
సిద్దిపేట జోన్: వారంతా కొన్ని రోజులుగా కఠోరంగా పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం శ్రమిస్తున్నారు. ఆదివారం వారికి సిద్దిపేట పట్టణంలోని విపంచి ఆడిటోరియంలో ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఉచితంగా స్టడీ మెటీరియల్ అందజేశారు. ఈ సందర్భంగా వ్యాఖ్యాత ఎజాజ్ అహ్మద్ యువతను ఉద్దేశించి ‘భవిష్యత్‌లో మీరు పోలీస్ అవుతారు. తుపాకీ ఎలా వినియోగించాలో ఒకసారి చూపించండి’అని కోరగా.. మంత్రి సమక్షంలో వారంతా ఒకేసారి రెండు చేతులతో తుపాకీ కాల్చే ప్రక్రియ చేసి చూపించారు. అది చూసిన మంత్రి అభినందన తరహాలో యువతకు సెల్యూట్ చేసి వారిని ప్రోత్సహిస్తూ లక్ష్యంతో పోలీస్ ఉద్యోగం సాధించాలని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment