ఐక్యరాజ్య సమితిలో ఏపీ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ప్రసంగించనున్నారు. గత నాలుగేళ్లలో ఏపీ విద్యా వ్యవస్థ పటిష్టమైన తీరు, అమలవుతున్న వివిద విద్యా పథకాల పై యూఎన్ ఎస్డీజీ సదస్సులో మాట్లాడనున్నారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల పై యూఎన్ లో జరిగే సదస్సులో భాగంగా విద్య అంశం పై మాట్లాడాల్సిందిగా ఏపీ విద్యార్థులకు ఐక్యరాజ్య సమితి ఆహ్వానం పంపింది. లారీ డ్రైవర్, రైతుకూలీ, ఆటో డ్రైవర్, మెకానిక్ ఇలా నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఐక్యరాజ్య సమితి, ప్రపంచ బ్యాంకు, వైట్ హౌస్ వంటి ప్రఖ్యాత విశ్వవేదికల మెట్లెక్కబోతున్నారు.
జులైలో జరిగిన ఐక్యరాజ్య సమితి హైలెవెల్ పొలిటికల్ ఫోరమ్లో ఏపీ ప్రభుత్వం నాడు-నేడు కార్యక్రమానికి సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు చేసింది. స్టాల్స్ సందర్శించిన యూఎన్ ప్రతినిధులను ఏపీ విద్యా పథకాలు ఆకట్టుకున్నాయి. పాఠశాలల పునరుద్ధరణ, విద్యాదీవెన, వసతిదీవెన, విద్యాకానుక, డిజిటలైజేషన్ తదితర విద్యా పథకాలకు సంబంధించిన వివరాలను యూఎన్ ప్రతినిధులు అడిగి తెలుసుకున్నారు. ఏపీలో "ఈక్విటబుల్ ఎడ్యుకేషన్- ఎడ్యుకేషన్ యాక్సెస్ ఫర్ ఆల్" అంశం, ఏపీలో అమలవుతున్న సంస్కరణల గురించి ప్రసంగించాలని వారు ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులను ఆహ్వానించారు.
దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించే అవకాశాన్ని ఏపీ విద్యార్థులు దక్కించుకున్నారు. ఎనిమిది మంది బాలికలు, ఇద్దరు బాలురతో కూడిన 10 మంది విద్యార్థులు ఈ బృందంలో ఉన్నారు. పదవ తరగతి పరీక్షల్లో రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ మార్కులు వచ్చిన 103 మందికి రాతపరీక్ష నిర్వహించి, కమ్యూనికేషన్ స్కిల్స్ పరీక్షించి 10 మంది విద్యార్థులను విద్యాశాఖ ఎంపిక చేసింది.
సమగ్ర శిక్ష పీడీ బి. శ్రీనివాసరావు ఈ బృందానికి ప్రతినిధిగా ఉన్నారు, కేజీబీవీ కార్యదర్శి డి. మధుసూదన్ రావు నోడల్ ఆఫీసర్ గా, ఉపాధ్యాయులు డి. విజయదుర్గ, కేవీ హేమప్రసాద్ మార్గదర్శకులుగా వ్యవహరిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి స్పెషల్ కన్సల్టెటివ్ స్టేటస్ మెంబర్ ఉన్నవ షకీన్ కుమార్ సమన్వయంతో ఏపీ అధికారులు ఈ పర్యటనకు ఏర్పాట్లు చేశారు. మంత్రి బొత్స సత్యనారాయణ, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్. సురేష్ కుమార్ భారత్ నుండి ఈ పర్యటనను పర్యవేక్షిస్తున్నారు. వారం రోజుల పాటు జరగనున్న ఈ పర్యటనకు అయ్యే పూర్తి ఖర్చు ఏపీ ప్రభుత్వమే భరిస్తోంది.
సదస్సులో పాల్గొనేందుకు నిన్న న్యూయార్క్ చేరుకున్న విద్యార్థి బృందానికి ఉత్తర అమెరికా ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏపీ విద్యావ్యవస్థ సాధించిన విజయాలు దేశానికే కాకుండా ప్రపంచానికే మార్గదర్శకంగా మారతాయని పేర్కొన్నారు. విద్య పరంగా ప్రపంచం దేశాలు ఎదుర్కొనే సమస్యలకు ఏపీ విద్యావ్యవస్థ ఒక మోడల్ వ్యవస్థగా నిలుస్తోందన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా కొత్తతరం నాయకుడిగా తనను తాను ఆవిష్కరించుకున్నారని, ఆదర్శ ముఖ్యమంత్రిగా నిలిచారన్నారు. ఎంతో ప్రతిభగల ఈ విద్యార్థి బృందంతో మమేకమయ్యే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు.
ఐక్యరాజ్య సమితి ఎస్డీడీ సదస్సులో పాల్గొనే విద్యార్థులు వీరే..
►మాల శివలింగమ్మ (తండ్రి రైతుకూలీ)
►మోతుకూరి చంద్రలేఖ (తండ్రి ఆటోడ్రైవర్)
►గుండుమూగల గణేష్ (తండ్రి కౌలురైతు)
►దడాల జ్యోత్స్న (తండ్రి సెక్యూరిటీ గార్డ్)
►సి. రాజేశ్వరి (తండ్రి లారీ డ్రైవర్)
►పసుపులేటి గాయత్రి (కూలీ)
►అల్లం రిషితా రెడ్డి (తండ్రి మెకానిక్)
►వంజివాకు యోగేశ్వర్ (తండ్రి కేబుల్ ఆపరేటర్)
►షేక్ అమ్మాజాన్ (తండ్రి వ్యవసాయ కూలీ)
►సాముల మనస్విని (తల్లి సాధారణ గృహిణి)
Thanks to CM jagan anna @ysjagan
— Kadapa Rathnakar (@KadapaRathnakar) September 16, 2023
💐💐 proud of Andhra Pradesh government school childrens attend United nations.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల పిల్లలు యునైటెడ్ నేషన్స్‌కు హాజరవడం గర్వకారణం.💐💐#YSJaganMohanReddy #andhrapradeshgovernmentschools#UnitedNations pic.twitter.com/YnhPeLQH66
Comments
Please login to add a commentAdd a comment