
నటి స్వర భాస్కర్.. వీరే ది వెడ్డింగ్‌లోని సన్నివేశాలు(ఎడమ వైపు)
సాక్షి, ముంబై: బాలీవుడ్ నటి స్వర భాస్కర్ మరోసారి విమర్శలను ఎదుర్కుంటున్నారు. ఆమె తాజాగా నటించిన వీరే ది వెడ్డింగ్ చిత్రంలో ఆమె ఓ సంచలన సన్నివేశంలో నటించారు. అయితే ఈ సన్నివేశంపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్‌ను ఆమె ఎదుర్కోవాల్సి వస్తోంది.
చాలా మంది ‘తమ ఇంట్లోని అడవాళ్లతో చిత్రానికి వెళ్లామని, కానీ, ఆ సన్నివేశం రాగానే థియేటర్ నుంచి బయటకు వచ్చేశామని’ ట్వీట్లు చేశారు. మరోవైపు చిత్రంపై మొదటి నుంచి వ్యతిరేకత కనబరుస్తున్న హిందూ అతివాదులు అయితే స్వరపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ట్రోలింగ్‌పై స్వర భాస్కర్ కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు. ‘కొందమంది డబ్బులు ఇచ్చిమరీ సోషల్ మీడియాలో ఈ చిత్రంపై దుష్ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు సినిమా చూడడానికి, ఇలాంటి ట్వీట్స్ పెట్టడానికి ఖచ్చితంగా డబ్బులు తీసుకునే ఉంటారు’ అంటూ కౌంటర్ వేశారు.
స్పెల్లింగ్ కూడా రాదా?... ఇక స్వర భాస్కర్‌కు మద్ధతుగా నిలుస్తున్న కొందరు.. ట్రోలింగ్ చేసే వారికి రిటార్ట్ ఇస్తున్నారు. ‘మాస్టర్బేషన్(స్వయంతృప్తి) స్పెల్లింగ్ కూడా సరిగ్గా రానివాళ్లు.. వాళ్ల ఇంట్లో మహిళలతో సినిమాలు వెళ్తున్నారా?’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. శశాంఖ్ ఘోష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కరీనా కపూర్ పాటు సోనమ్ కపూర్, స్వరా భాస్కర్, శిఖాలు ప్రధాన పాత్రల్లో నటించారు. తమ స్నేహితురాలి వివాహం కోసం కలుసుకున్న యువతులు.. వ్యక్తిగత విషయాలను దర్శకుడు బోల్డ్‌గా చూపించిన యత్నమే వీరే ది వెడ్డింగ్ కథ.
Why are so many sanskari people watching #VeereDiWedding with their grandmothers?
— Rahul Pandita (@rahulpandita) 2 June 2018