ముంబై : మానవత్వం మరిచిన ఓ మహిళ.. నాలుగేళ్ల చిన్నారిని దారుణంగా హింసించిన ఘటన ముంబైలో చోటు చేసుకుంది. వివరాలు.. రిజ్వానా బేగం అనే మహిళ నాలుగేళ్ల చిన్నారిని అత్యంత దారుణంగా కొడుతూ హింసించింది. నొప్పికి తాళలేక ఆ చిన్నారి కేకలు పెడుతున్నప్పటికి రిజ్వానా మనసు కరగలేదు. అంతటితో ఆగక చిన్నారి కేకలు బయటకు వినపడకుండా ఉండేందుకుగాను ఏకంగా ఆ చిన్నారిపై కూర్చుంది రిజ్వానా. ముంబై సబర్బన్ ట్రాంబే ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్ లిఫ్ట్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది.
రిజ్వానా బాలికను కొడుతున్న దృశ్యాలు లిఫ్ట్‌లోని సీసీటీవీలో రికార్డయ్యాయి. వీటి ఆధారంగా ముంబై పోలీసులు రిజ్వానాను అరెస్ట్ చేశారు. బాలిక చెవి రింగులు దొంగతనం చేయడం కోసమే రిజ్వానా ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. రిజ్వానా దగ్గర నుంచి బాలికకు చెందిన చెవి రింగులను స్వాధీనం చేసుకున్నారు.
HORIBLE #crime!
— #PotholeWarriors4SafeMumbai🇮🇳🕳🛵👷♂️🚧💡🕯👍🌴 (@PotholeWarriors) November 15, 2018
Rizwana Begum the woman in the CCTV footage brutally assaulted a 4-yr-old girl in the lift. She later sat on the girl & prevented people to rescue her too. @MumbaiPolice has arrested her. Hope she’s dealt severely for this inhuman behaviour. @ChemburChapters pic.twitter.com/rpA6NsT31h
Comments
Please login to add a commentAdd a comment