తూప్రాన్: బైక్‌ను వెనుక నుంచి కారు ఢీకొనడంతో విధి నిర్వహణలో ఇద్దరు ప్రధానోపాధ్యాయులు (హెచ్‌ఎం) దుర్మరణం చెందారు. ఈ సంఘటన మెదక్ జిల్లా తూప్రాన్ మండలం మనోహరాబాద్ సమీపంలో 44వ జాతీయ రహదారిపై సోమవారం చోటు చేసుకుంది. మండలంలోని బ్రాహ్మణపల్లి, శివ్వంపేట మండలం పంబండ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు శ్రీకాంత్‌రెడ్డి (52), చంద్రయ్యలు పదోతరగతి పరీక్షలకు డిపార్టుమెంట్ ఆఫీసర్‌గా ఒకరు, చీఫ్ సూపరింటెండెంట్‌గా మరొకరు నియామకమయ్యారు. విధుల్లో భాగంగా సోమవారం కాళ్లకల్‌లో నూతనంగా ఎంపికైన పరీక్ష కేంద్రాన్ని పరిశీలించేందుకు బైక్‌పై బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న బైక్.. మనోహరాబాద్ గ్రామ సమీపంలోకి చేరుకోగానే వెనుక నుంచి వేగంగా వస్తున్న కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో శ్రీకాంత్‌రెడ్డి అక్కడికక్కడే దుర్మరణం చెందగా, చంద్రయ్యను జీఎంఆర్ అంబులెన్స్‌లో సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.
బైక్‌ను ఢీకొన్న కారు : ఇద్దరు హెచ్‌ఎంల మృతి
Published Tue, Mar 24 2015 1:23 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
Advertisement
Advertisement