ఐక్యరాజ్యసమితిచే గుర్తింపు పొందిన మన ‘నాడు-నేడు’.. శభాష్‌ ఏపీ..! | Our Nadu Nedu Scheme Recognized By The United Nations | Sakshi
Sakshi News home page

ఐక్యరాజ్యసమితిచే గుర్తింపు పొందిన మన ‘నాడు-నేడు’.. శభాష్‌ ఏపీ..!

Published Sat, Oct 21 2023 10:10 AM | Last Updated on Sat, Oct 21 2023 10:31 AM

Our Nadu Nedu Recognized By The United Nations - Sakshi

ప్రపంచ గుర్తింపు సాధించిన మన విద్యా విధానం
ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్ధకు అరుదైన గుర్తింపు లభించింది. ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్ధుల పర్యటనను తమ వెబ్‌సైట్‌లో ఐక్యరాజ్య సమితి పబ్లిష్‌ చేసింది. తద్వారా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్ధలో తీసుకువచ్చిన సంస్కరణలు, నూతన విద్యావిధానాలకు విశ్వవ్యాప్త గుర్తింపును ఐక్యరాజ్యసమితి ఇచ్చినట్టయింది.

మన రాష్ట్ర విధాన్ని తన సైట్‌లో ప్రచురించిన యుఎన్
ప్రపంచశాంతి, సమాజంలో మార్పు కోసం పాటుపడే ఐక్యరాజ్యసమితి  ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్ధ, ఏపీలో అమలవుతున్న బాలికా విద్యా, జెండర్ ఈక్వాలిటీ, ఈక్విటబుల్ ఎడ్యుకేషన్ (అందరికి సమానవిద్య) నచ్చి తమ వెబ్ సైట్ లో ప్రమోట్ చేసేందుకు ఒక ఆర్టికల్ ను (సంచికను) ప్రచురించింది. ప్రపంచంలోనే అత్యంత అరుదైన గుర్తింపు మన ఏపీ రాష్ట్రానికి దక్కడం ఎంతో గొప్ప విషయం.

దేశచరిత్రలో తోలి సారిగా..
సమాజంలో అట్టడుగు వర్గాల  గొంతుకను ప్రపంచ వేదిక, యూఎన్ లో వినిపించేందుకు ఏపీ ప్రభుత్వం తరఫున పంపించిన పదిమంది ప్రభుత్వ పాఠశాల విద్యార్ధుల ప్రతిభను గుర్తించి ఐక్యరాజ్య సమితి వెబ్ సైట్  ఇంపాక్ట్ స్టోరీస్ లిస్ట్ లో దీన్ని లిస్ట్ చేశారు యుఎన్ అధికారులు. సెప్టెంబర్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులను అమెరికాలోని పలు అంతర్జాతీయ మీటింగ్ ల కోసం పంపించారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.

పదిరోజుల పర్యటనలో భాగంగా యునైటెడ్ నేషన్స్ మెంబర్ ఉన్నవ షకిన్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులు అమెరికా న్యూయార్క్ లో ఉన్న ఐక్యరాజ్య సమితి ప్రపంచ ప్రధాన కార్యాలయంలో సెప్టెంబర్ లో జరిగిన SDG సమ్మిట్, యూత్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు మన ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులు

నాడు-నేడు స్లాల్‌ను సందర్శించిన లచ్చెజర స్టోవ్‌
జులైలో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం న్యూయార్క్ లో జరిగిన  హైలెవల్ పొలిటికల్ ఫోరం సదస్సులో ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వ సంక్షేమ పధకాలు – నాడు - నేడు నవరత్నాల స్టాల్ ను ఏర్పాటు చేశారు యుఎన్ మెంబర్ ఉన్నవ షకిన్ కుమార్. ఈ స్టాల్ ను ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ ప్రెసిడెంట్ లచ్చెజర స్టోవ్ సందర్శించి ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా విధానాలను కొనియాడారు. ఏదేమైనా ఏపీ విద్యార్ధుల ప్రతిభను ఐక్యరాజ్య సమితి గుర్తించి తమ  వెబ్ సైట్ లో ప్రచురించడం చాలా గొప్ప విషయం.

 ఇది చదవండి: ‘మందిరం చూడండి.. మానవత్వానికి అండగా నిలవండి’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement