Training Constables
-
గురి పెట్టాల్సిందే.. సెల్యూట్ కొట్టాల్సిందే..
సిద్దిపేట జోన్: వారంతా కొన్ని రోజులుగా కఠోరంగా పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం శ్రమిస్తున్నారు. ఆదివారం వారికి సిద్దిపేట పట్టణంలోని విపంచి ఆడిటోరియంలో ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఉచితంగా స్టడీ మెటీరియల్ అందజేశారు. ఈ సందర్భంగా వ్యాఖ్యాత ఎజాజ్ అహ్మద్ యువతను ఉద్దేశించి ‘భవిష్యత్‌లో మీరు పోలీస్ అవుతారు. తుపాకీ ఎలా వినియోగించాలో ఒకసారి చూపించండి’అని కోరగా.. మంత్రి సమక్షంలో వారంతా ఒకేసారి రెండు చేతులతో తుపాకీ కాల్చే ప్రక్రియ చేసి చూపించారు. అది చూసిన మంత్రి అభినందన తరహాలో యువతకు సెల్యూట్ చేసి వారిని ప్రోత్సహిస్తూ లక్ష్యంతో పోలీస్ ఉద్యోగం సాధించాలని పిలుపునిచ్చారు. -
ఘనంగా కమ్యూనికేషన్ కానిస్టేబుళ్ల దీక్షాంత్ పరేడ్
సాక్షి, హైదరాబాద్: పోలీస్ శాఖలోని కమ్యూనికేషన్స్ విభాగంలో కానిస్టేబుళ్లుగా ఎంపికై 9 నెలల శిక్షణ పూర్తి చేసుకున్న సిబ్బంది దీక్షాంత్ పరేడ్‌ను గురువారం సిటీ ఆర్మ్డ్ హెడ్‌క్వార్టర్స్‌లో ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన రోడ్‌సేఫ్టీ డీజీపీ కృష్ణప్రసాద్ గౌరవ వందనం స్వీకరించారు. క్రమశిక్షణ, అంకితభావంతో విధులు నిర్వర్తించాలని, శాఖలో కీలకమైన కమ్యూనికేషన్ విభాగానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని సూచించారు. శిక్షణలో ప్రతిభ కనబరిచిన కానిస్టేబుళ్లకు అవార్డులు బహూకరించారు. కార్యక్రమంలో అదనపు డీజీపీ రవిగుప్తా, అదనపు కమిషనర్లు డీఎస్ చౌహాన్, మురళీకృష్ణ, శివప్రసాద్, కమ్యూనికేషన్ డీఐజీ శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు. -
ట్రైనీ కానిస్టేబుల్స్ ఆందోళన
విజయనగరం క్రైం, న్యూస్‌లైన్: జిల్లాలోని పోలీసు శిక్ష ణ కేంద్రంలో సోమవారం అర్ధరాత్రి ఏఆర్ కానిస్టేబు ళ్లు ఆందోళనకు దిగారు. పరీక్షా కేంద్రంలో తెలంగాణ పోలీసు అధికారుల పక్షపాత ధోరణి వ్యవహారంపై సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కానిస్టేబుళ్లు నిరసనకు దిగారు. శిక్షణ కేంద్రాల్లో ఆర్డ్ రిజర్వ్డు(ఏఆర్) కానిస్టేబుల్ నుంచి సివిల్ కానిస్టేబుల్‌కు కన్వర్షన్ కోసం పరీ క్షలు జరిగాయి. వివిధ జిల్లాలకు చెందిన కానిస్టేబుల్స్ మూడునెలలుగా ఇక్కడ శిక్షణ పొందుతున్నారు. పీటీసీలో మొత్తం 548 మంది ఏఆర్ నుంచి సివిల్‌గా శిక్షణ పొందారు. వీరిలో 94 మంది కానిస్టేబుళ్లకు సోమవా రం పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు ఇన్విజిలేటర్స్‌గా వరంగల్ జిల్లా పోలీసు అధికారులు వ్యవహరించారు. అభ్యర్థుల్లో ఇద్దరు సీమాంధ్రకు చెందిన కానిస్టేబుల్స్ జవాబు పత్రాలను పక్కన పెట్టి వారిని అనర్హులుగా ప్రకటించినట్లు తెలిసింది. ఈ విషయాన్ని తెలుసుకు న్న సీమాంధ్రకు చెందిన శిక్షణ కానిస్టేబుల్స్ సామూహికంగా వెళ్లి ప్రిన్సిపాల్ ఇంటి ముందు సుమారు వంద మంది ఆందోళనకు దిగారు. తెలంగాణకు చెంది న ఇన్విజిలేటరు కక్షసాధింపు ధోరణితోనే సీమాంధ్ర కానిస్టేబుల్స్ జవాబు పత్రాలను పక్కన పెట్టారని నిరసన చేశారు. సుమారు గంటపాటు ఆందోళన తరువా త అదనపు ఎస్పీ మోహనరావు రంగంలోకి దిగి ఆం దోళన సద్దుమణిగేలా చేశారు. విజయనగరం డీఎస్పీ శ్రీనివాసరావు, ఇతర పోలీసు అధికారులు వచ్చి ఆందోళనకు దారితీసిన పరిస్థితులపై సమీక్షించారు.