కోల్‌కతా: ఊరి జనమంతా కలిసి పట్టపగలు నడి రోడ్డు మీద ఓ మహిళను చితకబాదారు. జుట్టు కత్తిరించి చిత్రహింసలకు గురి చేశారు. ఈ దారుణ సంఘటన పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకోగా.. దీనికి సంబంధించిన వీడియోని బీజేపీ నేత బాబుల్ సుప్రియో ట్విటర్‌లో షేర్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. మహిళ ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో స్త్రీలపై ఇంత అరాచకంగా ప్రవర్తించడం నిజంగా దారుణం.. ఇదేనా మనం కోరుకున్న బంగ్లా అంటూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు నెటిజనులు.
బాబుల్ సుప్రియో ట్వీట్ చేసిన ఈ వీడియోలో ఓ మహిళ నేల మీద పడి ఉంటుంది. ఇక గ్రామంలోని ఆడ, మగ ఆమెను కొడతారు. జుట్టుపట్టుకుని ఈడ్చుకు వస్తారు. తనను వదిలేయమని ఎంత ప్రాధేయపడినా వారు కనికరించలేదు. ఇంతలో కొందరు మహిళలు బాధితురాలి దగ్గరకు వచ్చి.. ఆమె జుట్టు పట్టుకుని కత్తిరిస్తారు. మరో దారుణమైన విషయం ఏంటంటే పట్టపగలే ఈ సంఘటన చోటు చేసుకుంది. జనాలు గుమికూడి చోద్యం చూశారు తప్ప ఏ ఒక్కరు ఆమెను కాపాడలేదు. కొందరు ఈ తతంగాన్ని వీడియో తీయడంలో బిజీ అయ్యారు. అక్రమ సంబంధం ఆరోపణల నేపథ్యంలోనే సదరు మహిళపై ఇలా దాడి చేశారని సమాచారం.
Atrocities against women of Bengal continue from Moynaguri to Kumargram, as politically biased authorities turn a blind eye... Now a woman has been physically assaulted in front of the whole village for allegedly having an affair...Is this the Bengal of our dreams?@narendramodi pic.twitter.com/60uTKDCw4i
— Babul Supriyo (@SuPriyoBabul) June 17, 2021
దీనిపై స్పందిస్తూ బాబుల్ సుప్రియో ‘‘బెంగాల్ మహిళలపై దురాగతాలు మొయినాగురి నుండి కుమార్గ్రామ్ వరకు కొనసాగుతున్నాయి. రాజకీయ నేతల చెప్పు చేతల్లో నడిచే అధికారులు కళ్లుండి గుడ్డివారయ్యారు. అక్రమ సంబంధం ఆరోపణలపై సదరు మహిళను శారీరకంగా హింసించారు. ఇదేనా మనం కలలు కన్న బెంగాల్’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment