Tamil Nadu Headmaster Arrested For Sexually Harassed School Girl - Sakshi
Sakshi News home page

Tamil Nadu Crime: ప్రధానోపాధ్యాయుడి పాడుపని.. మాట్లాడాలని గదిలోకి పిలిపించుకుని..

Published Sun, Jul 24 2022 3:35 PM | Last Updated on Sun, Jul 24 2022 9:58 PM

Headmaster Arrested For Molestation School Girl Tamil Nadu - Sakshi

వేలూరు(చెన్నై): వేలూరు జిల్లా పేర్నంబట్టు సమీపంలోని మాచంబట్టి గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉంది. ఇందులో పేర్నంబట్టు సమీపంలోని ఆలయ వీధికి చెందిన  పాల్‌ వణ్ణన్‌ హెచ్‌ఎంగా పనిచేస్తున్నాడు. ఈ పాఠశాలలో చుట్టు పక్కలున్న గ్రామాల నుంచి  మొత్తం 75 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఇదిలా ఉండగా హెచ్‌ఎం పాల్‌ వణ్ణన్‌ ఓ విద్యార్థినితో మాట్లాడాలని చెప్పి తన గదిలోకి పిలిపించుకుని లైంగిక వేధింపులకు గురిచేసినట్లు తెలిసింది.

ఈ విషయాన్ని బాధిత విద్యార్థిని తల్లిదండ్రులకు చెప్పింది. ఆగ్రహించిన ఆమె తండ్రి హెచ్‌ఎంపై దాడి చేసి అనంతరం ఉమరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణ జరిపి పోక్సో చట్టం కింద హెచ్‌ఎం పాల్‌వణ్ణన్‌ను అరెస్ట్‌ చేశారు.

చదవండి: Ananthapur Woman Suicide: అలాంటి తప్పు చేయాల్సి వస్తే చావడానికైనా సిద్ధం..

  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement