అందువల్లే మొటిమలు వస్తున్నాయా? | Getting so that the pimples? | Sakshi
Sakshi News home page

అందువల్లే మొటిమలు వస్తున్నాయా?

Published Tue, Oct 6 2015 10:56 PM | Last Updated on Sun, Sep 3 2017 10:32 AM

అందువల్లే మొటిమలు వస్తున్నాయా?

అందువల్లే మొటిమలు వస్తున్నాయా?

ప్రైవేట్ కౌన్సెలింగ్ 
 
నా వయుస్సు 17 ఏళ్లు. గత రెండేళ్లుగా హస్తప్రయోగం అలవాటు ఉంది. అది అలవాటైనప్పటి నుంచి నాకు ముఖం, భుజాలు, వీపు మీద మొటిమలు బాగా వస్తున్నారుు. డాక్టర్‌ను సంప్రదించి రకరకాల మందులు వాడాను. అయినా అవి వస్తున్నాయి, తగ్గుతున్నారుు. హస్తప్రయోగం చేయుడం ఆపితే మొటివులు రావడం లేదు. కానీ ఆపుకోలేక వారానికి రెండుసార్లరుునా హస్తప్రయోగం చేస్తూనే ఉన్నాను. మొటిమలు రాకుండా ఉండాలంటే ఏం చేయూలి. మొటిమల వల్ల ఎవరికీ నా ముఖం చూపించుకోలేకపోతున్నాను. నాకు తగిన సలహా ఇవ్వండి.
 - కే.ఆర్. చిత్తూరు


మీ వయుస్సు పిల్లల్లో హార్మోన్ల ప్రభావం (ప్రధానంగా టెస్టోస్టెరాన్) వల్ల మొటివులు రావడం సాధారణం. ఈ వయుస్సులోనే హస్తప్రయోగం చేయుడం కూడా అలవాటవుతుంది. అరుుతే... హస్తప్రయోగం వల్ల మొటివులు రావు. అసలు హస్తప్రయోగానికీ, మొటివులు రావడానికి ఎలాంటి సంబంధం లేదు. కాకపోతే... పరీక్షల్లాంటి టెన్షన్లు ఉన్నా, ఏవైనా ఇతర ఒత్తిళ్లు ఉన్నా మొటివులు ఎక్కువ కావచ్చు. ఇలా మొటివులు వచ్చినప్పుడు తరచూ వుుఖం కడుక్కోకపోవడం వల్ల, వుుఖం శుభ్రత పాటించకపోవడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చి అవి వురీ పెద్దగా వూరడానికి అవకాశం ఉంది. జన్యుపరమైన కారణాలవల్ల మొటివులు కొందరిలో వురీ ఎక్కువగానూ, కొందరిలో తక్కువగానూ ఉంటారుు. మొటివులు వస్తే అవి ఇన్ఫెక్ట్ కాకుండా చూసుకోవడం తప్ప... వాటికి ఇతరత్రా ఏవిధమైన చికిత్స అవసరం లేదు. అరుుతే వాటిని గిల్లడం వంటి పనులు అస్సలు చేయుకూడదు.
 
 నా వయుస్సు 26 ఏళ్లు. నాకింకా పెళ్లి కాలేదు. నాకు అంగస్తంభన కలిగినప్పుడు నా పురుషాంగం కిందికి ఒంగుతోంది. అంటే ఎరెక్షన్ వచ్చినప్పుడు అంగం అరటిపండు ఆకారంలో ఉంటోంది. దీన్ని కార్డీ అంటారని పేపర్లో చదివాను. దీనికి సర్జరీ ఒక్కటే వూర్గవుని తెలిసింది. ఆపరేషన్ ద్వారా సరి అవుతుందా? ఏ డాక్టర్‌ను సంప్రదించాలి. పెళ్లిచేసుకోవచ్చా?
 -   పి.వి.కె., నలొండ


 అంగస్తంభన కలిగినప్పుడు అంగం సాధారణంగా నిటారుగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కుడి, ఎడవు పక్కలకు కొద్దిగా ఒంగి ఉన్నా పర్లేదు. కానీ ఆ ఒంపు కాస్తా... వుూత్రవిసర్జనకూ, సెక్స్ చేయుడానికి అడ్డంకిగా ఉన్నంతగా వంగి ఉంటే ఆ పరిస్థితిని కార్డీ అంటారు. వుూత్రనాళం (యుురెథ్ర)గానీ, అంగస్తంభన కలిగించే ఎరెక్టైల్ బాడీస్‌లోగానీ సరిగ్గా పెరుగుదల లేక తేడాలు (డిస్పారిటీస్) రావడం వల్ల ఈ కార్డీ అనే కండిషన్ వస్తుంది. ‘సర్జరీ కార్డీ కరెక్షన్’ ఆపరేషన్‌తో ఒంపును బట్టి ఓవైపు పొడవు పెంచడమో, వురోవైపు తగ్గించడమో చేసి అంగాన్ని వుళ్లీ నిటారుగా ఉండేలా సరిచేస్తారు. అరుుతే ఈ సర్జరీకి వుుందు యుూరాలజిస్టులు ఆర్టిఫిషియుల్‌గా ఎరెక్షన్ తెప్పించి కార్డీ తీవ్రత ఎంత ఉందో నిర్ధరణ చేస్తారు. దాన్ని బట్టే సర్జరీ చేయూల్సిన అవసరం ఉందా లేదా అన్నది నిర్ణరుుస్తారు.
 
   
నాకు వరిబీజం వచ్చింది. ఆపరేషన్ అంటే భయుం. ఒక ఆర్‌ఎంపీని కలిస్తే ఆయున సిరంజీతో నీరు తీసేశాడు. ఇప్పుడు పొట్టలో ఎడవుపక్కన, వెనకభాగంలో వాచినట్లు అనిపిస్తోంది. ఒకసారి స్కానింగ్ కూడా తీయించుకున్నాను. టౌన్‌లో డాక్టర్ సవుస్య ఏమీ లేదన్నారు. కానీ నాకు వృషణాల వాపు వస్తూనే ఉంది. చాలా ఆందోళనగా ఉంది. మీరు తగిన సలహా ఇవ్వగలరు.
 - జే.వి.వి., విజయవాడ


 వరిబీజం (హైడ్రోసిల్) అంటే వృషణాల చుట్టూ నీరు చేరడం. ఈ సవుస్య ఉన్నప్పుడు శస్త్రచికిత్స చేసి అక్కడ చేరిన నీరు తొలగిస్తారు. అంతేకాదు... డాక్టర్లు ఆ నీరు వచ్చే పొరను కూడా తీసివేయుడం, లేదా వుళ్లీ వుళ్లీ నీరు రాకుండా ఆ పొరను వెనక్కు వుడతపెట్టడం కూడా చేస్తారు. ఇలా శస్త్రచికిత్స చేరుుంచుకోకుండా సిరంజీతో నీటిని తీస్తే తాత్కాలికంగా నీరు తొలగి వృషణాల సంచి సైజ్ తగ్గినట్లుగా అనిపిస్తుంది. అరుుతే కొద్దిరోజుల్లోనే వుళ్లీ నీరు చేరడం, ఒక్కోసారి రక్తం కూడా చేరడం, సెకండరీ ఇన్ఫెక్షన్స్ రావడం జరుగుతారుు. అందువల్ల సిరంజీ ద్వారా నీరు తీరుుంచడం ఏవూత్రం వుంచిది కాదు. హైడ్రోసిల్ సవుస్య ఉంటే తప్పనిసరిగా శస్త్రచికిత్స చేరుుంచుకోవాలి.
 
   
నా వయుస్సు 41 ఏళ్లు. నాకు 22 ఏళ్ల క్రితం పెళ్లరుు్యంది. అప్పటినుంచి నేను సెక్స్‌లో ఎలాంటి అవాంతరాలు లేకుండా పాల్గొంటున్నాను. అరుుతే నాకు ఒక ఏడాది క్రితం అంగం ఎడవువైపునకు 45 డిగ్రీలు ఒంపు తిరిగింది. ఈ వంకర సెక్స్‌లో పాల్గొన్నప్పుడు వూత్రమే ఉంటోంది. ప్రస్తుతానికి దీనిల్ల సెక్స్‌కు ఎలాంటి అవరోధం లేకపోరుునా భవిష్యత్తులో ఏమైనా ఇబ్బందులు జరిగే అవకాశం ఉందా? ఈ వంకరకు కారణం ఏమిటి?
 - ఎన్‌ఆర్‌జీ, ఖమ్మం


పురుషాంగం వంకరగా ఉండటం కొంతవరకు సాధారణం. దీనివల్ల సెక్స్‌లో పాల్గొనడానికి సవుస్య లేకపోతే అంగం కొంత వంకరగా ఉన్నా నష్టం ఏమీ లేదు. మీరు చెప్పిన విధంగా ఈ సవుస్య ఒక సంవత్సరం నుంచే ఉంటే కొన్నిసార్లు పెరోనిస్ డిసీజ్‌కు అయ్యేందుకు అవకాశం ఉంది. ఇందులో అంగం మీద ఒకవైపు ఉన్న లోచర్మం గట్టిపడి ఎలాస్టిక్ స్వభావం తగ్గుతుంది. యుూరాలజిస్ట్ పురుషాంగాన్ని పరీక్షిస్తే దీన్ని కనుక్కుంటారు. ఇలాంటి సవుస్య వల్ల మీకు ఎలాంటి సవుస్య లేకపోతే ఈ వంకరకు చికిత్స అవసరమే లేదు. పెరోనిస్ డిజీజ్‌తో సెక్స్ సావుర్థ్యానికి లోపం ఉండదు. ఒకవేళ చికిత్స తీసుకోవాలనుకున్నా యుూరాలజిస్ట్ ద్వారా పొందవచ్చు.
 
   
నా వయస్సు 28 ఏళ్లు. నా పురుషాంగంపైన అంటే ముందు ఉండే గుండ్రటి భాగంలో చిన్న చిన్న బుడిపెలు ఉన్నాయి. ఎందువల్ల వచ్చాయో తెలియడం లేదు. నాకు చాలా ఆందోళనగా ఉంది. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి.
 - సీహెచ్.ఎస్., కరీంనగర్,

 పురుషాంగం ముందు భాగం (గ్లాన్స్) మీద చిన్న చిన్న బుడిపెలు ఉండటం చాలా సాధారణం. ముఖం మీద మొటిమల్లాగే వీటిల్లోంచి కూడా స్రావాలు తయారవుతూ ఉంటాయి. కొందరికి అవి చుట్టూరా తెల్లగా బుడిపెలు, బుడిపెలుగా సాధారణం కంటే పెద్దగా ఉండవచ్చు. గట్టిగా నొక్కితే తెల్లటి స్రావం కూడా వస్తుంది. ఇవన్నీ చాలా సాధారణం. చాలామంది వీటిని ఇన్ఫెక్షన్ అనుకుంటారు. నొప్పి, మంట, దురద లేకుంటే ఈ చిన్న బుడిపెల గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement