జాతీయ అవార్డు
జాతీయ అవార్డు
Published Wed, Sep 7 2016 12:36 AM | Last Updated on Wed, Aug 8 2018 6:12 PM
ఆత్మకూరు : ఆత్మకూరు మండలం పులుకుర్తిలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో స్కూల్‌అసిస్టెంట్(జీవశాస్త్రం)గా పనిచేస్తున్న పరికిపండ్ల వేణు సోమవారం ఢిల్లీలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ అవార్డు అందజేశారు. అనంతరం వేణు మాట్లాడుతూ అవార్డు అందుకోవడం గర్వంగా ఉన్నదని, ఈ అవార్డు తన బాధ్యతను మరింత పెంచిందని అన్నారు.
Advertisement
Advertisement