కమలాపురం (వైఎస్సార్ జిల్లా) : వైఎస్సార్ జిల్లా కమలాపురం మండలం సి.రాజుపాలెంలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలను డిఈవో ప్రతాప్‌రెడ్డి మంగళవారం సాయంత్రం 4 గంటలకు ఆకస్మికంగా తనిఖీ చేశారు. అయితే అప్పటికే హెచ్‌ఎం సహా టీచర్లందరూ పాఠశాలకు తాళం వేసి వెళ్లిపోయారు.
సాయంత్రం 4.45 గంటల వరకూ పాఠశాల తరగతులు నిర్వహించాల్సి ఉండగా గంట ముందే బడికి తాళం వేసి వెళ్లిపోవడంతో డీఈవో ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటికప్పుడు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మురళీమోహన్‌ను సస్పెండ్ చేయాలని ఆర్డేడీకి సిఫార్సు చేశారు. విధి నిర్వహణలో బాధ్యతారహితంగా వ్యవహరించిన హెచ్‌ఎంపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఈవో చెప్పారు.
గంట ముందే బడికి తాళం: హెచ్‌ఎం సస్పెండ్
Published Tue, Dec 1 2015 7:33 PM | Last Updated on Sun, Sep 3 2017 1:19 PM
Advertisement
Advertisement