దీనివల్ల భవిష్యత్తులో ఎలాంటి సమస్యా రాదా? | Would not causing any trouble in the future? | Sakshi
Sakshi News home page

దీనివల్ల భవిష్యత్తులో ఎలాంటి సమస్యా రాదా?

Published Tue, Oct 27 2015 10:49 PM | Last Updated on Mon, Jul 23 2018 8:49 PM

దీనివల్ల భవిష్యత్తులో ఎలాంటి సమస్యా రాదా? - Sakshi

దీనివల్ల భవిష్యత్తులో ఎలాంటి సమస్యా రాదా?

ప్రైవేట్ కౌన్సెలింగ్
 
నా వయసు 28 ఏళ్లు. ఎలాంటి చెడు అలవాట్లు లేవు. పురుషాంగాన్ని ప్రతిరోజూ శుభ్రపరచుకుంటాను. అరుుతే ఈవుధ్య అంగం మీది చర్మం వుునుపటిలా వెనక్కురావడం లేదు. బలవంతంగా వెనక్కు నెడితే క్రాక్స్ ఏర్పడి రక్తం వస్తోంది. ఈ సవుస్య నన్ను ఆందోళనకు గురిచేస్తోంది.  నాకు తగిన సలహా ఇవ్వండి.
 - డి.కె.ఎస్., తుని

 పురుషాంగం మీది చర్మం ఫ్రీగా వెనక్కు వెళ్లకుండా ఉండే పరిస్థితిని ఫైమోసిస్ అంటారు. ఒక్కోసారి ఫైమోసిస్ వల్ల చర్మం చివరి భాగంలో క్రాక్స్ వచ్చి ఇన్ఫెక్షన్‌కు దారితీసే అవకాశం ఉంటుంది. ఇలాంటప్పుడు సెక్స్ చేస్తే నొప్పిరావచ్చు. ఒక్కోసారి చర్మం వెనక్కి వెళ్లి వుళ్లీ వుుందుకు రాకపోతే వాపు కూడా రావచ్చు. యుుక్తవయుసులో ఇలా చర్మం ఫ్రీగా వుుందుకు, వెనక్కు రాకపోతే సున్తీ చేరుుంచుకోవడం వుంచిది. దీనివల్ల వ్యక్తిగత పరిశుభ్రత (పర్సనల్ హైజీన్) పాటించడం కూడా సులువు. సెక్స్ చేయుడానికీ అనువుగా ఉంటుంది.
    
నాకు 35 ఏళ్లు. పెళ్లయి పదేళ్లు అయ్యింది. సెక్స్ చేసిన తర్వాత మూత్రనాళంలో మంట అనిపిస్తోంది. చాలా నీరసంగా ఉంటోంది. ఏడాది క్రితం కనీసం రోజులో ఒకసారి సెక్స్ చేయగలిగే. వాణ్ణి. ఇప్పుడు వారానికి రెండుసార్లు మాత్రమే సెక్స్ చేయగలుగుతున్నాను. ఈమధ్య నాకు షుగర్ కూడా వచ్చింది. దీనివల్లనే ఈ సమస్య వచ్చిందా? నా సమస్యకు పరిష్కారం చూపగలరు.
 - జె.ఎన్., ఏలూరు

 సాధారణంగా సెక్స్ కోరికలు 20 నుంచి 30 ఏళ్ల మధ్య చాలా ఎక్కువగా ఉంటాయి. వివాహమైన 10 ఏళ్ల తర్వాత ముందున్నంత ఉత్సాహం ఉండకపోవడం సహజం. షుగర్, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవాళ్లలో ముఖ్యంగా ఒకేచోట కుదురుగా కూర్చుని పనిచేసేవాళ్లలో (సెడెంటరీ లైఫ్‌స్టైల్ ఉన్నవాళ్లలో) సెక్స్‌సామర్థ్యం కాస్తంత తగ్గుతుంది. దీనికితోడు ఆ ఈడులో ఉండే బాధ్యతల వల్ల వచ్చే మానసిక సమస్యలు కూడా కొంత సెక్స్ సామర్థ్య లోపం ఏర్పడుతుంది. దీనికి కౌన్సెలింగ్ ద్వారా, కొన్ని సందర్భాల్లో మందులతో నార్మల్ సెక్స్‌ను పొందేలా చేయవచ్చు. మీ బ్లడ్ షుగర్‌ను నియంత్రణలో పెట్టుకుని, ప్రతిరోజూ వ్యాయామం చేస్తూ, మానసికంగా ఉల్లాసంగా ఉండటం ద్వారా మీ సామర్థ్యలోపాన్ని చాలావరకు నివారించుకోవచ్చు.
    
నా కంఠస్వరం మరీ మహిళల గొంతులా ఉంటోంది. దాంతో నలుగురిలో మాట్లాడలేకపోతున్నాను. ఇది హార్మోన్ల సమస్య అని, యాండ్రాలజిస్ట్‌ను కలవమని కొందరు సూచించారు. ఒక డాక్టర్‌ను కలిస్తే చిన్నప్పట్నుంచీ గొంతు అలాగే ఉంటే యాండ్రాలజిస్ట్‌ను కలిసినా లాభంలేదు అంటున్నారు. ఈ విషయంలో నాకు సలహా ఇవ్వండి.
 - ఎస్.ఆర్.పి., కర్నూలు

 మీకు సెక్స్ కోరికలు, అంగస్తంభనలతో పాటు సెకండరీ సెక్సువల్ కారెక్టర్స్ అయిన  మీసాలు-గడ్డాలు పెరగడం నార్మల్‌గా ఉంటే... మీ శరీరంలోని హార్మోన్ల సమతౌల్యం బాగానే ఉందని అర్థం. ఇలా ఉంటే మీరు మీ సెక్స్ జీవితం విషయంలో ఆందోళన పడాల్సిందేమీ లేదు. పదమూడో ఏటి నుంచి 20 ఏళ్ల వరకు సెకండరీ సెక్సువల్ కారెక్టర్లలో భాగంగానే పురుషుల్లో స్వరం మార్పు జరుగుతుంది. దీనికి అనేక జన్యుపరమైన అంశాలు దోహదపడతాయి. అన్ని హార్మోన్లూ నార్మల్‌గా ఉన్నా కొందరిలో స్వరంలో ఇలా కీచుదనం ఉంటుంది. దీనికి ప్రత్యేకంగా చికిత్స అంటూ ఉండదు. అయినా ఒకసారి మీరు హార్మోన్ల పరీక్ష చేయించుకుని యాండ్రాలజిస్ట్‌ను గాని, ఈఎన్‌టీ సర్జన్‌ను గాని కలవండి.
    
 నాకు 28 ఏళ్లు. పెళ్లయి ఆర్నెల్లు అయ్యింది. నేను ప్రతిరోజూ సెక్స్ చేస్తున్నాను. అయితే అంగస్తంభన బాగానే ఉన్నా వీర్యస్ఖలనం మాత్రం త్వరగా అయిపోతోంది. ఒకసారి వీర్యస్ఖలనం అయ్యక మళ్లీ అంగస్తంభన కలగడం లేదు. దాంతో నా భార్య సెక్స్‌లో సంతృప్తి చెందలేకపోతోంది. ఇద్దరమూ నిరాశ చెందుతున్నాం. ఈ సమస్యకు పరిష్కారం చెప్పండి.
 - కె.ఎస్.పి.ఆర్., విజయవాడ

 మీరు చెప్పిన కండిషన్‌ను ప్రీ-మెచ్యూర్ ఇజాక్యులేషన్ అంటారు. ఇది పురుషుల్లో  చాలా సాధారణంగా కనిపించే సమస్య. వీర్యస్ఖలనం అన్నది ఒక రిఫ్లెక్స్ యాక్టివిటీ. సెక్స్ ప్రక్రియలో అంగం మీద ఉన్న చర్మం ఉత్తేజితం కావడం వల్ల ఈ వీర్యస్ఖలనం అన్న రిఫ్లెక్స్ ప్రక్రియ జరుగుతుంది. కొంతమందిలో ఈ స్పందనలు (స్టిమ్యులేషన్స్) త్వరగా కలగడం వల్ల వీర్యస్ఖలనం వెంటనే జరిగిపోతోంది. ఇలాంటి వాళ్లు సెక్స్‌లో నేరుగా పాల్గొనకుండా తగినంత ప్రీ ప్లే చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది. దాంతోపాటు వీర్యస్ఖలనం ఫీలింగ్ రాగానే వెంటనే అంగాన్ని బయటకు తీసి పురుషాంగం చివర (శిశ్నం వెనక భాగంలో) గట్టిగా నొక్కి పట్టుకోవాలి. స్ఖలనం ఫీలింగ్ తగ్గగానే మళ్లీ సెక్స్ చేయడం ప్రారంభించాలి. ఇలా నొక్కి పట్టుకుని స్ఖలనాన్ని నియంత్రించే ప్రక్రియను ‘పించ్ అండ్ స్టార్’ టెక్నిక్ అంటారు. ఈ పించ్ అండ్ స్టార్ట్ టెక్నిక్‌తోనూ మీ సమస్య తగ్గకపోతే ఆండ్రాలజిస్ట్‌ను కలవండి. మీరు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. కౌన్సెలింగ్‌తో, మందులతో మీ కండిషన్‌కు చికిత్స చేయవచ్చు.
    
 నా వయుస్సు 35 ఏళ్లు. ఇంకా పెళ్లి కాలేదు. నేను గతంలో కొంతమంది అమ్మాయిలతో సెక్స్ చేశాను. నాకు ఇటీవలే పెళ్లి నిశ్చయుం అరుు్యంది. ఆ అవ్మూరుుతో కూడా నేనొకసారి కలవడానికి ప్రయత్నించాను. అరుుతే అప్పుడు అంగస్తంభన సరిగా జరగలేదు. ఒక్క నిమిషంలోనే వీర్యస్ఖలనం అరుుపోరుుంది. నేను సెక్స్ జీవితానికి పనికిరానేమో అని ఆందోళనగా ఉంది. దయుచేసి సలహా ఇవ్వండి.
 - జీ.ఆర్.ఎన్., నెల్లూరు

 మీది యూంగ్జైటీ న్యూరోసిస్ అనే వూనసిక సవుస్య కావచ్చు. మీకూ, మీ జీవిత భాగస్వామికీ కొంత పరిచయుం పెరిగిన తర్వాత క్రవుంగా మీ భయూలు తగ్గి మీరు నార్మల్‌గా సెక్స్ చేయుడానికి వీలుంటుంది. పెళ్లికాకవుుందే సెక్స్‌లో పాల్గొనడం వల్ల ఇలాంటి భయూలూ, అపోహలు ఎక్కువవుతారుు. కాబట్టి వీలైనంత త్వరగా పెళ్లి చేసుకొని  భయూందోళనలు లేని సెక్స్ జీవితాన్ని గడపండి.
    
 నా వయస్సు 28 ఏళ్లు. గత పదేళ్లుగా హస్తప్రయోగం చేసుకుంటూ ఉన్నాను. దీనివల్ల భవిష్యత్తులో సెక్స్ సమస్య వస్తుందేమోనని ఇటీవల ఆ అలవాటు మానేశాను. అయితే ఇప్పుడు నిద్రపోతున్నప్పుడు కలలో స్ఖలనం అవుతోంది. స్వప్నస్ఖలనాల వల్ల సెక్స్ బలహీనత వస్తుందని, దీనివల్ల భవిష్యత్తులో సెక్స్ చేయాలేనేమో అనిపిస్తోంది. మందు ఇస్తామని కొందరు చెబుతున్నారు. నాకు తగిన సలహా ఇవ్వండి.
 - రాజ్, అనంతపురం

 యౌవనదశలో మీలాగా హస్తప్రయోగం చేసుకోవడం పురుషులందరిలోనూ దాదాపుగా ఉండే అలవాటు. దీనివల్ల భవిష్యత్తులో ఎలాంటి సమస్యా రాదు. మీరు అనవసరంగా అపోహతో హస్తప్రయోగం ఆపేశారు. అయితే మీరు ఈ ప్రక్రియను ఆపేసినా వృషణాల్లో వీర్యం ఉత్పత్తి ప్రక్రియ అలాగే కొనసాగుతుంటుంది. ఇలా ఉత్పన్నం అయిన వీర్యం మీకు నిద్రలో పోతోంది. ఇది స్వాభావికంగా జరిగే ఒక ప్రక్రియ. దీనికోసం మందులు వాడనవసరం లేదు. మందులు ఇస్తామంటున్నవారు మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. వారు బహుశా మీ బలహీనత నుంచి లబ్ధిపొందుతున్నారు. మీరు అన్నివిధాలా నార్మల్‌గా ఉన్నారు. మందులు వాడనవసరం లేదు. కెరియర్‌లో స్థిరపడి త్వరగా పెళ్లిచేసుకొని, మంచి దాంపత్య జీవితాన్ని ఎంజాయ్ చేయండి.
 
 డాక్టర్ వి. చంద్రమోహన్
 యూరో సర్జన్ అండ్ యాండ్రాలజిస్ట్,
  ప్రీతి యూరాలజీ అండ్ కిడ్నీ హాస్పిటల్, కెపిహెచ్‌బి, హైదరాబాద్
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement