జడ్జి వేధింపులు?.. ఎస్సై ఆత్మాహత్యాయత్నం | SI attempting suicide after mistreatment by magistrate rescued | Sakshi
Sakshi News home page

జడ్జి వేధింపులు?.. ఎస్సై ఆత్మాహత్యాయత్నం

Published Wed, Sep 18 2024 9:51 AM | Last Updated on Wed, Sep 18 2024 10:24 AM

SI attempting suicide after mistreatment by magistrate rescued

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఓ పోలీస్‌ అధికారి ఆత్మహత్యాయత్నం చేశాడు. తనను కోర్టులో జడ్జి వేధించాడని, దురుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తూ సోమవారం రాత్రి చనిపోయేందుకు ప్రయత్నించాడు. అదృష్టం బాగుండి అధికారులు కాపాడటంతో క్షేమంగా బయటపడ్డాడు. ఈ ఘటన అలీఘర్‌లో వెలుగుచూసింది.

బన్నాదేవి పోలీస్‌ స్టేసన్‌లో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న సచిన్‌ కుమార్‌ ఇటీవల బైక్‌ చోరికి పాల్పడిన అయిదుగురు నిందితులను పట్టుకున్నాడు. కేసు దర్యాప్తులో భాగంగా వారిని కోర్టులో హాజరుపరిచారు.

అయితే నిందితులను కాకుండా తప్పుడు వ్యక్తులను పట్టుకున్నారని స్థానిక న్యాయమూర్తి  త్రిపాఠి.. ఎస్సై సచిన్‌ను మందలించారు. కోర్టు విచారణ సమయంలో మేజిస్ట్రేట్ తన పట్ల అగౌరవంగా, అనుచితంగా ప్రవర్తించారని.. కోరిన రిమాండ్‌ను మంజూరు చేయకుండా సాయంత్రం 4 నుంచి రాత్రి 10 గంటల వరకు వేచి ఉండేలా చేశారని కుమార్ ఆరోపించారు.

దీంతో మనస్తాపం చెందిన సచిన్‌ కుమార్‌ రైల్వే ట్రక్‌పై కూర్చొని ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించాడు. అప్రమత్తమైన స్టేషన్‌ ఇంచార్జ్‌ పంకజ్‌ కుమార్‌ మిత్రా,  ఇతర పోలీసులు వెంటనే స్పందిచి కుమార్‌ను రక్షించారు. 

అయితే ఈ ఆరోపణలపై న్యాయమూర్తి త్రిపాఠి ఇంకా స్పందించాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఎస్సై ఆరోపణలపై ఉన్నత స్థాయి విచారణకు ఎస్పీ ఆదేశించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement