
ప్రతీకాత్మక చిత్రం
తమిళనాడు, టీ.నగర్: నాగర్‌కోవిల్ ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు యువతితో రాసలీలలు జరుపుతూ పట్టుబడడంతో విద్యాశాఖ అతన్ని సస్పెండ్ చేసింది. ఈ సంఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. నాగర్‌కోవిల్ సమీపంలోగల ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సుదాంగన్ హెడ్మాస్టర్. ఇతని స్నేహితుడు సుబ్బు. ఇతనూ ఉపాధ్యాయుడే. వీరు సెలవు రోజుల్లో ప్రత్యేక తరగతుల పేరిట పాఠశాలకు వచ్చేవారు.
ఒక యువతిని పాఠశాలకు తమ వెంట తీసుకుని వచ్చి రాసలీలలు జరుపుతున్నట్లు తెలిసింది. ఆ సమయంలో మిగతా ఉపాధ్యాయులను పాఠశాలకు రావద్దని తామే చూసుకుంటామని చెప్పేవారని తెలిసింది. ఇలా ఒక రోజు తన కుమారుడితో మహిళ పాఠశాలకు రాగా హెడ్మాస్టర్‌తో గదిలో ఉంచి ఉపాధ్యాయుడు గది బయట తాళం వేశాడు. దీన్ని గమనించిన బాలుడు ఏడుపు లంకించుకోవడంతో స్థానికులు అక్కడికి చేరుకుని టీచర్ సుబ్బుతో గది తెరిపించారు. దీనిగురించి ఫిర్యాదు అందుకున్న జిల్లా విద్యాధికారి ప్రధానోపాధ్యాయుడు సుదాంగన్‌ను శనివారం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment