ఆడ్కిచర్ల హెచ్‌ఎంకు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు
Published Thu, Aug 15 2013 5:26 AM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM
పెద్దేముల్ మండలం ఆడ్కిచర్ల కేం ద్ర ప్రాథమికోన్నత పాఠశాల(సీయూపీఎస్) ప్రధానోపాధ్యాయుడు పి.శివకుమార్ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు(2012)కు ఎంపికయ్యారు. సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం రోజున రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ చేతుల మీదుగా ఆయన అవార్డును అందుకోనున్నారు. ఈమేరకు ఈనెల 12న కేం ద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ నుంచి ఆడ్కిచర్ల పాఠశాలకు లేఖ అం దింది. తాండూరు మండలం చిట్టిఘనాపూర్‌కు చెందిన శివకుమార్ 1989లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు.
ప్రస్తుతం ఆడ్కిచర్ల సీయూపీఎస్‌లో ప్రధానోపాధ్యాయునిగా పని చేస్తున్నారు. 2006లో జిల్లా, 2010లో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా శివకుమార్ అవార్డులను అం దుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నిరక్షరాస్యత నిర్మూలన, బాలకార్మికుల విముక్తికి ఆయన చేసిన కృషిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం శివకుమార్‌కు ఈ అవార్డును ప్రకటించింది. ప్రస్తు తం యోగా గురువుగా కూడా శిక్షణనిస్తున్న ఆయన సామాజిక రుగ్మతను రూపుమాపడానికి నాటకాల ద్వారా ప్రదర్శనలు కూడా ఇచ్చారు. శివకుమార్‌కు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడంపై తోటి ఉపాధ్యాయులు, సన్నిహితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Advertisement