29 బంతుల్లోనే... | Under 19 World Cup 2020 India Thrash Japan By 10 Wickets | Sakshi
Sakshi News home page

29 బంతుల్లోనే...

Published Wed, Jan 22 2020 3:01 AM | Last Updated on Wed, Jan 22 2020 12:35 PM

Under 19 World Cup 2020 India Thrash Japan By 10 Wickets - Sakshi

బ్లూమ్‌ఫొంటీన్‌ (దక్షిణాఫ్రికా): 1, 7, 0, 0, 0, 0, 0, 7, 5, 1, 1... అండర్‌–19 క్రికెట్‌ ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో జపాన్‌ బ్యాట్స్‌మెన్‌ చేసిన స్కోర్లు ఇవి. ఈ టోరీ్నలో నాలుగు సార్లు విజేతగా నిలిచిన భారత్‌... తొలిసారి బరిలోకి దిగిన జపాన్‌తో తలపడితే ఫలితం ఎలా ఉంటుందో సరిగ్గా అలాగే, ఊహించిన విధంగానే వచ్చింది. మంగళవారం జరిగిన గ్రూప్‌ ‘ఎ’ లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 10 వికెట్ల తేడాతో జపాన్‌ను చిత్తుగా ఓడించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన జపాన్‌ 22.5 ఓవర్లలో 41 పరుగులకే కుప్పకూలింది. అండర్‌–19 ప్రపంచ కప్‌ చరిత్రలో ఇది రెండో అత్యల్ప స్కోరు. ఎక్స్‌ట్రాల రూపంలో వచి్చన 19 పరుగులే జపాన్‌ ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరు కాగా... యార్కర్లు వేసే క్రమంలో పట్టు తప్పిన భారత బౌలర్లు వేసిన 12 వైడ్లు ఇందులో ఉన్నాయి.

జపాన్‌ ఆటగాళ్లు 11 మందిలో ఒక్కరు కూడా రెండంకెల స్కోరు చేయలేదు. ఐదుగురు బ్యాట్స్‌మెన్‌ డకౌట్‌ కావడం విశేషం. భారత లెగ్‌స్పిన్నర్, ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రవి బిష్ణోయ్‌ 5 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. తన తొలి రెండు బంతుల్లోనే అతను రెండు వికెట్లు తీశాడు. కార్తీక్‌ త్యాగికి 3, ఆకాశ్‌ సింగ్‌కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం భారత 4.5 ఓవర్లలో (29 బంతుల్లో) వికెట్‌ నష్టపోకుండా 42 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌ (18 బంతుల్లో 29 నాటౌట్‌; 5 ఫోర్లు, 1 సిక్స్‌), కుమార్‌ కుశాగ్ర (11 బంతుల్లో 13 నాటౌట్‌; 2 ఫోర్లు) కలిసి 29 బంతుల్లో ఆట ముగించారు. వరుసగా రెండో విజయం సాధించిన భారత్‌ నాలుగు పాయింట్లతో క్వార్టర్‌ ఫైనల్‌ చేరింది. శుక్రవారం జరిగే తమ గ్రూప్‌ చివరి లీగ్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో భారత్‌ ఆడుతుంది.  

స్కోరు వివరాలు
జపాన్‌ ఇన్నింగ్స్‌: మార్కస్‌ తుర్‌గేట్‌ (బి) కార్తీక్‌ త్యాగి 1; నొగుచి (బి) రవి బిష్ణోయ్‌ 7; నీల్‌ డేట్‌ (ఎల్బీ) (బి) కార్తీక్‌ త్యాగి 0; సాహు (సి) గార్గ్‌ (బి) విద్యాధర్‌ పాటిల్‌ 0; తకహషి (బి) రవి బిష్ణోయ్‌ 0; ఇషాన్‌ (ఎల్బీ) (బి) రవి బిష్ణోయ్‌ 0; ఆష్లే తుర్‌గేట్‌ (సి) యశస్వి జైస్వాల్‌ (బి) రవి బిష్ణోయ్‌ 0; డోబెల్‌ (సి) సిద్ధేశ్‌ వీర్‌ (బి) ఆకాశ్‌ సింగ్‌ 7; క్లెమెంట్స్‌ (ఎల్బీ) (బి) కార్తీక్‌ త్యాగి 5; రేథరేకర్‌ (సి) సిద్ధేశ్‌ వీర్‌ (బి) ఆకాశ్‌ సింగ్‌ 1; ఇచికి (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం (22.5 ఓవర్లలో ఆలౌట్‌) 41.  
వికెట్ల పతనం: 1–5; 2–5; 3–14; 4–14; 5–19; 6–19; 7–19; 8–32; 9–38; 10–41.
బౌలింగ్‌: కార్తీక్‌ త్యాగి 6–0–10–3; ఆకాశ్‌ సింగ్‌ 4.5–1–11–2; రవి బిష్ణోయ్‌ 8–3–5–4; విద్యాధర్‌ పాటిల్‌ 4–1–8–1.  

భారత్‌ ఇన్నింగ్స్‌: యశస్వి (నాటౌట్‌) 29; కుశాగ్ర (నాటౌట్‌) 13; మొత్తం (4.5 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా) 42.
బౌలింగ్‌: రేథరేకర్‌ 2–0–19–0; డోబెల్‌ 2–0–16–0; ఆష్లే తుర్‌గేట్‌ 0.5–0–7–0.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement