Private counseling
-
నేను పెళ్లికి అర్హుడినేనా?
ప్రైవేట్ కౌన్సెలింగ్ పురుషుల సందేహాలకు సమాధానాలు నెల తప్పాక సాధారణంగా మొదటి మూడు నెలలు సెక్స్‌ను అవాయిడ్ చేయడం మంచిది. నాలుగో నెల నుంచి ఆరో నెల వరకు సెక్స్‌లో మామూలుగానే పాల్గొనవచ్చు. అయితే ఆ సమయంలో అసాధారణ భంగిమల్లో సెక్స్ చేయడం అంత మంచిది కాదు. నా వయసు 30 ఏళ్లు. పెళ్లి కాలేదు. ఇంతకు మునుపు స్త్రీని చూడగానే విపరీతమైన కోరిక కలిగేది. ఎవరైనా ఆడవాళ్లు యాదృచ్ఛికంగా టచ్ అయినా... మూడు నాలుగుసార్లు హస్తప్రయోగం చేసేవాడిని. ఇప్పుడు అలా చేయలేకపోతున్నాను. పైగా హస్తప్రయోగం చేసుకుందామన్నా అంగస్తంభన నిలవడం లేదు. ఇంట్లోవాళ్లు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నేను పెళ్లికి అర్హుడినేనా? దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. - ఎస్.ఆర్.జి. మల్కాజ్గిరి ఈమధ్య యుక్తవయసులో ఉన్నవారు 30 వరకు పెళ్లిచేసుకోకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పాతికేళ్లలోపు వారిలో సామాజిక బ్యాధతలు అంతగా తెలియకపోవడం వల్ల సెక్స్ కోరికలు, సెక్స్ ఆలోచనలు, అంగస్తంభన ఇవన్నీ కాస్త ఉద్ధృతంగానే ఉంటాయి. ఆ తర్వాత సామాజికపరమైన ఒత్తిళ్ల వల్ల హస్తప్రయోగంలో తృప్తి పూర్తిగా పొందలేకపోవడం వల్ల అంగస్తంభన కొంత తక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇది కేవలం వారి ఫీలింగ్ మాత్రమే. ఇలాంటి వాళ్లలో చాలామంది ఎలాంటి సమస్య లేకుండా సెక్స్ జీవితాన్ని సజావుగానే కొనసాగించగలరు. మీరు ఆర్జనపరులైతే వెంటనే పెళ్లి చేసుకోండి. ఇక నిద్రలోనూ అంగస్తంభనలు లేకపోవడం, సెక్స్ కోరికలు అసలేమీ లేకపోవడం వంటి లక్షణాలు ఉంటేనే మీకు యాండ్రాలజిస్ట్ సహాయం అవసరమవుతుంది. అలాంటి లక్షణాలు లేకపోతే మీరు నార్మల్‌గా ఉన్నట్లే. పెళ్లికి పూర్తిగా అర్హులే. నిర్భయంగా ఉండండి. నా వయసు 20 ఏళ్లు. ఈమధ్యే నా భార్యకు ప్రెగ్నెన్సీ వచ్చింది. మేము ఎప్పటి వరకు సెక్స్‌లో పాల్గొనవచ్చు. గర్భం వచ్చాక కూడా సెక్స్ చేస్తుంటే ఏమైనా ప్రమాదమా? - ఎస్.పి.ఆర్., తెనాలి నెల తప్పాక సాధారణంగా మొదటి మూడు నెలలు (అంటే మొదటి ట్రైమిస్టర్లో) సెక్స్‌ను అవాయిడ్ చేయడం మంచిది. నాలుగో నెల నుంచి ఆరో నెల వరకు (రెండో ట్రైమిస్టర్లో) సెక్స్‌లో మామూలుగానే పాల్గొనవచ్చు. అయితే ఆ సమయంలో అసాధారణ భంగిమ (అబ్నార్మల్ పొజీషన్స్)ల్లో సెక్స్ చేయడం అంత మంచిది కాదు. అలాగే బలమైన స్ట్రోక్స్ అవాయిడ్ చేయడమే మంచిది. చివరి మూడు నెలల్లోనూ సెక్స్‌ను కాస్త కొంతమేరకు అవాయిడ్ చేయగలిగితే మంచిది. అయితే పైపైనే సెక్స్ చేయడం, ఒకరినొకరు సెక్స్‌పరమైన ప్రేరేపణలు చేసుకుని ఆనందించడం వల్ల ప్రమాదం ఉండదు. మీ భార్య ప్రెగ్నెన్సీ సమయంలోనైనా లేదా మామూలు సమయాల్లోనైనా మీ ఇద్దరూ ప్రైవేట్ పార్ట్స్‌ను శుభ్రంగా ఉంచుకోవడం కూడా ఎంతో అవసరం. నా వయసు 69 ఏళ్లు. మూత్రం విసర్జనకు చాలా ఎక్కువ సమయం పడుతోంది. చుక్కలు చుక్కలుగా పడుతోంది. రాత్రి వేళల్లో చాలాసార్లు మూత్రానికి వెళ్లాల్సి వస్తోంది. ఈ సమస్య వల్ల సెక్స్ కూడా సరిగ్గా చేయలేకపోతున్నాను. నాకు షుగర్, బీపీ వంటి జబ్బులు లేవు. నాకు సరైన సలహా ఇవ్వండి. - ఎమ్.డి.కే., అనంతపురం సాధారణంగా అరవై ఏళ్ల వయస్సు పైబడ్డవారిలో ప్రోస్టేట్ గ్రంథి పెరగడం వల్ల మీరు చెబుతున్న లక్షణాలు కనిపిస్తుంటాయి. ఈ గ్రంథి మూత్రాశయానికి, మూత్రనాళానికి మధ్య ఉంటుంది. ఇది పరిమాణం చాలా పెద్దగా పెరగడం వల్ల మూత్రనాళం బ్లాక్ అయిపోయి మీరు చెబుతున్న సమస్య వస్తుంది. ఇది పెరగడానికి సెక్స్ చేయలేకపోవడానికి సంబంధం లేదు. కాకపోతే మీరు రాత్రిపూట చాలాసార్లు లేవడం వల్ల నిద్ర డిస్టర్బ్ అయి మీకు సెక్స్ సమస్య వచ్చి ఉండవచ్చు. ఈ ప్రోస్టేట్ సమస్యను మందులతో, టీయూఆర్‌పీ అనే కుట్టు లేని ఆపరేషన్‌తో గాని పరిష్కరించవచ్చు. ఆ తర్వాత మీకు రాత్రిపూట నిద్రబాగా పడుతుంటే మీ సెక్స్ సమస్య కూడా పరిష్కారం అయ్యే అవకాశాలు ఎక్కువ. నా వయసు 29 ఏళ్లు. పురుషాంగం పైనా, వృషణాల మీద చిన్న చిన్న చెమటకాయల్లా వచ్చాయి. అవి క్రమంగా పెద్దవి అవుతుంటే డాక్టర్‌కు చూపించుకున్నాను. సబేషియస్ సిస్ట్స్ అని చెప్పి సర్జరీ చేయాలన్నారు. శస్త్రచికిత్స తర్వాత ఇవి తగ్గుతాయా? డాక్టర్ నుంచి శస్త్రచికిత్స అన్న మాట విన్నప్పట్నుంచి అంగస్తంభనలు లేవు. నేను పెళ్లి చేసుకోవచ్చా? భవిష్యత్తులో సంసార జీవితానికి పనికివస్తానా? పిల్లలు పుడతారా? నాకు తగిన సలహా ఇవ్వండి. - ఎస్.కె.ఎస్., జగ్గయ్యపేట సెబేషియస్ సిస్ట్స్ అనేవి వృషణాల మీద ఉన్న చర్మంపై తెల్లటి లేదా పచ్చటి రంగులో వస్తుంటాయి. ఇవి చర్మం పైపొరకు మాత్రమే పరిమితం. ఇలాంటి వాటి సంఖ్య పెరుగుతూ పోతున్నప్పుడు వాటిని శస్త్రచికిత్సతో తొలగించాల్సి ఉంటుంది. ఇలా చేసే చికిత్స ప్రక్రియలో కేవలం చర్మం పైభాగం నుంచి మాత్రమే వాటిని డాక్టర్లు తొలగిస్తారు. వృషణాలకు గానీ... ఇతరత్రా కీలకమైన నరాలకు గానీ ఎలాంటి గాటూ పెట్టడం జరగదు. డాక్టర్‌నుంచి సమాచారం విన్న వెంటనే మీకు అంగస్తంభనలు లేకపోవడం అన్నది కేవలం మీరు మానసికంగా కుంగిపోవడం వల్ల జరిగిందే. అంతేగానీ వృషణాలకు గాని, అంగస్తంభనలకు గాని, వీర్యం తయారీకి గాని ఈ సర్జరీతో ఏమాత్రం సంబంధం ఉండదు. గుర్తుంచుకోవాల్సి విషయం ఏమిటంటే... కొందరిలో ఇలాంటి సిస్ట్స్ మళ్లీ మళ్లీ వస్తుంటాయి. అప్పుడు మళ్లీ పరిస్థితిని సమీక్షించి తగిన చికిత్స తీసుకోవాల్సి రావచ్చు. మీ శస్త్రచికిత్స తర్వాత మీరు మామూలుగానే సెక్స్ చేయవచ్చు. ఈ సమస్యకూ పిల్లలు కలగకపోవడానికీ ఎంతమాత్రమూ సంబంధం లేదు. మీరు నిర్భయంగా పెళ్లి చేసుకోవచ్చు. నా వయసు 29 ఏళ్లు. నా భార్య వయసు 27 ఏళ్లు. పెళ్లయి నాలుగేళ్లు అయ్యింది. ఇంకా పిల్లలు లేరు. నా భార్యకు రెగ్యులర్‌గా పీరియడ్స్ వస్తాయి. ఒక ఏడాది తర్వాత డాక్టర్‌ను సంప్రదిస్తే నా భార్యలో ఏ లోపం లేదని చెప్పారు, నాలోనే వీర్యకణాలు తక్కువగా (కేవలం 25 శాతం) ఉన్నాయని మందులు ఇచ్చారు. నెలలో 50 శాతం పెరిగాయని మందులు కంటిన్యూ చేయమన్నారు. నేను ఇలా ఎన్నిరోజులు మందులు వాడాలి? సంతానం కోసం మేము ఏ టైమ్‌లో సెక్స్ చేయాలి? - జె.ఆర్.ఆర్., కొత్తగూడెం పురుషులలో వీర్యకణాలు తక్కువగా ఉండే కండిషన్‌ను ఆలిగోస్పెర్మియా అంటారు. దీనికి చాలా కారణాలు ఉంటాయి. అందులో ప్రధానమైనది వేరికోసిల్. దీన్ని డాప్లర్ అల్ట్రాసౌండ్ స్క్రోటమ్ (వృషణాలకు స్కానింగ్) పరీక్ష ద్వారా కనుగొంటారు. ఈ వేరికోసిల్ (అంటే రక్తనాళాల వాపు) ఉంటే, దానికి సర్జరీ అవసరమవుతుంది. ఒక వేరికోసిల్ లేకపోతే ప్రధానంగా మందులు వాడితే సరిపోతుంది. ఈ మందుల వల్ల కనీసం స్పెర్మ్‌కౌంట్ 20 మిలియన్/ఎమ్ఎల్ దాటితే సాధారణంగా గర్భం (న్యాచురల్ ప్రెగ్నెన్సీ)కి అవకాశం ఉంటుంది. ఇలా 20 మిలియన్ కంటే స్పెర్మ్ కౌంట్ ఉన్నవాళ్లు మిడ్ సైకిల్ అంటే... రుతుస్రావం మొదలైన ఎనిమిదవ రోజు నుంచి 18వ రోజు వరకు రెగ్యులర్‌గా సెక్స్‌లో పాల్గొనాలి. అలా ఆర్నెల్లలో పిల్లలు కలగకపోతే ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ద్వారా ప్రయత్నించవచ్చు. ఒకవేళ స్పెర్మ్‌కౌంట్ 20 మిలియన్ లేకపోతే కొన్ని హార్మోన్ పరీక్షలు, యాంటీస్పెర్మ్ యాంటీబాడీ పరీక్ష చేసి కొన్నిసార్లు వాటికి మందులతో చికిత్స చేయవచ్చు. మీరు శాస్త్రీయ పద్ధతుల్లో చికిత్స చేయించుకుంటే పిల్లలు పుట్టడానికి అవకాశం ఉంటుంది. ఆందోళన పడాల్సిన అవసరం లేదు. - డాక్టర్ వి.చంద్రమోహన్ యూరో సర్జన్ అండ్ యాండ్రాలజిస్ట్, ప్రీతి యూరాలజీ అండ్ కిడ్నీ హాస్పిటల్, కెపిహెచ్బి, హైదరాబాద్ -
దీనివల్ల భవిష్యత్తులో ఎలాంటి సమస్యా రాదా?
ప్రైవేట్ కౌన్సెలింగ్ నా వయసు 28 ఏళ్లు. ఎలాంటి చెడు అలవాట్లు లేవు. పురుషాంగాన్ని ప్రతిరోజూ శుభ్రపరచుకుంటాను. అరుుతే ఈవుధ్య అంగం మీది చర్మం వుునుపటిలా వెనక్కురావడం లేదు. బలవంతంగా వెనక్కు నెడితే క్రాక్స్ ఏర్పడి రక్తం వస్తోంది. ఈ సవుస్య నన్ను ఆందోళనకు గురిచేస్తోంది. నాకు తగిన సలహా ఇవ్వండి. - డి.కె.ఎస్., తుని పురుషాంగం మీది చర్మం ఫ్రీగా వెనక్కు వెళ్లకుండా ఉండే పరిస్థితిని ఫైమోసిస్ అంటారు. ఒక్కోసారి ఫైమోసిస్ వల్ల చర్మం చివరి భాగంలో క్రాక్స్ వచ్చి ఇన్ఫెక్షన్కు దారితీసే అవకాశం ఉంటుంది. ఇలాంటప్పుడు సెక్స్ చేస్తే నొప్పిరావచ్చు. ఒక్కోసారి చర్మం వెనక్కి వెళ్లి వుళ్లీ వుుందుకు రాకపోతే వాపు కూడా రావచ్చు. యుుక్తవయుసులో ఇలా చర్మం ఫ్రీగా వుుందుకు, వెనక్కు రాకపోతే సున్తీ చేరుుంచుకోవడం వుంచిది. దీనివల్ల వ్యక్తిగత పరిశుభ్రత (పర్సనల్ హైజీన్) పాటించడం కూడా సులువు. సెక్స్ చేయుడానికీ అనువుగా ఉంటుంది. నాకు 35 ఏళ్లు. పెళ్లయి పదేళ్లు అయ్యింది. సెక్స్ చేసిన తర్వాత మూత్రనాళంలో మంట అనిపిస్తోంది. చాలా నీరసంగా ఉంటోంది. ఏడాది క్రితం కనీసం రోజులో ఒకసారి సెక్స్ చేయగలిగే. వాణ్ణి. ఇప్పుడు వారానికి రెండుసార్లు మాత్రమే సెక్స్ చేయగలుగుతున్నాను. ఈమధ్య నాకు షుగర్ కూడా వచ్చింది. దీనివల్లనే ఈ సమస్య వచ్చిందా? నా సమస్యకు పరిష్కారం చూపగలరు. - జె.ఎన్., ఏలూరు సాధారణంగా సెక్స్ కోరికలు 20 నుంచి 30 ఏళ్ల మధ్య చాలా ఎక్కువగా ఉంటాయి. వివాహమైన 10 ఏళ్ల తర్వాత ముందున్నంత ఉత్సాహం ఉండకపోవడం సహజం. షుగర్, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవాళ్లలో ముఖ్యంగా ఒకేచోట కుదురుగా కూర్చుని పనిచేసేవాళ్లలో (సెడెంటరీ లైఫ్‌స్టైల్ ఉన్నవాళ్లలో) సెక్స్‌సామర్థ్యం కాస్తంత తగ్గుతుంది. దీనికితోడు ఆ ఈడులో ఉండే బాధ్యతల వల్ల వచ్చే మానసిక సమస్యలు కూడా కొంత సెక్స్ సామర్థ్య లోపం ఏర్పడుతుంది. దీనికి కౌన్సెలింగ్ ద్వారా, కొన్ని సందర్భాల్లో మందులతో నార్మల్ సెక్స్‌ను పొందేలా చేయవచ్చు. మీ బ్లడ్ షుగర్‌ను నియంత్రణలో పెట్టుకుని, ప్రతిరోజూ వ్యాయామం చేస్తూ, మానసికంగా ఉల్లాసంగా ఉండటం ద్వారా మీ సామర్థ్యలోపాన్ని చాలావరకు నివారించుకోవచ్చు. నా కంఠస్వరం మరీ మహిళల గొంతులా ఉంటోంది. దాంతో నలుగురిలో మాట్లాడలేకపోతున్నాను. ఇది హార్మోన్ల సమస్య అని, యాండ్రాలజిస్ట్‌ను కలవమని కొందరు సూచించారు. ఒక డాక్టర్‌ను కలిస్తే చిన్నప్పట్నుంచీ గొంతు అలాగే ఉంటే యాండ్రాలజిస్ట్‌ను కలిసినా లాభంలేదు అంటున్నారు. ఈ విషయంలో నాకు సలహా ఇవ్వండి. - ఎస్.ఆర్.పి., కర్నూలు మీకు సెక్స్ కోరికలు, అంగస్తంభనలతో పాటు సెకండరీ సెక్సువల్ కారెక్టర్స్ అయిన మీసాలు-గడ్డాలు పెరగడం నార్మల్‌గా ఉంటే... మీ శరీరంలోని హార్మోన్ల సమతౌల్యం బాగానే ఉందని అర్థం. ఇలా ఉంటే మీరు మీ సెక్స్ జీవితం విషయంలో ఆందోళన పడాల్సిందేమీ లేదు. పదమూడో ఏటి నుంచి 20 ఏళ్ల వరకు సెకండరీ సెక్సువల్ కారెక్టర్లలో భాగంగానే పురుషుల్లో స్వరం మార్పు జరుగుతుంది. దీనికి అనేక జన్యుపరమైన అంశాలు దోహదపడతాయి. అన్ని హార్మోన్లూ నార్మల్‌గా ఉన్నా కొందరిలో స్వరంలో ఇలా కీచుదనం ఉంటుంది. దీనికి ప్రత్యేకంగా చికిత్స అంటూ ఉండదు. అయినా ఒకసారి మీరు హార్మోన్ల పరీక్ష చేయించుకుని యాండ్రాలజిస్ట్‌ను గాని, ఈఎన్టీ సర్జన్‌ను గాని కలవండి. నాకు 28 ఏళ్లు. పెళ్లయి ఆర్నెల్లు అయ్యింది. నేను ప్రతిరోజూ సెక్స్ చేస్తున్నాను. అయితే అంగస్తంభన బాగానే ఉన్నా వీర్యస్ఖలనం మాత్రం త్వరగా అయిపోతోంది. ఒకసారి వీర్యస్ఖలనం అయ్యక మళ్లీ అంగస్తంభన కలగడం లేదు. దాంతో నా భార్య సెక్స్‌లో సంతృప్తి చెందలేకపోతోంది. ఇద్దరమూ నిరాశ చెందుతున్నాం. ఈ సమస్యకు పరిష్కారం చెప్పండి. - కె.