
హంబన్‌టోటా: ప్రత్యర్థిని ఫాలోఆన్‌లో పడేసి, రెండో ఇన్నింగ్స్‌లో టాప్ ఆర్డర్‌ను అవుట్ చేసిన భారత అండర్–19 జట్టు యూత్ టెస్టులో విజయం దిశగా సాగుతోంది. ఓవర్ నైట్ స్కోరు 140/4తో మూడో రోజు గురువారం ఆట ప్రారంభించిన శ్రీలంక అండర్– 19 జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 316 పరుగులకు ఆలౌటైంది. సూరియ బండార (115) శతకం, దినుష (51) అర్ధ శతకాలు సాధించారు.
మోహిత్ జాంగ్రా (4/76) నాలుగు వికెట్లు పడగొట్టగా... బదోని, మంగ్వాని, దేశాయ్ తలా రెండు వికెట్లు తీశారు. ఫాలోఆన్‌లో లంక ఓపెనర్ మిషారా (5)ను అర్జున్ టెండూల్కర్ ఎల్బీగా అవుట్ చేశాడు. ఫెర్నాండో (25), కెప్టెన్ పెరీరా (8) త్వరగానే వెనుదిరిగారు. దీంతో ఆట ముగిసే సమయానికి లంక 47/3తో నిలిచింది. చేతిలో ఏడు వికెట్లు ఉండగా, భారత తొలి ఇన్నింగ్స్ స్కోరు (613/8 డిక్లేర్డ్)కు ఇంకా 250 పరుగులు వెనుకబడి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment