ప్రొద్దుటూరు, న్యూస్‌లైన్:
జిల్లాలోని 42 మండలాల్లో ఇన్‌చార్జి ఎంఈఓలు కొనసాగుతున్నారు. ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్న వీరిని పరీక్షలు సమీపిస్తున్న సమయంలో కూడా పాఠశాలలకు పంపకపోవడం విచారకరం.ప్రధానోపాధ్యాయులు లేని ప్రభావం పాఠశాలలపై తప్పక ఉంటుంది. దీని ద్వారా విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉంది. ఆయా మండలాల్లోని ఉన్నతపాఠశాలల్లోని సీనియర్ ప్రధానోపాధ్యాయులను ప్రభుత్వం ఇన్‌చార్జ్ ఎంఈఓలుగా ఏళ్ల తరబడి నియమించింది. ఇన్‌చార్జ్‌లు అంటే సాధారణంగా తాత్కాలికంగా నెల, రెన్నెళ్లో అనుకోవడం సర్వసాధారణం. అయితే విద్యాశాఖలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా సాగుతోంది. ఏళ్లతరబడి ప్రధానోపాధ్యాయులు ఎంఈఓలు కొనసాగుతున్నారు. నిబంధనల ప్రకారం ప్రధానోపాధ్యాయులు వారానికి 8 పీరియడ్లు తమ సబ్జక్టులను బోధించాలి. వివిధ రకాల సమావేశాలు, శిక్షణా కార్యక్రమాలు, నివేదికల సమర్పణ, పాఠశాలల పర్యవేక్షణ తదితర వాటికే వీరికి సమయం సరిపడలేదు. దీంతో వీరు తమ సొంత పాఠశాలలవైపు కన్నెత్తి చూడలేని పరిస్థితి. జిల్లాలోని చాపాడు, మైలవరం, కొండాపురం, కడప, ఖాజీపేట, చిట్వేలు, బద్వేలు, సుండుపల్లి, గాలివీడు మండలాలకు మాత్రమే రెగ్యులర్ ఎంఈఓలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఈయన పేరు కృష్ణఫర్. రాజుపాళెం మండలం వెలవలి జెడ్పీ పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. 2010 జూలై నుంచి మండలానికి ఇన్‌చార్జ్ ఎంఈఓగా కొనసాగుతున్నారు. అప్పుడప్పుడూ పాఠశాల ఎలా ఉందో అని వెళ్లి చూసుకోవడం తప్ప దాని స్థితిగతులను కూడా పర్యవేక్షించలేని పరిస్థితి.
-క్రిష్టఫర్,
రాజుపాళెం ఇన్‌చార్జి ఎంఈఓ
42 మండలాల్లో ప్రధానోపాధ్యాయులే ఎంఈఓలు
Published Tue, Nov 26 2013 2:38 AM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM
Advertisement
Advertisement