జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులను అభినందిస్తున్న కలెక్టర్
‘ఉత్తమ’ గురువులకు కలెక్టర్ అభినందన
Published Sat, Sep 17 2016 11:45 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
శ్రీకాకుళం పాతబస్టాండ్: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు మణిపాత్రుని నాగేశ్వరరావు, పమ్మిన రమాదేవిలను కలెక్టర్ పి.లక్ష్మీనరసింహ శనివారం ఆయన కార్యాలయంలో అభినందించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి చేతులు మీదుగా వీరు అవార్డులు అందుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా నుంచి ఇద్దరు ఉపాధ్యాయులు జాతీయ స్థాయి అవార్డులు సాధించడం అభినందనీయమన్నారు. మరింత బాధ్యతతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఈవో డి.దేవానంద రెడ్డి పాల్గొన్నారు.
Advertisement
Advertisement