
గౌరిబిదనూరు(బెంగళూరు): తాలకాలోని దారినాయకనపాళ్య (డి పాళ్య) గ్రామంలోని ప్రభుత్వ కర్ణాటక పబ్లిక్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడైన రాజేశ్ కాంట్రాక్టు టీచర్‌ను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని, అతని మాటలు వినకపోతే ఉద్యోగం నుంచి తీసేస్తానని బెదిరిస్తున్నాడని దళిత సంఘర్ష సమితి కార్యకర్తలు పాఠశాల ముందు ధర్నా నిర్వహించారు.
ఆమెను వేధించడమే కాకుండా అసభ్య పదజాలంతో దషిస్తున్నాడని సమితి నేతలు ఆరోపించారు. ఇది తెలిసి తాలకా విద్యాశాఖ అధికారి శ్రీనివాసమూర్తి అక్కడకు చేరుకుని నిరసనకారులతో చర్చించారు. హెచ్‌ఎం పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని వారు వినతి పత్రమిచ్చారు. సర్వశిక్షా అభియాన్ అధికారి గంగారెడ్డి పాల్గొన్నారు.
చదవండి కిసాన్ మోర్చా మహిళా నేత ఆత్మహత్య.. బీజేపీ కీలక నిర్ణయం..