సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లిన టీమిండియా | Under 19 World Cup : India Beat Australia By 74 Runs | Sakshi
Sakshi News home page

అండర్‌ 19 : ఆసీస్‌పై టీమిండియా ఘన విజయం

Published Tue, Jan 28 2020 10:07 PM | Last Updated on Tue, Jan 28 2020 10:08 PM

Under 19 World Cup : India Beat Australia By 74 Runs - Sakshi

పోష్‌స్ట్రూమ్‌ (దక్షిణాఫ్రికా) : అండర్‌ 19 ప్రపంచకప్‌లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగిస్తూ సెమీస్‌కు చేరింది. క్వార్టర్‌ ఫైనల్లో 74 పరుగుల తేడాతో ఆసీస్‌పై విజయం సాధించింది. జైశ్వాల్‌(62) , అన్‌కోలేకర్‌(55, నాటౌట్‌) అర్థ సెంచరీలతో రాణించగా...త్యాగి నాలుగు, ఆకాశ్ సింగ్ మూడు వికెట్లు తీసి అదరహో అనిపించారు. 

టాస్‌ ఓడిపోయి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌.. నిర్ణీత ఓవర్లకు 233 పరుగు చేసింది. ఆ తర్వాత 234 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌.. భారత బౌలర్ల దాటికి  159 పరుగులకే కుప్పకూలింది.  ఆసీస్‌ బ్యాట్స్‌మన్‌లో ఫన్నింగ్ 75 , స్కాట్‌ 35 పరుగులు చేయగా...ముగ్గురు డకౌట్‌లు, ఐదుగురు సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. 74 పరుగుల భారీ తేడాలో విజయం సాధించిన భారత్‌.. సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. నాలుగు వికెట్లు తీసి మ్యాచ్‌ విజయానికి కీలకమైన త్యాగికి మ్యాన్‌ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement