కళ్లకు గంతలు కట్టుకున్న దండపాణి
అతను సాధారణ విద్యార్థి.ఓ పూజారి వద్ద ఏదో శిక్షణ పొందాడు. అతను నేర్చుకున్న విద్యతో కళ్లకు గంతలు కట్టుకుని వస్తువులను ఇట్టే కనిపెట్టేస్తున్నాడు. నగదు నోట్లు, వరుస నంబర్లు కూడా ఇట్టే పసిగట్టేస్తున్నాడు. ప్రభుత్వం అనుమతిస్తే కళ్లకు గంతలు కట్టుకుని పరీక్ష రాస్తానని చెబుతున్న ఆ బుడితడి వివరాలు మీరే చదవండి..!
అన్నానగర్: పలైయజమకొండమ్ సమీపంలో గురువారం సాయంత్రం ప్రభుత్వ పాఠశాల విద్యార్థి కళ్లకు గంతలు కట్టుకుని తన చుట్టూ ఉన్న వస్తువులను కనిపెట్టి ఆశ్చర్యపరిచాడు. కరూర్ జిల్లా పలైయ జయకొండమ్ సమీపంలో కోవక్కులమ్ గ్రామానికి చెందిన జయపాల్ కూలీ కార్మికుడు. ఇతని కుమారుడు దండపాణి (13). పలైయ జయకొండమ్‌లో ఉన్న ప్రభు త్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. ఇతను కళ్లకు గంతలు కట్టుకొని చుట్టూ జరిగే దానిని తెలుసుకునే విధంగా శిక్షణ పొందాడు. గురువారం పాఠశాలలో కళ్లకు గంతలు కట్టుకున్నాడు. ఉపాధ్యాయుల చేతి వేళ్లను చూపించి ఇది ఎంత అని నగదు చూ పించగా సరిగ్గా సమాధానం చెప్పా డు. నగదు నోట్ల విలువ, ఆ నోటు వరుస నంబర్లు చెప్పడంతో స్థానికులు ఆశ్చర్యపోయారు.
దండపాణి మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను దీనిపై రెండు నెలలుగా శిక్షణ తీసుకున్నా. ముందు అర గంట వ్యాయామం, మరో అర గంట నిద్రపోవాలి. తరువాత నా చుట్టూ నిలబడిన వారి గురించి క్షుణ్ణంగా చెప్పవచ్చు. చదువు లో వెనుకబడిన నేను ప్రస్తుతం రా ణిస్తున్నా. ప్రభుత్వ అనుమతిస్తే నేను కళ్లకు గంతలు కట్టుకుని పరీక్ష రాస్తా’ అని చెప్పారు. దండపాణికి శిక్షణ ఇచ్చిన వేల్‌మురుగన్ మాట్లాడుతూ.. ‘నేను ఇదే పాఠశాలలో చదివాను. బీఏ డిగ్రీ పొందాను. పలైయజెయకొండమ్‌లోని పాంబలాయి యమ్మన్ ఆలయంలో పూజారిగా ఉన్నాను. ప లు గ్రంథాలు చదివాను. ప్రస్తుతం విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాను. విద్యార్థులకు శిక్షణ ఇచ్చి, వారిని సమాజంలో గొప్పగా చూడాలన్నదే నా లక్ష్యం’ అని చెప్పాడు.
Comments
Please login to add a commentAdd a comment