యువతులను చూస్తూ... | Kolkata Man Arrested for Masturbate in Bus | Sakshi
Sakshi News home page

Published Sun, May 13 2018 1:25 PM | Last Updated on Mon, May 14 2018 11:43 AM

Kolkata Man Arrested for Masturbate in Bus - Sakshi

సాక్షి, కోల్‌కతా: బస్సులో మహిళల ముందే వికృత చేష్టలకు దిగాడు ఓ కామాంధుడు. వారికి సైగలు చేస్తూ అసభ్యంగా ప్రవర్తించాడు. కండక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవటంతో ఆ తతంగం అంతా వీడియో తీసిన ఓ యువతి ఫేస్‌బుక్‌లో అప్‌ లోడ్‌ చేసింది. ఆ వీడియో కాస్త వైరల్‌ అయి పోలీసులకు చేరింది. దీంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

వివరాల్లోకి వెళ్తే... హూగ్లీ జిల్లా వైద్యపతి ప్రాంతానికి చెందిన సదరు వ్యక్తి ఓ చిరు వ్యాపారి. శనివారం శ్యామ్‌పుకర్‌ ప్రాంతంలో బస్సులో ప్రయాణిస్తూ.. మహిళా ప్రయాణికులను చూస్తూ యువతులను చూస్తూ అసభ్య చేష్టలకు దిగాడు. అది గమనించిన ఇద్దరు మహిళలు కండక్టర్‌తో చెప్పారు. కానీ, అతని నుంచి స్పందన లేకపోవటంతో మౌనంగా ఉండిపోయారు. ఇంతలో ఓ యువతి ఆ వ్యాపారి చేష్టలను వీడియో తీసి ఫేస్‌బుక్‌లో అప్‌ లోడ్‌ చేసింది. ఎవరూ పట్టించుకోలేదని, మహిళలకు భద్రత ఏదంటూ పోస్టు చేసింది. అది కాస్త గంటల్లో వైరల్‌ అయి కోల్‌కతా పోలీసులకు చేరింది. ఇలాంటి వ్యవహారాల్లో ఉపేక్షించే ప్రసక్తే లేదని, అతన్ని  శనివారం సాయంత్రమే అరెస్ట్‌ చేసినట్లు కోల్‌కతా పోలీసులు ఫేస్‌బుక్‌లో తెలియజేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement