స్పెషల్‌ క్లాసుల నెపంతో ఆరో తరగతి విద్యార్థినిని.. | Teacher Suspended For Molestation Minor Girl Karnataka | Sakshi
Sakshi News home page

స్పెషల్‌ క్లాసుల నెపంతో ఆరో తరగతి విద్యార్థినిని..

Jan 1 2022 11:08 PM | Updated on Jan 2 2022 1:43 AM

Teacher Suspended For Molestation Minor Girl Karnataka - Sakshi

సాక్షి, బెంగళూరు: విద్యార్థినిని లైంగిక వేధింపులకు పాల్పడిన ఉపాధ్యాయుడిని సస్పెండ్‌ చేశారు. వివరాలు.. తుమకూరు జిల్లా శిరాలోని బేగం మొహల్లా ప్రభుత్వ ఉర్దూ పాఠశాలలో హెడ్‌ మాస్టర్‌గా ఉన్న మహమ్మద్‌ ఇక్బాల్‌ ప్రత్యేక తరగతుల పేరుతో ఆరో తరగతి విద్యార్థినిని కార్యాలయ గదిలోకి పిలిపించాడు. రూ.50 నగదు ఇస్తానని ఆశ చూపి లైంగికంగా లొంగదీసుకోవాలని యత్నించాడు.

నివ్వెరపోయిన విద్యార్థిని వెంటనే ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు తెలియజేసింది. డిసెంబరు 21వ తేదీన శిరా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఉపాధ్యాయుడిని అరెస్టు చేసి  న్యాయస్థానం ముందు హాజరు పరిచారు. అరెస్టయిన ఉపాధ్యాయుడు మహమ్మద్‌ ఇక్బాల్‌ను సస్పెండ్‌ చేస్తూ డీడీపీఐ కృష్ణమూర్తి శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement