ముందులాంటి శక్తి కోసం ఏం చేయాలి?
ప్రైవేట్ కౌన్సెలింగ్
నా వయుస్సు 42 ఏళ్లు. నా భార్య వయుస్సు 36 ఏళ్లు. పెళ్లరుు 13 సంవత్సరాలవుతోంది. ప్రస్తుతం నేను నా భార్యతో వారానికి ఒకసారి వూత్రమే సెక్స్‌లో కలుస్తున్నాను. గత ఆర్నెల్లుగా ఇలాగే జరుగుతోంది. పెళ్లరుున కొత్తలో రోజుకు 3, 4 సార్లు సెక్స్ చేసేవాణ్ణి. ఇప్పుడు ఇలా వారానికి ఓసారి వూత్రమే సెక్స్‌లో పాల్గొనడం మా ఇద్దరికీ సంతృప్తి కలిగించడం లేదు. నాకు మునుపటి సామర్థ్యం కలిగేందుకు ఏం చేయాలో చెప్పండి.
- వి.ఆర్.కె., ఖమ్మం
పెళ్లరుున కొత్తలో మొదట కొన్నేళ్లు సెక్స్‌లో నిత్యం పాల్గొనడం జరుగుతుంది. అరుుతే... ఏళ్లు గడుస్తున్న కొద్దీ కెరియర్ కోసం కష్టపడటం, సావూజిక బాధ్యతలు పెరగడం వంటి కార్యకలాపాల వల్ల మునుపటంత తరచుగా సెక్స్‌లో పాల్గొనలేక పోవచ్చు. మీరు మీ రోజువారీ సవుస్యలనూ, ఇతరత్రా వ్యవహారాలను పక్కన పెట్టి వునసును ప్రశాంతంగా ఉంచుకోండి. రోజూ రెగ్యులర్‌గా వాకింగ్ వంటి వ్యాయూవూలు చేస్తూ, సాధారణ ఆరోగ్యం బాగా ఉండేలా చూసుకొండి. ఇలా చేస్తే చాలావరకు వుళ్లీ మొదట్లోలాగే సెక్స్ చేయుడానికి అవకాశం ఉంటుంది. భార్యతో అవగాహన, ఆమె పట్ల ప్రేవు పెంచుకొని అన్యోన్యంగా మెలిగితే పెర్‌ఫార్మెన్స్ పెరుగుతుంది. ఇది చాలామంది ఫిర్యాదు చేసే చాలా సాధారణమైన సమస్య. మీ అంతట మీరే తేలిగ్గా అధిగమించవచ్చు. ఒకవేళ మీరు ప్రయత్నించాక కూడా మీ పెర్‌ఫార్మెన్స్‌లో వూర్పులేకపోతే యుూరాలజిస్ట్/యూండ్రాలజిస్ట్‌ను సంప్రదించండి. వారు తాత్కాలికంగా కొన్ని మందులు వాడి, మీలో మునుపటి కాన్ఫిడెన్స్ కలిగేలా చేస్తారు.
నా వయసు 27 ఏళ్లు. సెక్స్ సమయంలో త్వరగా స్ఖలనం అయిపోతోంది. శీఘ్రస్ఖలనాన్ని నివారించడానికి కొన్ని డీ-సెన్సిటైజర్స్, లోకల్ అనస్థీషియూ క్రీమ్స్ దొరుకుతాయుని విన్నాను. వాటి వివరాలు చెప్పండి.
- ఎమ్.ఆర్.కె., కర్నూలు
జ: మీరు చెప్పినట్లే కొన్ని లోకల్ అనస్థీషియూ క్రీమ్స్ ఉన్న వూట వాస్తవమే. అరుుతే అవి వాస్తవ రుగ్మతకు ప్రధాన చికిత్స కాదు. పురుషాంగం మీద ఉండే నరాల ద్వారానే సెక్స్ సమయంలో ఆనందాన్ని, థ్రిల్‌ను ఎవరైనా పొందగలుగుతారు. మీరు చెబుతున్న ఆ లోకల్ అనస్థీషియూటిక్ క్రీములు ఆ నరాలకు సెక్స్‌లోని స్పందనలు అందకుండా చేస్తాయి. స్పర్శ తగ్గేలా చూస్తాయి. దాంతో స్ఖలనం స్టిమ్యులేషన్స్ ఆగినప్పటికీ సెక్స్‌లో సుఖం కూడా తగ్గుతుంది. అందుకే ఈ తరహా క్రీమ్స్, డీ-సెన్సిటైజర్స్ కంటే మీరు పించ్ అండ్ స్టాప్ టెక్నిక్‌ను అవలంబించడం మేలు. అంటే స్ఖలనం ఫీలింగ్ కలిగినప్పుడల్లా కాసేపు సెక్స్‌ను ఆపివేసి, మీ ఎగ్జరుుట్‌మెంట్‌ను అదుపు చేసుకోవాలి. దీనివల్ల మీ స్ఖలనంపై మీకే అదుపు వస్తుంది. ఫలితంగా మీరు స్ఖలనాన్ని ఆపుకుంటూ చాలాసేపు సెక్స్ చేయగలరు. పించ్ అండ్ స్టాప్ టెక్నిక్ అవలంబించి చూసి, అప్పటికీ ఫలితం లేకపోతే యాండ్రాలజిస్ట్‌ను కలవండి.
నాకు 35 ఏళ్లు. నాకు నిద్రలో అంగస్తంభన బాగానే ఉంటుందిగానీ... మామూలుగా సెక్స్ చేసే సమయంలో అంగస్తంభన తక్కువగా ఉంటుంది. ఇటీవల నాకు గుండెదడగా ఉంటోంది. గుండెదడకు, అంగస్తంభన లేకపోవడానికి ఏదైనా సంబంధం ఉందా? నాకు స్మోకింగ్ అలవాటు ఉంది. దయచేసి నా సమస్యకు తగిన సలహా ఇవ్వండి.
- డి.కె., మహబూబ్‌నగర్
ముప్పయి ఐదేళ్ల వయసులో సాధారణంగా రాత్రివేళ నిద్రలో వచ్చే అంగస్తంభనలు మామూలుగానే ఉంటాయి. నిద్రలో వచ్చే అంగస్తంభనలు ఉండటం అన్నది పురుషాంగంలో రక్తప్రసరణ బాగానే ఉన్నది అనడానికి ఒక మంచి సూచన. మీకు గుండెదడ అంటున్నారు. దానికీ, సెక్స్‌కూ ఎలాంటి సంబంధం లేదు. ఈమధ్య ఆల్కహాల్, స్మోకింగ్ అలవాటు ఉన్నవాళ్లతో పాటు కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకునేవాళ్లలో గుండె జబ్బులు చిన్న వయసులోనే కనిపిస్తున్నాయి. మీరు రెడ్‌మీట్ ఎక్కువగా తింటూ ఉంటే, తగ్గించుకొని ఆరోగ్యవంతమైన జీవనశైలిని అనుసరించండి. గుండెదడ అంటున్నారు కాబట్టి ఒకసారి మీరు ఎకో, టీఎంటీ వంటి పరీక్షలు చేయించుకోండి. అవసరాన్ని బట్టి కార్డియాలజిస్ట్‌ను సంప్రదించి గుండెదడను తగ్గించుకునే మందులు వాడండి. ఇవ్వన్నీ నార్మల్‌గా ఉంటే మీరు మామూలుగానే సెక్స్‌లో పాల్గొనవచ్చు. ఒకవేళ మామూలుగా సెక్స్‌లో పాల్గొనడానికి తగినంతగా అంగస్తంభనలు లేకపోతే అప్పుడు దానికి కొన్ని మందులు వాడవచ్చు. అయితే వాటిని కార్డియాలజిస్ట్‌ల క్లియరెన్స్ తర్వాత మాత్రమే యూరాలజిస్ట్ ఇస్తారు. మీరు ముందుగా కార్డియాలజిస్ట్‌ను, యూరాలజిస్ట్‌ను సంప్రదించండి.
నా వయసు 28 ఏళ్లు. నాకు పెళ్లయి మూడు నెలలైంది. నేను 109 కిలోల బరువుంటాను. నా పురుషాంగం, వృషణాలు మొదటినుంచీ చిన్నగా ఉంటాయి. తొడల్లో, పొట్టలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. గత మూడు నెలల్లో ఒక్కసారి కూడా సెక్స్ చేయలేకపోయాను. కోరికలు మాత్రం బాగానే ఉన్నా అంగస్తంభన కొద్దిగానే అవుతోంది. మీసాలు, గడ్డాలు కూడా సరిగా లేవు. నా సమస్యకు సరైన పరిష్కారం సూచించండి.
- ఎస్.హెచ్.ఆర్., సికింద్రాబాద్
యుక్తవయసులో థైరాయిడ్, ఎల్‌హెచ్, ఎఫ్‌ఎస్‌హెచ్, టెస్టోస్టెరాన్ వంటి హార్మోన్స్ లోపం వల్ల జననేంద్రియాల ఎదుగుదల తగ్గవచ్చు. అంతేకాకుండా కొన్నిసార్లు మెదడులో కూడా కొన్ని హార్మోన్ల ఉత్పత్తి తగ్గడం వల్ల శరీర సమతౌల్యత తగ్గుతుంది. అంటే... కొన్ని శరీర భాగాల్లో విపరీతంగా కొవ్వు పెరుగుతుంది. ఇలాంటివాళ్లలో కొంతమందికి షుగర్ కూడా ఉండవచ్చు. అందువల్ల మీ సమస్య ఏమిటో తెలుసుకోడానికి మీరు ముందుగా యాండ్రాలజిస్ట్‌ను, ఆ తర్వాత అవసరాన్ని బట్టి ఎండోక్రైనాలజిస్ట్‌ను... ఇద్దరినీ కలవండి. పైన చెప్పిన హార్మోన్ పరీక్షలు చేయించుకుని మీ సమస్యకు కారణాన్ని కనుక్కోని తగిన చికిత్స చేయవచ్చు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
నా వయుస్సు 24 ఏళ్లు. ఇంకా పెళ్లికాలేదు. నాలుగేళ్ల క్రితం హస్తప్రయోగం చేయుడం ఆపేశాను. అప్పట్నుంచి ప్రతిరోజూ రాత్రి నా ప్రమేయుం లేకుండానే వీర్యం పోతోంది. తెల్లారి చూస్తే బట్టలు తడిగా ఉంటున్నాయి. ప్రతిరోజూ వుూత్రంతో పాటు వీర్యం కూడా పోతోంది. వుూత్రంలో వుంట, వృషణాల్లో నొప్పి. డాక్టర్‌ను కలిస్తే ఏమీ పర్వాలేదంటున్నారు. నా పురుషాంగం చిన్న సైజ్‌లో ఉంది. నా సమస్యలు తగ్గడానికి తగిన మందులు ఇవ్వండి.
- ఆర్.వి.ఎస్.ఆర్., కోదాడ
మీ వయుస్సులో హస్తప్రయోగం చేయుడం, ఏవువుతుందో అని భయుపడి కొంతకాలం వూనేయుడం, అలా వూనేసినప్పుడు వీర్యం కాస్తా వుూత్రంలో పోవడం వూవుూలే. దానివల్ల మీరు బలహీనపడిపోతున్నట్లు మీకు మీరు అనుకోవడం కూడా సాధారణమే. మీలా చాలామంది ఇదే అపోహలో ఉంటారు. ప్రతిరోజూ వృషణాల్లో వీర్యం తయూరవుతుంటుంది. మీరు హస్తప్రయోగం చేయుకపోతే అది వుూత్రంతో పాటు బయుటకు వెళ్తుంది, లేదా నిద్రలో పోతుంది. ఇందువల్ల మీకు ఎలాంటి బలహీనతా రాదు. పురుషాంగం, వృషణాలు చిన్నగా కావడం జరగదు. హస్తప్రయోగం వల్ల ఎలాంటి హానీ ఉండదు. కాబట్టి భయుపడకండి. అంగం స్తంభించి లేనప్పుడు, ఆ వూటకొస్తే స్తంభించినప్పుడు కూడా దాని సైజ్‌ను గురించి ఆలోచించి, దాని గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. సెక్స్‌లో సంతృప్తిగా పాల్గొనాలంటే మీకు సెక్స్ స్పందనలు కలిగినప్పుడు అది గట్టిపడితే చాలు.
డాక్టర్ వి. చంద్రమోహన్
యూరో సర్జన్ అండ్ యాండ్రాలజిస్ట్,
ప్రీతి యూరాలజీ అండ్ కిడ్నీ హాస్పిటల్, కెపిహెచ్‌బి, హైదరాబాద్