
హెచ్‌ఎం జ్ఞానశేఖరన్
వేలూరు: పాఠశాలలో విద్యార్థినులను లైంగిక వేధింపులకు గురిచేసిన కీచక హెడ్‌మాస్టర్‌కు గ్రామస్తులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. వేలూరు జిల్లా ఆంబూరు తాలుకా కంచి కొల్లై గ్రామానికి చెందిన జ్ఞానశేఖరన్ సోలూరు ప్రభుత్వ పాఠశాలలో హెచ్‌ఎంగా పనిచేస్తున్నాడు. ఎనిమిదో తరగతి విద్యార్థినులకు బోధన చేసేవాడు. ఆ సమయంలో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు వేధింపులకు గురిచేస్తున్నట్టు పలువురు విద్యార్థినులు తల్లిదండ్రులకు తెలిపారు.
దీనిపై ఆగ్రహించిన తల్లిదండ్రులు హెచ్‌ఎం జ్ఞానశేఖరన్‌ను నిలదీశారు. అందుకు హెచ్‌ఎం నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో పాటు దురుసుగా మాట్లాడడంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు అతనికి దేహశుద్ధి జరిపారు. విషయం తెలుసుకున్న తాలుకా పోలీసులు పాఠశాలకు వెళ్లి హెచ్‌ఎం జ్ఞానశేఖరన్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment