national best teacher award
-
రాష్ట్రం నుంచి ముగ్గురు ఉపాధ్యాయులకు రాష్ట్రపతి పురస్కారాలు ప్రదానం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ, ఏపీ సహా దేశవ్యాప్తంగా 75 మంది ఉపాధ్యాయులకు మంగళవారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 2023కుగాను ఢిల్లీలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను అందించారు. ప్రాథమిక విద్యాశాఖ విభాగం కేటగిరీలో తెలంగాణ నుంచి మంచిర్యాల జిల్లాకు చెందిన అర్చన నూగురి, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సంతోష్ కుమార్ భేడోద్కర్‌లు అవార్డులు అందుకోగా కేంద్ర స్కిల్ డెవలప్మెంట్–ఆంట్రప్రెన్యూర్షిప్ శాఖ అందించే ఉత్తమ ఉపాధ్యాయ కేటగిరీలో హైదరాబాద్ ఎన్‌ఐఎంఎస్‌ఎంఈ ఫ్యాకల్టీ డాక్టర్ దిబ్యేందు చౌదరి కూడా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు. అలాగే ఏపీ నుంచి ప్రాథమిక విద్యాశాఖ విభాగం కేటగిరీలో నెల్లూరుకు చెందిన మేకల భాస్కర్‌రావు, విశాఖపట్నం శివాజీ పాలెంకు చెందిన మురహరరావు ఉమా గాంధీ, రాయచోటికి చెందిన సెట్టెం ఆంజనేయులు అవార్డులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సైతం పాల్గొన్నారు. -
గురువులకు జాతీయ గుర్తింపు
-
సులభతర విద్యకు.. రేఖాంశాలెన్నో..
తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం సిటీ: విద్యార్థుల మానసిక పరిస్థితి అంచనా వేయడం, చిన్నారుల దృష్టిని చదువుపైకి మళ్లించి ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దాలనే సంకల్పం, వినూత్న రీతిలో విద్యాబోధన.. ఇలా ఎన్నో అంశాలు ఆమెను జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకునేలా చేశాయి. జాతీయ స్థాయిలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరిగిన ఆదర్శ ఉపాధ్యాయ ఎంపికల్లో మన రాష్ట్రం నుంచి ఏకైక ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకోనున్నారు రాజమహేంద్రవరం నగరానికి చెందిన మేకా సుసత్యరేఖ. 1991 నుంచి రాజమహేంద్రవరంలోని నివేదిత కిశోర్ విహార్ ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలో లెక్కలు, ఫిజిక్స్ ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నారు. విద్యాబోధన వృత్తిలో చేరింది మొదలు నూతన విద్యావిధానాన్ని ఆవిష్కరించాలనే దృక్పథంతో విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా ఎన్నో విధానాలు ప్రవేశపెట్టారు. ఆటల ద్వారా అయితే విద్యార్థులకు సులభంగా బోధించవచ్చని గుర్తించిన ఆమె మ్యాథ్స్ కబడ్డీ, సైన్స్ కబడ్డీ, హిందీ కబడ్డీ, మ్యాథ్స్ మారధాన్ ఇలా ఆటల రూపంలో బోధన చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసి విద్యార్థుల్లో నూతనోత్తేజాన్ని నింపారు. దీనిని గమనించిన యాజమాన్యం మొత్తం అన్ని పాఠ్యాంశాలకు ఇదే పద్ధతి అలవాటు చేయడంతో ఉత్తమ ఫలితాలు సాధించడం మొదలు పెట్టారు. సుసత్యరేఖ పాఠశాలల పోటీల్లో రాష్ట్ర, జిల్లా ఏ స్థాయి పోటీలకు వెళ్లినా విజయంతోనే తిరిగివచ్చేవారు. ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో ఎనిమిది అవార్డులు, రాష్ట్ర స్థాయిలో 50 పైచిలుకు అవార్డులు, జిల్లా, డివిజన్ స్థాయిలో లెక్కలేనన్ని అవార్డులు ఆమె సాధించారు. నాలుగు డివిజన్లలో విద్యాబోధన విద్యార్థుల్లో విద్యాబోధన సక్రమంగా నిర్వహించేందుకు నాలుగు పద్ధతులు అవలంబిస్తున్నట్టు సుసత్యరేఖ పేర్కొన్నారు. అవి స్కూల్లో క్లాస్ వర్క్, విద్యార్థి ప్రవర్తన, ప్రాజెక్ట్ వర్క్, జనరల్ స్లిప్ టెస్ట్. వీటి ద్వారా విద్యాబోధన చేస్తుండడం వల్ల విద్యార్థుల్లో గ్రహణశక్తి అధికమవుతుందని ఆమె అంటున్నారు. ఇన్నర్ వీల్ జోనల్ రిప్రజెంటేటివ్‌గా 17 స్కూళ్లకు సదుపాయాలు కల్పన ఇన్నర్ వీల్ క్లబ్‌కు అధ్యక్షురాలిగా ఆమె పనిశారు. ఆ సమయంలో చేసిన సేవలకు జోనల్ రిప్రజెంటేటివ్‌గా నియమించారు. దీని ద్వారా 17 స్కూళ్లకు విద్యాసదుపాయాలు కల్పించగలిగారు. ఇప్పటి వరకూ మూడు డిజిటల్ క్లాస్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. 4న పీఎంతో సమావేశం.. 5న అవార్డు స్వీకరణ.. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికైన మేకా సుసత్యరేఖ మాట్లాడుతూ సెప్టెంబర్ నాలుగో తేదీన దిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోడీతో దేశవ్యాప్తంగా అవార్డు పొందిన 45 మంది ఉపాధ్యాయులతో సమావేశం ఉందన్నారు 5వ తేదీ ఉపా«ధ్యాయుల దినోత్సవాన్ని పురష్కరించుకుని విద్యాభవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామనాధ్ కోవింద్ చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నట్లు తెలిపారు. అవి మరచిపోలేని మధురానుభూతులు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొంతమూరు గ్రామంలో నిర్వహించిన బడిబాట ప్రారంభోత్సవ కార్యక్రమంలో తాను తయారు చేసిన గాలిపటం వైఎస్ ఎగుర వేసి తనను అభినందించిన విధానం తన జీవితంలో మరువలేని అనుభూతిని నింపిందని ఆమె గుర్తు చేసుకున్నారు. ఇటీవల హైదరాబాద్ వెళ్లేందుకు విమానాశ్రయానికి వెళ్లగా వైఎస్సార్ సీపీ అ«ధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎనర్జటైజింగ్ టెస్ట్ బుక్స్(కోర్ టెస్ట్ బుక్స్) గురించి సుమారు గంట పాటు వివరాలు అడిగారని, విద్యావ్యవస్థ«పై ఆయనకున్న ప్రోత్సాహం అర్ధమైందన్నారు. అందరూ టీచర్లే.. తన కుటుంబంలో సుమారు రెండు డజన్లు మంది టీచర్లు ఉన్నారని, తాత, తల్లి, తండ్రి, భర్త, చిన్నాన్న, మావయ్య, బావ, అక్క, చెల్లి, మరిది, తోటికోడలు ఇలా అందరూ టీచర్లేనని ఆమె తెలిపారు. విద్యాభోదనకు ప్రేరణ, స్ఫూర్తి తనకు తాతయ్య వేగులపాటి వెంకన్న చౌదరి అని, రాష్ట్రంలో హిందీ భాషకు తొలి టీచర్ తాతయ్యేనన్నారు. ఉభయ రాష్ట్రాల్లో ఆమెమెథడ్స్ అమల్లో ఉన్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆమె రూపొందించిన ‘రేఖా బడి ’ మెథడ్స్ ఫాలో అవుతున్నారు. ఆమె తయారు చేసిన యూ ట్యూబ్ ఛానల్, బ్లాగ్స్పాట్, ఆండ్రాయిడ్ యాప్, కంటిన్యూనియస్ కాంప్రహెన్సివ్ ఎవల్యూషన్ రెండు రాష్ట్రాల స్కూళ్లల్లో అమలు చేస్తున్నారు. పలు అవార్డులు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లో తన పరిశోధనకు రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ స్థాయి అవార్డు, సీఎం సైన్స్ సలహాదారుడు సీఎస్‌రావు అవార్డు, రూ.10 వేల నగదు పురస్కారం ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం, గవర్నర్ రంగరాజన్ చేతుల మీదుగా ఇండియన్ రెడ్‌క్రాస్ అవార్డులు, ఇంటర్నేషనల్ తానా గ్లోబల్ సైన్స్ ఫేర్‌లో రెండో స్థానం సాధించి ఎఫిలికేటెడ్ సైన్స్ టీచర్ అవార్డు, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయిని అవార్డు, రాష్ట్ర ఉత్తమ పర్యావరణవేత్తగా గ్రీన్ కోర్ అవార్డు, నేషనల్ చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్ అవార్డు అంతర్జాతీయ జీవవైవిద్య సదస్సులో బహుమతులు ఇలా పలు అవార్డులు సాధించారు. -
‘ఉత్తమ’ గురువులకు కలెక్టర్ అభినందన
శ్రీకాకుళం పాతబస్టాండ్: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు మణిపాత్రుని నాగేశ్వరరావు, పమ్మిన రమాదేవిలను కలెక్టర్ పి.లక్ష్మీనరసింహ శనివారం ఆయన కార్యాలయంలో అభినందించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి చేతులు మీదుగా వీరు అవార్డులు అందుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా నుంచి ఇద్దరు ఉపాధ్యాయులు జాతీయ స్థాయి అవార్డులు సాధించడం అభినందనీయమన్నారు. మరింత బాధ్యతతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఈవో డి.దేవానంద రెడ్డి పాల్గొన్నారు. -
జాతీయ అవార్డు
ఆత్మకూరు : ఆత్మకూరు మండలం పులుకుర్తిలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో స్కూల్‌అసిస్టెంట్(జీవశాస్త్రం)గా పనిచేస్తున్న పరికిపండ్ల వేణు సోమవారం ఢిల్లీలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ అవార్డు అందజేశారు. అనంతరం వేణు మాట్లాడుతూ అవార్డు అందుకోవడం గర్వంగా ఉన్నదని, ఈ అవార్డు తన బాధ్యతను మరింత పెంచిందని అన్నారు. -
మా మంచి మాస్టారు
ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెస్తున్న వేణు అంకితభావంతో విద్యార్థులకు బోధన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డుకు ఎంపిక రేపు ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా స్వీకరణ ఆత్మకూరు : సమాజంలో అన్ని వృత్తుల కంటే ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైంది. అందు కే ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల తర్వాత గురు వులనే పూజిస్తుంటారు. అయితే ఇలాంటి వృత్తినే ఎన్నుకున్న ఓ వ్యక్తి చిత్తశుద్ధితో పనిచేస్తూ పేరు సంపాదిస్తున్నారు. మండలంలోని పులుకుర్తి జెడ్పీ పాఠశాలలో జీవశాస్త్రం స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న పరికిపండ్ల వేణు విద్యా, సాంస్కృతి క, సామాజిక సే వలందిస్తూ తోటి ఉపాధ్యాయులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. బోధనలకే పరిమితం కాకుం డా విద్యార్థుల్లో నైతిక పాఠాలు చెబుతున్నారు. నాన్న స్ఫూర్తితో టీచర్‌గా.. హసన్‌పర్తి మండలం చింతగట్టుకు చెందిన పరికిపండ్ల కన్నయ్య, పుష్పలీల దంపతులకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఇందులో పెద్ద కుమారుడు వేణు చిన్నప్పటి నుంచే చదువులో ప్రతిభ కనబరి చేవారు. తండ్రి ఉపాధ్యాయ వృత్తిని చేపట్టడంతో తాను కూడా అందులో రాణించాలని వేణు కలలుగని ఆ దిశగా విద్యనభ్యసించారు. కాగా, వేణు భార్య సుమలత, మామయ్య వెల్దండి రమణయ్య, ఇద్దరు మరదళ్లు మాధవి, శుభ, చిన్న బావ కూడా ప్రస్తుతం ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. వేణు తండ్రి కన్నయ్య ఖమ్మం జిల్లా కమలాపూర్ పాఠశాలలో 20 ఏళ్లు ఏకకాలంగా పనిచేసి అక్కడి అధికారులు, ప్రజల మన్నలను పొందారు. అలాగే జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు. 1987లో ఉద్యోగం.. వర్ధన్నపేట మండలం భవానీకుంట ప్రాథమిక పాఠశాలలో 1987 ఆగస్టు 29న వేణు ఎస్జీటీగా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. ఆ సమయంలో ఆయన పనిచేస్తున్న బడిలో విద్యార్థులు లేకపోవడంతో డిప్యూటేషన్‌పై‡వేరే పాఠశాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. దీంతో వేణు అధికారులకు నచ్చజెప్పి, గ్రామంలోని ప్రజలను చైతన్యపరిచి విద్యార్థులను పాఠశాలలో చేర్పించారు. అలాగే భవానీకుంట తండా పెద్దతో మాట్లాడి పాఠశాల సొంత భవనం నిర్మాణానికి స్థలం ఇప్పించారు. తర్వాత గదుల నిర్మాణానికి కూడా కృషిచేశారు. అనంతరం ఆత్మకూరు మండలం ల్యాదల్లలో 1998 నుంచి 2001 వరకు, పెంచికల పేటలో 2001 నుంచి 2009 వరకు, పులుకుర్తిలో 2009 నుంచి పనిచేస్తున్నారు. అయితే వేణు ఏ పాఠశాలలో పనిచేసినా అక్కడి విద్యార్థులకు మెరుగైన బోధనలు అందిస్తూ వారి అభివృద్ధికి పాటుపడుతున్నారు. సామాజిక కార్యకర్తగా... విద్యార్థులకు ఓ వైపు బోధనలు అందిస్తూనే మరోవైపు సామాజిక కార్యకర్తగా హక్కులపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అలాగే జనవిజ్ఞానవేదిక సభ్యుడిగా మూఢనమ్మకాలపై చైతన్య పరుస్తున్నారు. తాను నివాసముంటున్న హన్మకొండలోని ఆదర్శకాలనీ కమిటీ సెక్రటరీగా పనిచేస్తూ పర్యావరణ పరిరక్షణకు కృషిచేస్తున్నారు. కలాం సైన్స్ క్లబ్ ఏర్పాటు.. విద్యార్థుల్లో సైన్స్‌పై ఆసక్తి కలిగించేందుకుS2004లో కలాం సైన్స్‌క్లబ్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో తాను ఏ పాఠశాలలో పనిచేస్తున్న అక్కడి విద్యార్థులకు క్లబ్ ద్వారా సేవలు అందిస్తున్నారు. అలాగే ఎన్నో వైజ్ఞానిక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా ‘చిన్నారిలోకం’ కార్యక్రమానికి విద్యార్థులను పంపించి ప్రసారాలు చేయించారు. దీంతోపాటు జాతీయ బాలలసైన్స్ కాంగ్రెస్‌లో ప్రతిభ కనబరిచేందుకు కృషి చేస్తున్నారు. కలాం సైన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అనేక కార్యక్రమాలకుగాను ‘విజ్ఞాన్ ప్రసార్ విప్‌నెట్’ సభ్యత్వం దక్కింది. ఈ క్రమంలో విప్‌నెట్ ఆహ్వానం మేరకు 2014లో శ్రీహరి కోటలోని సతీష్‌ధావన్ అంతరిక్ష కేంద్రంలో ఏర్పాటు చేసిన వర్క్‌షాప్‌లో వేణు ‘మోడల్æరాకెట్’ను తయారు చేసి అధికారుల మన్ననలు పొందారు. ఆయన శిక్షణలో పలువురు విద్యార్థులు రెసిడెన్షియల్ పాఠశాలల్లో సీట్లు పొందారు. మరికొందరు నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్‌షిప్‌నకు ఎంపికయ్యారు. సెలవు లేకుండా బడికి ఉపాధ్యాయ వృత్తితోపాటు వేణు సామాజిక రచయితగా కూడా ప్రజలకు సేవలు అందిస్తున్నారు. ఈ మేరకు ఆయన ఆకాశవాణి వరంగల్ కేంద్రంగా స్వయంగా ప్రసారాలు చేశారు. తాను సొంతంగా రచనలు చేయడమే కాకుండా విద్యార్థులకు పఠనం, స్వీయ రచనలను అలవాటుగా మార్చుతున్నారు. సైన్స్, ఆరోగ్యం, ప్రకృతి, పర్యావరణం, తదితరSఅంశాల్లో విద్యార్థులతో స్వీయ రచనలు చేయిస్తూ ‘వేకువ’ బాలలసైన్స్’ మాసపత్రికను నిర్వహిస్తున్నారు. కాగా, 2014–15 విద్యా సంవత్సరంలో ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా బడికి వచ్చి విద్యార్థులకు పాఠాలు బోధించి జిల్లాలోనే ఆదర్శంగా నిలిచారు. ఎన్నో అవార్డులు విద్యార్థులకు మెరుగైన బోధనలు అందిస్తూ, అంకితభావంతో పనిచేస్తున్నందుకు వేణుకు 2003లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వచ్చింది. 2008లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చేతులమీదుగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు. ఇదే ఏడాదిలో ఇందిరా ప్రియదర్శిని, ఉత్తమ ఎన్యూమరేటర్ అవార్డులను పొందారు. 2014లో ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ చేతుల మీదుగా ఉత్తమ వినియోగదారుల ఉద్యమకారుడి అవార్డు అందుకున్నారు. జవహర్ బాలల అరోగ్యరక్ష కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు, వరంగల్ క్లీన్సిటీలో కాలుష్య నివారణపై ప్రజలను చైతన్యపరిచినందుకు, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డులను అందుకున్నారు. ఈనెల 5న జరిగే ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీచేతుల మీదుగా ఢిల్లీలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకోనున్నారు. అవార్డు బాధ్యతను పెంచింది నాకు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడం గర్వంగా ఉంది. ఈ అవార్డు నా బాధ్యతను రెట్టింపు చేసింది. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నతస్థాయి గౌరవం లభించడం ఆనందంగా ఉంది. నాన్న నేర్పిన సేవా దృక్పథమే నన్ను ఈ స్థాయికి చేర్చింది. నేను ఉద్యోగ విరమణ పొందే వరకూ విద్యార్థుల అభివృద్ధికి పాటుపడుతూనే ఉంటాను. – పరికిపండ్ల వేణు, స్కూల్ అసిస్టెంట్ పులుకుర్తి జెడ్పీ పాఠశాల -
ఆడ్కిచర్ల హెచ్ఎంకు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు
పెద్దేముల్ మండలం ఆడ్కిచర్ల కేం ద్ర ప్రాథమికోన్నత పాఠశాల(సీయూపీఎస్) ప్రధానోపాధ్యాయుడు పి.శివకుమార్ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు(2012)కు ఎంపికయ్యారు. సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం రోజున రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ చేతుల మీదుగా ఆయన అవార్డును అందుకోనున్నారు. ఈమేరకు ఈనెల 12న కేం ద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ నుంచి ఆడ్కిచర్ల పాఠశాలకు లేఖ అం దింది. తాండూరు మండలం చిట్టిఘనాపూర్కు చెందిన శివకుమార్ 1989లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆడ్కిచర్ల సీయూపీఎస్లో ప్రధానోపాధ్యాయునిగా పని చేస్తున్నారు. 2006లో జిల్లా, 2010లో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా శివకుమార్ అవార్డులను అం దుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నిరక్షరాస్యత నిర్మూలన, బాలకార్మికుల విముక్తికి ఆయన చేసిన కృషిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం శివకుమార్‌కు ఈ అవార్డును ప్రకటించింది. ప్రస్తు తం యోగా గురువుగా కూడా శిక్షణనిస్తున్న ఆయన సామాజిక రుగ్మతను రూపుమాపడానికి నాటకాల ద్వారా ప్రదర్శనలు కూడా ఇచ్చారు. శివకుమార్‌కు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడంపై తోటి ఉపాధ్యాయులు, సన్నిహితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.