Viral Video: Four Women Attack On Restaurant Employees In Florida - Sakshi
Sakshi News home page

బూతులు తిడుతూ, రెస్టారెంట్‌ సిబ్బందిని చితక్కొట్టిన మహిళలు

Published Fri, Mar 19 2021 2:26 PM | Last Updated on Fri, Mar 19 2021 7:32 PM

Florida Four Women Attack Restaurant Employees In Shocking Video - Sakshi

రెస్టారెంట్‌ సిబ్బందిపై దాడి చేస్తోన్న మహిళలు(ఫోటో కర్టెసీ: ఎన్‌డీటీవీ)

ఫ్లోరిడా: దొంగతనం చేయడానికి ప్రయత్నిస్తుండగా అడ్డుకున్నందుకు గాను రెస్టారెంట్‌ సిబ్బందిపై పిడిగుద్దులు కురిపించారు నలుగురు మహిళలు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. ఫ్లోరిడా పామ్ బీచ్ కౌంటీలోని పొపాయ్స్ రెస్టారెంట్ డ్రైవ్-త్రూ లేన్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ వివరాలు.. నలుగురు మహిళలు వైట్‌ కలర్‌ నిస్సాన్‌ కారులో పొపాయ్స్‌ రెస్టారెంట్‌కి వచ్చారు. వీరిలో ఓ మహిళ క్యాష్‌ కౌంటర్‌లో నుంచి డబ్బులు దొంగతనం చేయడానికి ప్రయత్నించింది. దాంతో రెస్టారెంట్‌ సిబ్బంది ఆమెని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆగ్రహానికి గురైన మహిళ క్యాషియర్‌ని బూతులు తిడుతూ.. అతడిపై దాడి చేయడం ప్రారంభించింది. ఇది చూసి మిగతా ముగ్గురు మహిళలు కూడా అక్కడికి వచ్చి సిబ్బందిపై పిడిగుద్దులు కురిపించి.. డబ్బు తీసుకుని అక్కడి నుంచి జారుకున్నారు. 

ఈ తతంగాన్ని రెస్టారెంట్‌లో ఉన్న మరోక కస్టమర్‌ తన సెల్‌ఫోన్‌లో వీడియో తీశాడు. సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పామ్‌ బీచ్‌ కౌంటీ పోలీసులు ఈ వీడియోని తమ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ‘‘మీలో ఎవరైనా రెస్టారెంట్‌ సిబ్బందిపై దాడి చేసిన ఈ మహిళలను గుర్తించగలరా. వీరు సిబ్బందిపై పిడిగుద్దులు కురిపించి.. డబ్బుతో ఉడాయించారు’’ అని ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం వీరి కోసం గాలిస్తున్నాం అని తెలిపారు. సదరు మహిళలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజనులు.

చదవండి:

బోనాల్‌ వెళ్లే దారి ఇదేనా? మాటల్లోకి దించి చోరి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement