‘దాని గురించి కూడా కామెంట్‌ చేయండి’ | Indian Idol 10 Neha Kakkar trolls Called Her Cry Baby | Sakshi
Sakshi News home page

‘నా నవ్వును కూడా కామెంట్‌ చేయండి’

Published Fri, Jul 13 2018 3:51 PM | Last Updated on Tue, Mar 19 2019 9:20 PM

Indian Idol 10 Neha Kakkar trolls Called Her Cry Baby - Sakshi

నేహా కక్కర్‌.. ఇండియన్‌ ఐడల్‌ టీవీ షో చూసేవారికి బాగా పరిచయమున్న పేరు. గత సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న నేహాను ఈసారి అదృష్షం వరించింది. పోటీదారుగా పాల్గొన్న కార్యక్రమానికే న్యాయ నిర్ణేతగా వ్యవహరించే అరుదైన అవకాశం ఆమెకు దక్కింది. త్వరలో ప్రారంభం కానున్న ‘ఇండియన్‌ ఐడల్‌ 10’కు ఆమె న్యాయ నిర్ణేతగా వ్యహరించనున్నారు. ఈ నేపథ్యంలో తన సంతోషాన్నిఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌ ద్వారా  అభిమానులతో పంచుకున్నారు. ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. నేహా ఈ విషయాన్ని పోస్టు చేయగానే కొందరు ఆమెను అభినందించగా చాలామంది మాత్రం ‘క్రైయింగ్‌ బేబీ’ అంటూ నేహాను ట్రోల్‌ చేస్తున్నారు.

నేహాను ఇలా అనడానికి కారణం ఉంది. గతంలో నేహా ‘ఇండియన్‌ ఐడల్‌’లో పాల్గొన్న సమయంలో సహ పోటీదారుల బాధలు విని ఒక్కసారిగా ఏడ్చేశారు. పాపం అదే నేహా చేసిన తప్పు. ఆ రోజు జరిగిన విషయాలను ఇప్పుడు ట్యాగ్‌ చేసి, నేహాను ‘క్రైయింగ్‌ బేబీ’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు. ‘కంటెస్టెంట్‌గా ఉన్నప్పుడే అంతలా ఏడ్చావు. ఇప్పుడు బాస్‌గా(న్యాయ నిర్ణేతగా) ఇంకెంత ఏడుస్తావో’ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. అయితే తనను కామెంట్‌ చేసేవాళ్లందరికి దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చారు నేహా.

తనను విమర్శించేవారిని ఉద్దేశిస్తూ.. ‘నేను ఏడ్చినందుకు నన్ను కామెంట్‌ చేస్తున్నారు. అయితే ఇప్పటి నుంచి నా నవ్వును కూడా కామెంట్‌ చేయండి. ఎందుకంటే ఇక మీదట నేను చాలాసార్లు నవ్వుతూనే కనిపిస్తాను. నన్ను విమర్శించేవారందరిని ఒక్కటే అడుగుతున్నాను. నేను ఏడుస్తున్నానని కామెంట్‌ చేస్తున్నారు.. మరి నేను ఇతరులకు సాయం చేస్తుంటాను. ఆ విషయం గురించి కూడా కామెంట్‌ చేయండి. కెమెరా ముందు ఒకలా, బయట ఒకలా ఉండటం నాకు చేత కాదు. నేను కెమెరా ముందు ఎలా ఉంటానో నిజ జీవితంలో కూడా అలానే ఉంటాను. కెమెరా కోసం నా వ్యక్తిత్వాన్ని మార్చుకోను. నవ్వాలనిపిస్తే నవ్వుతాను, ఏడుపొస్తే ఏడుస్తాను. అంతే తప్ప కెమెరా కోసం నా భావాలను నియంత్రించుకోను. భావోద్వేగాలు గల మనిషిగా నా గురించి నేను ఎప్పుడు గర్వంగా భావిస్తాను. ఈ ​కాలంలో జనాలు చాలా వరకూ ఎటువంటి భావోద్వేగాలు, స్పందనలు లేకుండా కఠినంగా ఉంటున్నారు. వాళ్లందరితో పోల్చుకుంటే నేను చాలా హాయిగా బతుకుతున్నాను’ అంటూ జవాబిచ్చారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement