
ఘటన గురించి అధికారికి వివరిస్తున్న గ్రానీ జీన్
సైకిల్‌పై తన పనిని కానిస్తూనే వెంటాడిన...
టెక్సాస్: సైకిల్‌పై వృద్ధురాలి వెంటపడి మరీ వికృత చేష్టలకు పాల్పడ్డాడు ఓ వ్యక్తి. అయితే అతని వ్యవహారాన్ని భరించలేకపోయిన సదరు వృద్ధురాలు అతన్ని తుపాకీతో కాల్చేసింది. టెక్సాస్ రాష్ట్రంలోని హౌస్టన్ నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రానీ జీన్(68) అనే వృద్ధురాలు మంగళవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఈ క్రమంలో ఓ వ్యక్తి సైకిల్‌పై ఆమెను వెంబడించాడు. కాస్త దూరం వెళ్లాక ప్యాంట్ విప్పి ఆమెను చూస్తూ వికృత చేష్టలకు పాల్పడ్డాడు.
భయంతో ఆమె ఇంటికి పరిగెత్తగా.. ఆమెను వెంటాడాడు. చివరకు ఆమె ఇంటి డోర్ వద్దకు చేరి మరీ తన చేష్టలను కొనసాగించాడు. భయంతో సదరు వృద్దురాలు అతన్ని హెచ్చరించినట్లు చెబుతోంది. ‘ఆ సమయంలో ఇంట్లో నా మనవరాలు ఒక్కతే ఉంది. నాకు ఏం చేయాలో పాలుపోలేదు. వెళ్లిపో.. లేకపోతే కాల్చి పడేస్తా అని చెప్పాను. అతను అయినా వినలేదు. భయంతో అతన్ని కాల్చేశా’ అని జీన్ చెబుతున్నారు. గాయపడ్డ అతను కాస్త దూరం వెళ్లాక కుప్పకూలిపోయాడు.
కాగా, గాయపడిన సదరు వ్యక్తి(38) ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కోలుకున్నాక అతన్ని అరెస్ట్ చేస్తామని ‘ల్యారీ క్రౌసన్’ అనే అధికారి వెల్లడించాడు. గతంలో ఓసారి నగ్నంగా రోడ్లపై తిరిగిన నేరంలో అతగాడిని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. మరోవైపు జీన్‌పై ఎలాంటి కేసును నమోదు చేయలేదు.