పాఠం చెబుతున్న హెచ్‌ఎం
పాల్వంచరూరల్: ఆ హెడ్‌మాస్టర్ స్టైలే వేరు. అందరి ఉపాధ్యాయుల మాదిరిగా కూర్చీలో కూర్చో కుండా.. నేలపైనే కూర్చొని విద్యాబోధన చేస్తారు. పాల్వంచ మండలం సంగం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 50 మంది విద్యార్థులు ఉన్నారు. ఇద్దరు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వారిలో హెచ్‌ఎం లాల్‌సయ్యద్ అనేక సంవత్సరాలుగా నేలపైనే కూర్చొని పాఠాలు బోధిస్తున్నారు. ఈయన గతంలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కూడా అందుకున్నారు. పాఠాలు బోధించేటప్పుడు నేలపైనే కూర్చొంటే విద్యార్థులు తనతో కలిసిపోతారని, మరింత శ్రద్ధతో వింటారని హెచ్‌ఎం తెలిపారు. ఏళ్ల నుంచి తాను అలాగే పాఠాలు బోధిస్తున్నట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment