నోట్ల రద్దుతో సెక్స్ వర్కర్లకూ పనిలేదు! | Sex workers at Delhi’s GB Road fear losing all savings | Sakshi
Sakshi News home page

నోట్ల రద్దుతో సెక్స్ వర్కర్లకూ పనిలేదు!

Published Wed, Nov 16 2016 3:01 PM | Last Updated on Mon, Jul 23 2018 9:15 PM

నోట్ల రద్దుతో  సెక్స్ వర్కర్లకూ పనిలేదు! - Sakshi

నోట్ల రద్దుతో సెక్స్ వర్కర్లకూ పనిలేదు!

న్యూ ఢిల్లీ: నవంబర్ 8న ప్రధానమంత్రి నరేంద్రమోదీ పెద్ద నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంతో దేశ వ్యాప్తంగా బిజినెస్లు చతికిలపడ్డాయి. ఢిల్లీ జీబీ రోడ్ రెడ్లైట్ ఏరియాలోని సెక్స్ వర్కర్లు సైతం నోట్ల రద్దుతో తమకు ఏమాత్రం గిరాకీ లేదని తలలు పట్టుకుంటున్నారు. ఈ సంక్షోభం మరికొంత కాలం కొనసాగితే.. తాము ఇప్పటివరకూ కూడబెట్టుకున్న కొద్దోగొప్పో డబ్బుకూడా ఖర్చయిపోతుందని ఆందోళన చెందుతున్నారు.
 
ఇక్కడ ఉన్న సుమారు 5000 మంది సెక్స్ వర్కర్లు పని లేక ఖాళీగా ఉన్నారని తెలుస్తోంది. ఈ ప్రాంతానికి చెందిన రేఖ అనే ఓ సెక్స్ వర్కర్ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ఇక్కడి 80 శాతం మందికి పనిలేదని.. చాలా మంది తమ సొంత ఊళ్లకు పయనమయ్యారని వెల్లడించింది. చేతిలో డబ్బులేకపోవడంతో కస్టమర్లు అటువైపు రావడం లేదని తెలిపింది. దీంతో తమ చార్జీలు సైతం 50 శాతం మేర తగ్గించుకున్నట్లు తెలిపింది. తమ డ్యాన్సులతో అలరించే సెక్స్ వర్కర్లపై సైతం కస్టమర్లు పాత 500, 1000 నోట్లను విసురుతున్నారని తెలిపింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు తప్పవని వాపోయింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement