, 5, 1, 1... అండర్–19 క్రికెట్ ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో జపాన్ బ్యాట్స్‌మెన్ చేసిన స్కోర్లు ఇవి. ఈ టోరీ్నలో నాలుగు సార్లు విజేతగా నిలిచిన భారత్... తొలిసారి బరిలోకి దిగిన జపాన్‌తో తలపడితే ఫలితం ఎలా ఉంటుందో సరిగ్గా అలాగే, ఊహించిన విధంగానే వచ్చింది. మంగళవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో భారత్ 10 వికెట్ల తేడాతో జపాన్ను చిత్తుగా ఓడించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన జపాన్ 22.5 ఓవర్లలో 41 పరుగులకే కుప్పకూలింది. అండర్–19 ప్రపంచ కప్ చరిత్రలో ఇది రెండో అత్యల్ప స్కోరు. ఎక్స్‌ట్రాల రూపంలో వచి్చన 19 పరుగులే జపాన్ ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరు కాగా... యార్కర్లు వేసే క్రమంలో పట్టు తప్పిన భారత బౌలర్లు వేసిన 12 వైడ్లు ఇందులో ఉన్నాయి. జపాన్ ఆటగాళ్లు 11 మందిలో ఒక్కరు కూడా రెండంకెల స్కోరు చేయలేదు. ఐదుగురు బ్యాట్స్‌మెన్ డకౌట్ కావడం విశేషం. భారత లెగ్‌స్పిన్నర్, ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రవి బిష్ణోయ్ 5 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. తన తొలి రెండు బంతుల్లోనే అతను రెండు వికెట్లు తీశాడు. కార్తీక్ త్యాగికి 3, ఆకాశ్ సింగ్‌కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం భారత 4.5 ఓవర్లలో (29 బంతుల్లో) వికెట్ నష్టపోకుండా 42 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (18 బంతుల్లో 29 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్), కుమార్ కుశాగ్ర (11 బంతుల్లో 13 నాటౌట్; 2 ఫోర్లు) కలిసి 29 బంతుల్లో ఆట ముగించారు. వరుసగా రెండో విజయం సాధించిన భారత్ నాలుగు పాయింట్లతో క్వార్టర్ ఫైనల్ చేరింది. శుక్రవారం జరిగే తమ గ్రూప్ చివరి లీగ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో భారత్ ఆడుతుంది. స్కోరు వివరాలు జపాన్ ఇన్నింగ్స్: మార్కస్ తుర్గేట్ (బి) కార్తీక్ త్యాగి 1; నొగుచి (బి) రవి బిష్ణోయ్ 7; నీల్ డేట్ (ఎల్బీ) (బి) కార్తీక్ త్యాగి 0; సాహు (సి) గార్గ్ (బి) విద్యాధర్ పాటిల్ 0; తకహషి (బి) రవి బిష్ణోయ్ 0; ఇషాన్ (ఎల్బీ) (బి) రవి బిష్ణోయ్ 0; ఆష్లే తుర్గేట్ (సి) యశస్వి జైస్వాల్ (బి) రవి బిష్ణోయ్ 0; డోబెల్ (సి) సిద్ధేశ్ వీర్ (బి) ఆకాశ్ సింగ్ 7; క్లెమెంట్స్ (ఎల్బీ) (బి) కార్తీక్ త్యాగి 5; రేథరేకర్ (సి) సిద్ధేశ్ వీర్ (బి) ఆకాశ్ సింగ్ 1; ఇచికి (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం (22.5 ఓవర్లలో ఆలౌట్) 41. వికెట్ల పతనం: 1–5; 2–5; 3–14; 4–14; 5–19; 6–19; 7–19; 8–32; 9–38; 10–41. బౌలింగ్: కార్తీక్ త్యాగి 6–0–10–3; ఆకాశ్ సింగ్ 4.5–1–11–2; రవి బిష్ణోయ్ 8–3–5–4; విద్యాధర్ పాటిల్ 4–1–8–1. భారత్ ఇన్నింగ్స్: యశస్వి (నాటౌట్) 29; కుశాగ్ర (నాటౌట్) 13; మొత్తం (4.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 42. బౌలింగ్: రేథరేకర్ 2–0–19–0; డోబెల్ 2–0–16–0; ఆష్లే తుర్గేట్ 0.5–0–7–0. -
29 బంతుల్లోనే కథ ముగించారు
బ్లోమ్‌ఫొంటెన్: అండర్–19 ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ జపాన్ను చిత్తు చేసింది. జపాన్ నిర్దేశించిన అతి స్వల్ప లక్ష్యాన్ని వికెట్ నష్టపోకుండా ఛేదించింది. తొలుత బ్యాటింగ్ చేసిన జపాన్ రవి భిష్నోయ్ 4, కార్తిక్ త్యాగి 3 దెబ్బకు 22.5 ఓవర్లలో 41 పరుగులకే ఆలౌటయింది. అనంతరం బరిలోకి దిగిన యువభారత్ జట్టు 4.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్లు యశస్వీ జైస్వాల్ (18 బంతుల్లో 29; 5 పోర్లు, 1 సిక్స్), కుమార్ కుశాగ్ర (11 బంతుల్లో 13; 2 ఫోర్లు) లాంఛనాన్ని పూర్తి చేశారు. (చదవండి : చెత్త ప్రదర్శన.. 41 పరుగులకే ఆలౌట్) భారత్‌కు ఇది వరుసగా రెండో విజయం కావడం విశేషం. శ్రీలంకతో ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో యువభారత్ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. రవి భిష్నోయ్ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా ఎంపికయ్యాడు. కాగా, భిష్నోయ్‌పై బీసీసీఐ ప్రశంసలు కురిపించింది. చక్కని బౌలింగ్‌తో నాలుగు వికెట్లు తీసి భారత్ విజయానికి బాటలు వేశాడని అధికారిక వెబ్సైట్లో పేర్కొంది. ఇక న్యూజిలాండ్‌తో మూడో లీగ్ మ్యాచ్ శుక్రవారం జరుగనుంది. 41లో ఎక్స్‌ట్రాలే 19.. జపాన్ బ్యాట్స్‌మెన్‌లో ఐదుగురు డకౌట్ కాగా.. వారిలో ఇద్దరు గోల్టెన్ డక్‌గా వెనుదిరగడం విశేషం. మిగిలిన ఐదుగురిలో ఇద్దరు ఒక పరుగు మాత్రమే చేసి ఔట్ కాగా.. ముగ్గురు 7, 7, 5 పరుగులతో వికెట్ సమర్పించుకున్నారు. ఇక ఈ జపాన్ ఇన్నింగ్స్‌లో ఎనిమిదో వికెట్‌కు నమోదైన 13 పరుగుల భాగస్వామ్యమే అత్యధికం కావడం విశేషం. జపాన్ జట్టు సాధించిన 41 పరుగుల్లో 19 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో వచ్చినవే కావడం మరో విశేషం. (చదవండి : యువ భారత్ శుభారంభం) -
ఐదుగురు డకౌట్.. 41 పరుగులకే ఆలౌట్
బ్లోమ్‌ఫొంటెన్: అండర్–19 ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్లో తొలిసారిగా ఆడుతున్న జపాన్ జట్టు అత్యంత చెత్త ప్రదర్శన చేసింది. మంగళవారం డిఫెండింగ్ చాంపియన్ భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆ జట్టు 22.5 ఓవర్లలో 41 పరుగులకే ఆలౌటయింది. దీంతో అండర్–19 వరల్డ్‌కప్ చరిత్రలో సంయుక్తంగా రెండో అతి తక్కువ పరుగుల రికార్డును నమోదు చేసింది. 2002 అండర్–19 వరల్డ్ కప్‌లో కెనడా, 2008లో బంగ్లాదేశ్ 41 పరుగులకు ఆలౌట్ కాగా, 2004లో స్కాట్లాండ్ జట్టు 22 పరుగులకే ఆలౌట్ అయి మొదటి స్థానంలో నిలిచింది. ఇలా వచ్చి అలా.. అందరూ అంతే.. టాస్ గెలిచిన యువభారత్ కెప్టెన్ ప్రియం గార్గ్ జపాన్ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. అసలే క్రికెట్లో కూనలైన జపాన్ ఆటగాళ్లు ఏ దశలోనూ భారత బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కోలేదు. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ క్రీజులోకి వచ్చీరాగానే పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఐదో ఓవర్లో ఓపెనర్ (కెప్టెన్) మార్కస్ థర్గేట్ వికెట్‌తతో మొదలైన పతనం.. 22వ ఓవర్ వచ్చే సరికి పూర్తయింది. ఐదో ఓవర్లో రెండు వికెట్లు, ఏడో ఓవర్లో రెండు వికెట్లు, పదో ఓవర్లో రెండు వికెట్లను జపాన్ జట్టు కోల్పోయింది. మిగతా నాలుగు వికెట్లను 11, 17, 20, 22 ఓవర్లలో సమర్పించుకున్న జపాన్.. ప్రత్యర్థి ముందు మోకరిల్లింది. రవి భిష్నోయ్ 4, కార్తిక్ త్యాగి 3, ఆకాశ్ సింగ్ 2, విద్యాధర్ పాటిల్ ఒక వికెట్ సాధించారు. (చదవండి : యువ భారత్ శుభారంభం) డక్.. లేదంటే గోల్డెన్ డక్.. జపాన్ బ్యాట్స్‌మెన్‌లో ఐదుగురు డకౌట్ కాగా.. వారిలో ఇద్దరు గోల్టెన్ డక్‌గా వెనుదిరగడం విశేషం. మిగిలిన ఐదుగురిలో ఇద్దరు ఒక పరుగు మాత్రమే చేసి ఔట్ కాగా.. ముగ్గురు 7, 7, 5 పరుగులతో వికెట్ సమర్పించుకున్నారు. ఇక ఈ జపాన్ ఇన్నింగ్స్‌లో ఎనిమిదో వికెట్‌కు నమోదైన 13 పరుగుల భాగస్వామ్యమే అత్యధికం కావడం విశేషం. జపాన్ జట్టు సాధించిన 41 పరుగుల్లో 19 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో వచ్చినవే కావడం మరో విశేషం. ఇదిలాఉండగా.. శ్రీలంక జరిగిన తొలి మ్యాచ్‌లో యువభారత్ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. -
యువ భారత్ శుభారంభం
బ్లోమ్‌ఫొంటెన్: డిఫెండింగ్ చాంపియన్ భారత్ అండర్–19 ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్లో శుభారంభం చేసింది. శ్రీలంకతో ఆదివారం జరిగిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో యువ భారత్ 90 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిరీ్ణత 50 ఓవర్లలో 4 వికెట్లకు 297 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (59; 8 ఫోర్లు), హైదరాబాద్ ప్లేయర్ ఠాకూర్ తిలక్‌వర్మ (46; 3 ఫోర్లు), కెపె్టన్ ప్రియమ్ గార్గ్ (56; 2 ఫోర్లు) రాణించి భారత ఇన్నింగ్స్‌కు గట్టి పునాది వేయగా...చివర్లో ధ్రువ్ జురెల్ (48 బంతుల్లో 52 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్), ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ సిద్ధేశ్ వీర్ (27 బంతుల్లో 44 నాటౌట్; 6 ఫోర్లు, సిక్స్) ధాటిగా ఆడారు. 298 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 45.2 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటైంది. నిపున్ పెరీరా (50; 2 ఫోర్లు, సిక్స్), రవీందు (49; 5 ఫోర్లు) మినహా మిగతావారు విఫలమయ్యారు. భారత బౌలర్లలో ఆకాశ్ సింగ్, సిద్ధేశ్ వీర్, రవి బిష్ణోయ్ రెండేసి వికెట్లు తీశారు. మంగళవారం జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో జపాన్‌తో భారత్ ఆడుతుంది. -
విజయానికి చేరువలో యువ భారత్
హంబన్‌టోటా: ప్రత్యర్థిని ఫాలోఆన్‌లో పడేసి, రెండో ఇన్నింగ్స్‌లో టాప్ ఆర్డర్‌ను అవుట్ చేసిన భారత అండర్–19 జట్టు యూత్ టెస్టులో విజయం దిశగా సాగుతోంది. ఓవర్ నైట్ స్కోరు 140/4తో మూడో రోజు గురువారం ఆట ప్రారంభించిన శ్రీలంక అండర్– 19 జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 316 పరుగులకు ఆలౌటైంది. సూరియ బండార (115) శతకం, దినుష (51) అర్ధ శతకాలు సాధించారు. మోహిత్ జాంగ్రా (4/76) నాలుగు వికెట్లు పడగొట్టగా... బదోని, మంగ్వాని, దేశాయ్ తలా రెండు వికెట్లు తీశారు. ఫాలోఆన్‌లో లంక ఓపెనర్ మిషారా (5)ను అర్జున్ టెండూల్కర్ ఎల్బీగా అవుట్ చేశాడు. ఫెర్నాండో (25), కెప్టెన్ పెరీరా (8) త్వరగానే వెనుదిరిగారు. దీంతో ఆట ముగిసే సమయానికి లంక 47/3తో నిలిచింది. చేతిలో ఏడు వికెట్లు ఉండగా, భారత తొలి ఇన్నింగ్స్ స్కోరు (613/8 డిక్లేర్డ్)కు ఇంకా 250 పరుగులు వెనుకబడి ఉంది. -
యువ భారత్‌కు మరో గెలుపు
రెండో వన్డేలో ఇంగ్లండ్ అండర్–19 ఓటమి కాంటర్బరీ: యూత్ వన్డే సిరీస్‌లో భారత్ అండర్–19 జట్టు వరుసగా రెండో మ్యాచ్‌లోనూ గెలిచింది. బుధవారం రాత్రి జరిగిన రెండో వన్డేలో హిమాన్షు రాణా (85 బంతుల్లో 74; 9 ఫోర్లు), అనుకుల్ రాయ్ (4/27) రాణించడంతో యువ భారత్ 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ అండర్–19 జట్టుపై ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ జట్టు 44.4 ఓవర్లలో 175 పరుగుల వద్ద ఆలౌటైంది. ట్రెవస్కిస్ (35), లెమొన్బై (30) ఫర్వాలేదనిపించారు. రాహుల్ చహర్ 3, అభిషేక్ శర్మ 2 వికెట్లు తీశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన భారత్ 33.2 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ఓపెనర్లు పృథ్వీ షా (51 బంతుల్లో 48; 7 ఫోర్లు), రాణా తొలి వికెట్‌కు 110 పరుగులు జోడించారు. రెండో వికెట్‌కు శుభ్‌మన్ గిల్ (38 నాటౌట్)తో కలిసి రాణా 61 పరుగులు జతచేయడంతో విజయం సులువైంది. ఐదు వన్డేల యూత్ సిరీస్‌లో ప్రస్తుతం భారత్ 2–0తో ఆధిక్యంలో ఉంది. శనివారం మూడో వన్డే హోవ్‌లోని కౌంటీ గ్రౌండ్లో జరగనుంది. -
భారత్, ఇంగ్లండ్ యూత్ టెస్టు డ్రా
నాగ్‌పూర్: భారత్ అండర్–19 జట్టు వికెట్ కీపర్ సురేశ్ లోకేశ్వర్ (125 బంతుల్లో 92 నాటౌట్; 14 ఫోర్లు) వీరోచితంగా పోరాడటంతో ఇంగ్లండ్ అండర్–19 జట్టుతో జరిగిన యూత్ టెస్టు తొలి మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. 238 పరుగుల లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన భారత్ నాలుగో రోజు ఆటముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 49 ఓవర్లలో 8 వికెట్లకు 189 పరుగులతో నిలిచి మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. బ్యాటింగ్‌లో టాపార్డర్ విఫలవైునా.... లోయర్ ఆర్డర్ సహకారంతో లోకేశ్వర్ విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. లోకేశ్వర్‌తో పాటు తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో డారిల్ ఫెరారియో (37) రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో హెన్రీ బ్రూక్స్ 3, ఆరోన్ బియర్డ్ 2 వికెట్లు దక్కించుకున్నారు. అంతకుముందు 23/1 ఓవర్‌నైట్ స్కోరుతో గురువారం రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఇంగ్లండ్ జట్టు... ఆఫ్ స్పిన్నర్ సిజోమో్న్ జోసెఫ్ (6/62) దాటికి 53 ఓవర్లలో 167 పరుగులకు ఆలౌటైంది. 70 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని ఇంగ్లండ్ 238 పరుగుల లక్ష్యాన్ని భారత్‌కు నిర్దేశించింది. జార్జ్ బార్ట్లెట్ (97 బంతుల్లో 68; 11 ఫోర్లు, 1 సిక్సర్) అర్ధసెంచరీ చేయగా... హ్యారీ బ్రూక్ (58 బంతుల్లో 29; 4 ఫోర్లు, 1 సిక్సర్) రాణించాడు. భారత బౌలర్లలో డారిల్ ఫెరారియో 2 వికెట్లు పడగొట్టగా... కనిష్క్ సేత్, రిషభ్ భగత్ చెరో వికెట్ తీశారు. అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 501/5 డిక్లేర్ చేయగా... భారత్ 431/8 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. -
క్రికెట్ జట్టు ట్రైనర్ అనుమానాస్పద మృతి
ముంబై: భారత అండర్ 19 క్రికెట్ జట్టుకు ఫిట్నెస్ ట్రైనర్‌గా సేవలందిస్తున్న రాజేష్ సావంత్ అనుమానాస్పదంగా మృతి చెందారు. ఆదివారం ఉదయం ముంబైలోని హోటల్ రూంలో ఆయన మృతి చెంది ఉండటాన్ని గుర్తించారు. సోమవారం నుంచి ఇంగ్లండ్ అండర్ 19 జట్టుతో తలపడనున్న భారత జట్టును సన్నద్ధం చేస్తున్న రాజేష్.. ఇవాళ్టి టీమ్ యాక్టివిటీస్ గురించి రిపోర్ట్ చేయలేదు. దీంతో టీం సభ్యులు ఆయన కోసం చూస్తుండగా.. హోటల్ రూంలో మృతి చెంది ఉన్నారన్న విషయం గుర్తించారని బీసీసీఐ జాయింట్ సెక్రెటరీ అమితాబ్ చౌదరి వెల్లడించారు. రాజేష్ మృతికి గుండెపోటు కారణమని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. భారత ఏ, రెస్టాఫ్ ఇండియా జట్లకు సైతం గతంలో రాజేష్ సేవలందించారు.