ఎస్.పి.ఆర్., విజయవాడ మీరు చెప్పిన కండిషన్‌ను ప్రీ-మెచ్యూర్ ఇజాక్యులేషన్ అంటారు. ఇది పురుషుల్లో చాలా సాధారణంగా కనిపించే సమస్య. వీర్యస్ఖలనం అన్నది ఒక రిఫ్లెక్స్ యాక్టివిటీ. సెక్స్ ప్రక్రియలో అంగం మీద ఉన్న చర్మం ఉత్తేజితం కావడం వల్ల ఈ వీర్యస్ఖలనం అన్న రిఫ్లెక్స్ ప్రక్రియ జరుగుతుంది. కొంతమందిలో ఈ స్పందనలు (స్టిమ్యులేషన్స్) త్వరగా కలగడం వల్ల వీర్యస్ఖలనం వెంటనే జరిగిపోతోంది. ఇలాంటి వాళ్లు సెక్స్‌లో నేరుగా పాల్గొనకుండా తగినంత ప్రీ ప్లే చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది. దాంతోపాటు వీర్యస్ఖలనం ఫీలింగ్ రాగానే వెంటనే అంగాన్ని బయటకు తీసి పురుషాంగం చివర (శిశ్నం వెనక భాగంలో) గట్టిగా నొక్కి పట్టుకోవాలి. స్ఖలనం ఫీలింగ్ తగ్గగానే మళ్లీ సెక్స్ చేయడం ప్రారంభించాలి. ఇలా నొక్కి పట్టుకుని స్ఖలనాన్ని నియంత్రించే ప్రక్రియను ‘పించ్ అండ్ స్టార్’ టెక్నిక్ అంటారు. ఈ పించ్ అండ్ స్టార్ట్ టెక్నిక్‌తోనూ మీ సమస్య తగ్గకపోతే ఆండ్రాలజిస్ట్‌ను కలవండి. మీరు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. కౌన్సెలింగ్‌తో, మందులతో మీ కండిషన్‌కు చికిత్స చేయవచ్చు. నా వయుస్సు 35 ఏళ్లు. ఇంకా పెళ్లి కాలేదు. నేను గతంలో కొంతమంది అమ్మాయిలతో సెక్స్ చేశాను. నాకు ఇటీవలే పెళ్లి నిశ్చయుం అరుు్యంది. ఆ అవ్మూరుుతో కూడా నేనొకసారి కలవడానికి ప్రయత్నించాను. అరుుతే అప్పుడు అంగస్తంభన సరిగా జరగలేదు. ఒక్క నిమిషంలోనే వీర్యస్ఖలనం అరుుపోరుుంది. నేను సెక్స్ జీవితానికి పనికిరానేమో అని ఆందోళనగా ఉంది. దయుచేసి సలహా ఇవ్వండి. - జీ.ఆర్.ఎన్., నెల్లూరు మీది యూంగ్జైటీ న్యూరోసిస్ అనే వూనసిక సవుస్య కావచ్చు. మీకూ, మీ జీవిత భాగస్వామికీ కొంత పరిచయుం పెరిగిన తర్వాత క్రవుంగా మీ భయూలు తగ్గి మీరు నార్మల్‌గా సెక్స్ చేయుడానికి వీలుంటుంది. పెళ్లికాకవుుందే సెక్స్‌లో పాల్గొనడం వల్ల ఇలాంటి భయూలూ, అపోహలు ఎక్కువవుతారుు. కాబట్టి వీలైనంత త్వరగా పెళ్లి చేసుకొని భయూందోళనలు లేని సెక్స్ జీవితాన్ని గడపండి. నా వయస్సు 28 ఏళ్లు. గత పదేళ్లుగా హస్తప్రయోగం చేసుకుంటూ ఉన్నాను. దీనివల్ల భవిష్యత్తులో సెక్స్ సమస్య వస్తుందేమోనని ఇటీవల ఆ అలవాటు మానేశాను. అయితే ఇప్పుడు నిద్రపోతున్నప్పుడు కలలో స్ఖలనం అవుతోంది. స్వప్నస్ఖలనాల వల్ల సెక్స్ బలహీనత వస్తుందని, దీనివల్ల భవిష్యత్తులో సెక్స్ చేయాలేనేమో అనిపిస్తోంది. మందు ఇస్తామని కొందరు చెబుతున్నారు. నాకు తగిన సలహా ఇవ్వండి. - రాజ్, అనంతపురం యౌవనదశలో మీలాగా హస్తప్రయోగం చేసుకోవడం పురుషులందరిలోనూ దాదాపుగా ఉండే అలవాటు. దీనివల్ల భవిష్యత్తులో ఎలాంటి సమస్యా రాదు. మీరు అనవసరంగా అపోహతో హస్తప్రయోగం ఆపేశారు. అయితే మీరు ఈ ప్రక్రియను ఆపేసినా వృషణాల్లో వీర్యం ఉత్పత్తి ప్రక్రియ అలాగే కొనసాగుతుంటుంది. ఇలా ఉత్పన్నం అయిన వీర్యం మీకు నిద్రలో పోతోంది. ఇది స్వాభావికంగా జరిగే ఒక ప్రక్రియ. దీనికోసం మందులు వాడనవసరం లేదు. మందులు ఇస్తామంటున్నవారు మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. వారు బహుశా మీ బలహీనత నుంచి లబ్ధిపొందుతున్నారు. మీరు అన్నివిధాలా నార్మల్‌గా ఉన్నారు. మందులు వాడనవసరం లేదు. కెరియర్లో స్థిరపడి త్వరగా పెళ్లిచేసుకొని, మంచి దాంపత్య జీవితాన్ని ఎంజాయ్ చేయండి. డాక్టర్ వి. చంద్రమోహన్ యూరో సర్జన్ అండ్ యాండ్రాలజిస్ట్, ప్రీతి యూరాలజీ అండ్ కిడ్నీ హాస్పిటల్, కెపిహెచ్బి, హైదరాబాద్ -
అందువల్లే మొటిమలు వస్తున్నాయా?
ప్రైవేట్ కౌన్సెలింగ్ నా వయుస్సు 17 ఏళ్లు. గత రెండేళ్లుగా హస్తప్రయోగం అలవాటు ఉంది. అది అలవాటైనప్పటి నుంచి నాకు ముఖం, భుజాలు, వీపు మీద మొటిమలు బాగా వస్తున్నారుు. డాక్టర్‌ను సంప్రదించి రకరకాల మందులు వాడాను. అయినా అవి వస్తున్నాయి, తగ్గుతున్నారుు. హస్తప్రయోగం చేయుడం ఆపితే మొటివులు రావడం లేదు. కానీ ఆపుకోలేక వారానికి రెండుసార్లరుునా హస్తప్రయోగం చేస్తూనే ఉన్నాను. మొటిమలు రాకుండా ఉండాలంటే ఏం చేయూలి. మొటిమల వల్ల ఎవరికీ నా ముఖం చూపించుకోలేకపోతున్నాను. నాకు తగిన సలహా ఇవ్వండి. - కే.ఆర్. చిత్తూరు మీ వయుస్సు పిల్లల్లో హార్మోన్ల ప్రభావం (ప్రధానంగా టెస్టోస్టెరాన్) వల్ల మొటివులు రావడం సాధారణం. ఈ వయుస్సులోనే హస్తప్రయోగం చేయుడం కూడా అలవాటవుతుంది. అరుుతే... హస్తప్రయోగం వల్ల మొటివులు రావు. అసలు హస్తప్రయోగానికీ, మొటివులు రావడానికి ఎలాంటి సంబంధం లేదు. కాకపోతే... పరీక్షల్లాంటి టెన్షన్లు ఉన్నా, ఏవైనా ఇతర ఒత్తిళ్లు ఉన్నా మొటివులు ఎక్కువ కావచ్చు. ఇలా మొటివులు వచ్చినప్పుడు తరచూ వుుఖం కడుక్కోకపోవడం వల్ల, వుుఖం శుభ్రత పాటించకపోవడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చి అవి వురీ పెద్దగా వూరడానికి అవకాశం ఉంది. జన్యుపరమైన కారణాలవల్ల మొటివులు కొందరిలో వురీ ఎక్కువగానూ, కొందరిలో తక్కువగానూ ఉంటారుు. మొటివులు వస్తే అవి ఇన్ఫెక్ట్ కాకుండా చూసుకోవడం తప్ప... వాటికి ఇతరత్రా ఏవిధమైన చికిత్స అవసరం లేదు. అరుుతే వాటిని గిల్లడం వంటి పనులు అస్సలు చేయుకూడదు. నా వయుస్సు 26 ఏళ్లు. నాకింకా పెళ్లి కాలేదు. నాకు అంగస్తంభన కలిగినప్పుడు నా పురుషాంగం కిందికి ఒంగుతోంది. అంటే ఎరెక్షన్ వచ్చినప్పుడు అంగం అరటిపండు ఆకారంలో ఉంటోంది. దీన్ని కార్డీ అంటారని పేపర్లో చదివాను. దీనికి సర్జరీ ఒక్కటే వూర్గవుని తెలిసింది. ఆపరేషన్ ద్వారా సరి అవుతుందా? ఏ డాక్టర్‌ను సంప్రదించాలి. పెళ్లిచేసుకోవచ్చా? - పి.వి.కె., నలొండ అంగస్తంభన కలిగినప్పుడు అంగం సాధారణంగా నిటారుగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కుడి, ఎడవు పక్కలకు కొద్దిగా ఒంగి ఉన్నా పర్లేదు. కానీ ఆ ఒంపు కాస్తా... వుూత్రవిసర్జనకూ, సెక్స్ చేయుడానికి అడ్డంకిగా ఉన్నంతగా వంగి ఉంటే ఆ పరిస్థితిని కార్డీ అంటారు. వుూత్రనాళం (యుురెథ్ర)గానీ, అంగస్తంభన కలిగించే ఎరెక్టైల్ బాడీస్లోగానీ సరిగ్గా పెరుగుదల లేక తేడాలు (డిస్పారిటీస్) రావడం వల్ల ఈ కార్డీ అనే కండిషన్ వస్తుంది. ‘సర్జరీ కార్డీ కరెక్షన్’ ఆపరేషన్‌తో ఒంపును బట్టి ఓవైపు పొడవు పెంచడమో, వురోవైపు తగ్గించడమో చేసి అంగాన్ని వుళ్లీ నిటారుగా ఉండేలా సరిచేస్తారు. అరుుతే ఈ సర్జరీకి వుుందు యుూరాలజిస్టులు ఆర్టిఫిషియుల్గా ఎరెక్షన్ తెప్పించి కార్డీ తీవ్రత ఎంత ఉందో నిర్ధరణ చేస్తారు. దాన్ని బట్టే సర్జరీ చేయూల్సిన అవసరం ఉందా లేదా అన్నది నిర్ణరుుస్తారు. నాకు వరిబీజం వచ్చింది. ఆపరేషన్ అంటే భయుం. ఒక ఆర్ఎంపీని కలిస్తే ఆయున సిరంజీతో నీరు తీసేశాడు. ఇప్పుడు పొట్టలో ఎడవుపక్కన, వెనకభాగంలో వాచినట్లు అనిపిస్తోంది. ఒకసారి స్కానింగ్ కూడా తీయించుకున్నాను. టౌన్లో డాక్టర్ సవుస్య ఏమీ లేదన్నారు. కానీ నాకు వృషణాల వాపు వస్తూనే ఉంది. చాలా ఆందోళనగా ఉంది. మీరు తగిన సలహా ఇవ్వగలరు. - జే.వి.వి., విజయవాడ వరిబీజం (హైడ్రోసిల్) అంటే వృషణాల చుట్టూ నీరు చేరడం. ఈ సవుస్య ఉన్నప్పుడు శస్త్రచికిత్స చేసి అక్కడ చేరిన నీరు తొలగిస్తారు. అంతేకాదు... డాక్టర్లు ఆ నీరు వచ్చే పొరను కూడా తీసివేయుడం, లేదా వుళ్లీ వుళ్లీ నీరు రాకుండా ఆ పొరను వెనక్కు వుడతపెట్టడం కూడా చేస్తారు. ఇలా శస్త్రచికిత్స చేరుుంచుకోకుండా సిరంజీతో నీటిని తీస్తే తాత్కాలికంగా నీరు తొలగి వృషణాల సంచి సైజ్ తగ్గినట్లుగా అనిపిస్తుంది. అరుుతే కొద్దిరోజుల్లోనే వుళ్లీ నీరు చేరడం, ఒక్కోసారి రక్తం కూడా చేరడం, సెకండరీ ఇన్ఫెక్షన్స్ రావడం జరుగుతారుు. అందువల్ల సిరంజీ ద్వారా నీరు తీరుుంచడం ఏవూత్రం వుంచిది కాదు. హైడ్రోసిల్ సవుస్య ఉంటే తప్పనిసరిగా శస్త్రచికిత్స చేరుుంచుకోవాలి. నా వయుస్సు 41 ఏళ్లు. నాకు 22 ఏళ్ల క్రితం పెళ్లరుు్యంది. అప్పటినుంచి నేను సెక్స్‌లో ఎలాంటి అవాంతరాలు లేకుండా పాల్గొంటున్నాను. అరుుతే నాకు ఒక ఏడాది క్రితం అంగం ఎడవువైపునకు 45 డిగ్రీలు ఒంపు తిరిగింది. ఈ వంకర సెక్స్‌లో పాల్గొన్నప్పుడు వూత్రమే ఉంటోంది. ప్రస్తుతానికి దీనిల్ల సెక్స్‌కు ఎలాంటి అవరోధం లేకపోరుునా భవిష్యత్తులో ఏమైనా ఇబ్బందులు జరిగే అవకాశం ఉందా? ఈ వంకరకు కారణం ఏమిటి? - ఎన్ఆర్జీ, ఖమ్మం పురుషాంగం వంకరగా ఉండటం కొంతవరకు సాధారణం. దీనివల్ల సెక్స్‌లో పాల్గొనడానికి సవుస్య లేకపోతే అంగం కొంత వంకరగా ఉన్నా నష్టం ఏమీ లేదు. మీరు చెప్పిన విధంగా ఈ సవుస్య ఒక సంవత్సరం నుంచే ఉంటే కొన్నిసార్లు పెరోనిస్ డిసీజ్‌కు అయ్యేందుకు అవకాశం ఉంది. ఇందులో అంగం మీద ఒకవైపు ఉన్న లోచర్మం గట్టిపడి ఎలాస్టిక్ స్వభావం తగ్గుతుంది. యుూరాలజిస్ట్ పురుషాంగాన్ని పరీక్షిస్తే దీన్ని కనుక్కుంటారు. ఇలాంటి సవుస్య వల్ల మీకు ఎలాంటి సవుస్య లేకపోతే ఈ వంకరకు చికిత్స అవసరమే లేదు. పెరోనిస్ డిజీజ్తో సెక్స్ సావుర్థ్యానికి లోపం ఉండదు. ఒకవేళ చికిత్స తీసుకోవాలనుకున్నా యుూరాలజిస్ట్ ద్వారా పొందవచ్చు. నా వయస్సు 28 ఏళ్లు. నా పురుషాంగంపైన అంటే ముందు ఉండే గుండ్రటి భాగంలో చిన్న చిన్న బుడిపెలు ఉన్నాయి. ఎందువల్ల వచ్చాయో తెలియడం లేదు. నాకు చాలా ఆందోళనగా ఉంది. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. - సీహెచ్.ఎస్., కరీంనగర్, పురుషాంగం ముందు భాగం (గ్లాన్స్) మీద చిన్న చిన్న బుడిపెలు ఉండటం చాలా సాధారణం. ముఖం మీద మొటిమల్లాగే వీటిల్లోంచి కూడా స్రావాలు తయారవుతూ ఉంటాయి. కొందరికి అవి చుట్టూరా తెల్లగా బుడిపెలు, బుడిపెలుగా సాధారణం కంటే పెద్దగా ఉండవచ్చు. గట్టిగా నొక్కితే తెల్లటి స్రావం కూడా వస్తుంది. ఇవన్నీ చాలా సాధారణం. చాలామంది వీటిని ఇన్ఫెక్షన్ అనుకుంటారు. నొప్పి, మంట, దురద లేకుంటే ఈ చిన్న బుడిపెల గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. -
ముందులాంటి శక్తి కోసం ఏం చేయాలి?
ప్రైవేట్ కౌన్సెలింగ్ నా వయుస్సు 42 ఏళ్లు. నా భార్య వయుస్సు 36 ఏళ్లు. పెళ్లరుు 13 సంవత్సరాలవుతోంది. ప్రస్తుతం నేను నా భార్యతో వారానికి ఒకసారి వూత్రమే సెక్స్‌లో కలుస్తున్నాను. గత ఆర్నెల్లుగా ఇలాగే జరుగుతోంది. పెళ్లరుున కొత్తలో రోజుకు 3, 4 సార్లు సెక్స్ చేసేవాణ్ణి. ఇప్పుడు ఇలా వారానికి ఓసారి వూత్రమే సెక్స్‌లో పాల్గొనడం మా ఇద్దరికీ సంతృప్తి కలిగించడం లేదు. నాకు మునుపటి సామర్థ్యం కలిగేందుకు ఏం చేయాలో చెప్పండి. - వి.ఆర్.కె., ఖమ్మం పెళ్లరుున కొత్తలో మొదట కొన్నేళ్లు సెక్స్‌లో నిత్యం పాల్గొనడం జరుగుతుంది. అరుుతే... ఏళ్లు గడుస్తున్న కొద్దీ కెరియర్ కోసం కష్టపడటం, సావూజిక బాధ్యతలు పెరగడం వంటి కార్యకలాపాల వల్ల మునుపటంత తరచుగా సెక్స్‌లో పాల్గొనలేక పోవచ్చు. మీరు మీ రోజువారీ సవుస్యలనూ, ఇతరత్రా వ్యవహారాలను పక్కన పెట్టి వునసును ప్రశాంతంగా ఉంచుకోండి. రోజూ రెగ్యులర్‌గా వాకింగ్ వంటి వ్యాయూవూలు చేస్తూ, సాధారణ ఆరోగ్యం బాగా ఉండేలా చూసుకొండి. ఇలా చేస్తే చాలావరకు వుళ్లీ మొదట్లోలాగే సెక్స్ చేయుడానికి అవకాశం ఉంటుంది. భార్యతో అవగాహన, ఆమె పట్ల ప్రేవు పెంచుకొని అన్యోన్యంగా మెలిగితే పెర్ఫార్మెన్స్ పెరుగుతుంది. ఇది చాలామంది ఫిర్యాదు చేసే చాలా సాధారణమైన సమస్య. మీ అంతట మీరే తేలిగ్గా అధిగమించవచ్చు. ఒకవేళ మీరు ప్రయత్నించాక కూడా మీ పెర్ఫార్మెన్స్లో వూర్పులేకపోతే యుూరాలజిస్ట్/యూండ్రాలజిస్ట్ను సంప్రదించండి. వారు తాత్కాలికంగా కొన్ని మందులు వాడి, మీలో మునుపటి కాన్ఫిడెన్స్ కలిగేలా చేస్తారు. నా వయసు 27 ఏళ్లు. సెక్స్ సమయంలో త్వరగా స్ఖలనం అయిపోతోంది. శీఘ్రస్ఖలనాన్ని నివారించడానికి కొన్ని డీ-సెన్సిటైజర్స్, లోకల్ అనస్థీషియూ క్రీమ్స్ దొరుకుతాయుని విన్నాను. వాటి వివరాలు చెప్పండి. - ఎమ్.ఆర్.కె., కర్నూలు జ: మీరు చెప్పినట్లే కొన్ని లోకల్ అనస్థీషియూ క్రీమ్స్ ఉన్న వూట వాస్తవమే. అరుుతే అవి వాస్తవ రుగ్మతకు ప్రధాన చికిత్స కాదు. పురుషాంగం మీద ఉండే నరాల ద్వారానే సెక్స్ సమయంలో ఆనందాన్ని, థ్రిల్‌ను ఎవరైనా పొందగలుగుతారు. మీరు చెబుతున్న ఆ లోకల్ అనస్థీషియూటిక్ క్రీములు ఆ నరాలకు సెక్స్‌లోని స్పందనలు అందకుండా చేస్తాయి. స్పర్శ తగ్గేలా చూస్తాయి. దాంతో స్ఖలనం స్టిమ్యులేషన్స్ ఆగినప్పటికీ సెక్స్‌లో సుఖం కూడా తగ్గుతుంది. అందుకే ఈ తరహా క్రీమ్స్, డీ-సెన్సిటైజర్స్ కంటే మీరు పించ్ అండ్ స్టాప్ టెక్నిక్‌ను అవలంబించడం మేలు. అంటే స్ఖలనం ఫీలింగ్ కలిగినప్పుడల్లా కాసేపు సెక్స్‌ను ఆపివేసి, మీ ఎగ్జరుుట్మెంట్ను అదుపు చేసుకోవాలి. దీనివల్ల మీ స్ఖలనంపై మీకే అదుపు వస్తుంది. ఫలితంగా మీరు స్ఖలనాన్ని ఆపుకుంటూ చాలాసేపు సెక్స్ చేయగలరు. పించ్ అండ్ స్టాప్ టెక్నిక్ అవలంబించి చూసి, అప్పటికీ ఫలితం లేకపోతే యాండ్రాలజిస్ట్‌ను కలవండి. నాకు 35 ఏళ్లు. నాకు నిద్రలో అంగస్తంభన బాగానే ఉంటుందిగానీ... మామూలుగా సెక్స్ చేసే సమయంలో అంగస్తంభన తక్కువగా ఉంటుంది. ఇటీవల నాకు గుండెదడగా ఉంటోంది. గుండెదడకు, అంగస్తంభన లేకపోవడానికి ఏదైనా సంబంధం ఉందా? నాకు స్మోకింగ్ అలవాటు ఉంది. దయచేసి నా సమస్యకు తగిన సలహా ఇవ్వండి. - డి.కె., మహబూబ్‌నగర్ ముప్పయి ఐదేళ్ల వయసులో సాధారణంగా రాత్రివేళ నిద్రలో వచ్చే అంగస్తంభనలు మామూలుగానే ఉంటాయి. నిద్రలో వచ్చే అంగస్తంభనలు ఉండటం అన్నది పురుషాంగంలో రక్తప్రసరణ బాగానే ఉన్నది అనడానికి ఒక మంచి సూచన. మీకు గుండెదడ అంటున్నారు. దానికీ, సెక్స్‌కూ ఎలాంటి సంబంధం లేదు. ఈమధ్య ఆల్కహాల్, స్మోకింగ్ అలవాటు ఉన్నవాళ్లతో పాటు కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకునేవాళ్లలో గుండె జబ్బులు చిన్న వయసులోనే కనిపిస్తున్నాయి. మీరు రెడ్‌మీట్ ఎక్కువగా తింటూ ఉంటే, తగ్గించుకొని ఆరోగ్యవంతమైన జీవనశైలిని అనుసరించండి. గుండెదడ అంటున్నారు కాబట్టి ఒకసారి మీరు ఎకో, టీఎంటీ వంటి పరీక్షలు చేయించుకోండి. అవసరాన్ని బట్టి కార్డియాలజిస్ట్‌ను సంప్రదించి గుండెదడను తగ్గించుకునే మందులు వాడండి. ఇవ్వన్నీ నార్మల్‌గా ఉంటే మీరు మామూలుగానే సెక్స్‌లో పాల్గొనవచ్చు. ఒకవేళ మామూలుగా సెక్స్‌లో పాల్గొనడానికి తగినంతగా అంగస్తంభనలు లేకపోతే అప్పుడు దానికి కొన్ని మందులు వాడవచ్చు. అయితే వాటిని కార్డియాలజిస్ట్‌ల క్లియరెన్స్ తర్వాత మాత్రమే యూరాలజిస్ట్ ఇస్తారు. మీరు ముందుగా కార్డియాలజిస్ట్‌ను, యూరాలజిస్ట్‌ను సంప్రదించండి. నా వయసు 28 ఏళ్లు. నాకు పెళ్లయి మూడు నెలలైంది. నేను 109 కిలోల బరువుంటాను. నా పురుషాంగం, వృషణాలు మొదటినుంచీ చిన్నగా ఉంటాయి. తొడల్లో, పొట్టలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. గత మూడు నెలల్లో ఒక్కసారి కూడా సెక్స్ చేయలేకపోయాను. కోరికలు మాత్రం బాగానే ఉన్నా అంగస్తంభన కొద్దిగానే అవుతోంది. మీసాలు, గడ్డాలు కూడా సరిగా లేవు. నా సమస్యకు సరైన పరిష్కారం సూచించండి. - ఎస్.హెచ్.ఆర్., సికింద్రాబాద్ యుక్తవయసులో థైరాయిడ్, ఎల్‌హెచ్, ఎఫ్ఎస్హెచ్, టెస్టోస్టెరాన్ వంటి హార్మోన్స్ లోపం వల్ల జననేంద్రియాల ఎదుగుదల తగ్గవచ్చు. అంతేకాకుండా కొన్నిసార్లు మెదడులో కూడా కొన్ని హార్మోన్ల ఉత్పత్తి తగ్గడం వల్ల శరీర సమతౌల్యత తగ్గుతుంది. అంటే... కొన్ని శరీర భాగాల్లో విపరీతంగా కొవ్వు పెరుగుతుంది. ఇలాంటివాళ్లలో కొంతమందికి షుగర్ కూడా ఉండవచ్చు. అందువల్ల మీ సమస్య ఏమిటో తెలుసుకోడానికి మీరు ముందుగా యాండ్రాలజిస్ట్‌ను, ఆ తర్వాత అవసరాన్ని బట్టి ఎండోక్రైనాలజిస్ట్‌ను... ఇద్దరినీ కలవండి. పైన చెప్పిన హార్మోన్ పరీక్షలు చేయించుకుని మీ సమస్యకు కారణాన్ని కనుక్కోని తగిన చికిత్స చేయవచ్చు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నా వయుస్సు 24 ఏళ్లు. ఇంకా పెళ్లికాలేదు. నాలుగేళ్ల క్రితం హస్తప్రయోగం చేయుడం ఆపేశాను. అప్పట్నుంచి ప్రతిరోజూ రాత్రి నా ప్రమేయుం లేకుండానే వీర్యం పోతోంది. తెల్లారి చూస్తే బట్టలు తడిగా ఉంటున్నాయి. ప్రతిరోజూ వుూత్రంతో పాటు వీర్యం కూడా పోతోంది. వుూత్రంలో వుంట, వృషణాల్లో నొప్పి. డాక్టర్‌ను కలిస్తే ఏమీ పర్వాలేదంటున్నారు. నా పురుషాంగం చిన్న సైజ్‌లో ఉంది. నా సమస్యలు తగ్గడానికి తగిన మందులు ఇవ్వండి. - ఆర్.వి.ఎస్.ఆర్., కోదాడ మీ వయుస్సులో హస్తప్రయోగం చేయుడం, ఏవువుతుందో అని భయుపడి కొంతకాలం వూనేయుడం, అలా వూనేసినప్పుడు వీర్యం కాస్తా వుూత్రంలో పోవడం వూవుూలే. దానివల్ల మీరు బలహీనపడిపోతున్నట్లు మీకు మీరు అనుకోవడం కూడా సాధారణమే. మీలా చాలామంది ఇదే అపోహలో ఉంటారు. ప్రతిరోజూ వృషణాల్లో వీర్యం తయూరవుతుంటుంది. మీరు హస్తప్రయోగం చేయుకపోతే అది వుూత్రంతో పాటు బయుటకు వెళ్తుంది, లేదా నిద్రలో పోతుంది. ఇందువల్ల మీకు ఎలాంటి బలహీనతా రాదు. పురుషాంగం, వృషణాలు చిన్నగా కావడం జరగదు. హస్తప్రయోగం వల్ల ఎలాంటి హానీ ఉండదు. కాబట్టి భయుపడకండి. అంగం స్తంభించి లేనప్పుడు, ఆ వూటకొస్తే స్తంభించినప్పుడు కూడా దాని సైజ్‌ను గురించి ఆలోచించి, దాని గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. సెక్స్‌లో సంతృప్తిగా పాల్గొనాలంటే మీకు సెక్స్ స్పందనలు కలిగినప్పుడు అది గట్టిపడితే చాలు. డాక్టర్ వి. చంద్రమోహన్ యూరో సర్జన్ అండ్ యాండ్రాలజిస్ట్, ప్రీతి యూరాలజీ అండ్ కిడ్నీ హాస్పిటల్, కెపిహెచ్బి, హైదరాబాద్