తల్లి చూస్తుండగానే.. వికృత చేష్టలు | Delhi Metro News Today: Police Arrested Man Who Misbehaves With Minor Girl - Sakshi
Sakshi News home page

Delhi Metro: తల్లి చూస్తుండగానే.. మెట్రోలో వికృత చేష్టలు

Published Thu, Aug 31 2023 12:42 PM | Last Updated on Thu, Aug 31 2023 1:41 PM

Delhi Metro News: Man Misbehaves With girl Detained - Sakshi

ఢిల్లీ: మరోసారి ఢిల్లీ మెట్రో రైలు వార్తల్లో నిలిచింది. ఈసారి అతి జుగుప్సాకరమైన ఘటన వెలుగు చూసింది. తల్లితో రైలులో ప్రయాణిస్తున్న ఓ మైనర్‌ బాలికపై ఓ వ్యక్తి వికృత చేష్టలకు పాల్పడ్డాడు. అది గమనించిన ఆ తల్లి కూతురితో సహా కిందకు దిగిపోగా.. సదరు నీచుడ్ని మెట్రో సిబ్బందికి అప్పగించారు తోటి ప్రయాణికులు. 

బుధవారం ఢిల్లీ మెట్రో రైలు రెడ్‌ లైన్‌ పరిధిలో ఈ ఘటన జరిగింది. రక్షాబంధన్‌ కావడంతో నిన్న సాయంత్రం అంతా మెట్రో రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. ఈ క్రమంలో..  రాత్రి 8.30 గంటల ప్రాంతంలో రెడ్‌ లైన్‌లో ప్రయాణిస్తున్న రైలులో ఓ ప్రయాణికుడు.. ఆ తోపులాటలో పక్కనే ఉన్న బాలికను చూస్తూ వికృత చేష్టలకు పాల్పడ్డాడు. 

అతన్ని గమనించిన ఆమె తల్లి అప్రమత్తమైంది. ఈ లోపు పక్కనే ఉన్న ప్రయాణికులు అతన్ని గమనించి.. నిలదీయసాగారు. దీంతో ఆందోళనకు లోనైన ఆ తల్లి ఆ కూతురిని తీసుకుని సీలంపూర్‌ స్టేషన్‌లో దిగిపోయింది. అయితే.. పక్కనే ఉన్న ప్రయాణికులు మాత్రం అతన్ని పట్టుకుని షాహ్‌దరా స్టేషన్‌లో మెట్రో అధికారులకు అప్పగించారు. ఆపై స్టేషన్‌ సిబ్బంది ఆ వ్యక్తిని పోలీసులకు అప్పగించారు. ఆ కామాంధుడి స్వస్థలం పశ్చిమ బెంగాల్‌ అని, పని కోసం ఢిల్లీకి వచ్చినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు.

ఇదీ చదవండి: వీడు అన్న కాదు.. కామపిశాచి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement