ట్రైనీ కానిస్టేబుల్స్ ఆందోళన
Published Tue, Feb 18 2014 3:00 AM | Last Updated on Sat, Sep 2 2017 3:48 AM
విజయనగరం క్రైం, న్యూస్‌లైన్: జిల్లాలోని పోలీసు శిక్ష ణ కేంద్రంలో సోమవారం అర్ధరాత్రి ఏఆర్ కానిస్టేబు ళ్లు ఆందోళనకు దిగారు. పరీక్షా కేంద్రంలో తెలంగాణ పోలీసు అధికారుల పక్షపాత ధోరణి వ్యవహారంపై సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కానిస్టేబుళ్లు నిరసనకు దిగారు. శిక్షణ కేంద్రాల్లో ఆర్డ్ రిజర్వ్‌డు(ఏఆర్) కానిస్టేబుల్ నుంచి సివిల్ కానిస్టేబుల్‌కు కన్వర్షన్ కోసం పరీ క్షలు జరిగాయి. వివిధ జిల్లాలకు చెందిన కానిస్టేబుల్స్ మూడునెలలుగా ఇక్కడ శిక్షణ పొందుతున్నారు. పీటీసీలో మొత్తం 548 మంది ఏఆర్ నుంచి సివిల్‌గా శిక్షణ పొందారు. వీరిలో 94 మంది కానిస్టేబుళ్లకు సోమవా రం పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు ఇన్విజిలేటర్స్‌గా వరంగల్ జిల్లా పోలీసు అధికారులు వ్యవహరించారు.
అభ్యర్థుల్లో ఇద్దరు సీమాంధ్రకు చెందిన కానిస్టేబుల్స్ జవాబు పత్రాలను పక్కన పెట్టి వారిని అనర్హులుగా ప్రకటించినట్లు తెలిసింది. ఈ విషయాన్ని తెలుసుకు న్న సీమాంధ్రకు చెందిన శిక్షణ కానిస్టేబుల్స్ సామూహికంగా వెళ్లి ప్రిన్సిపాల్ ఇంటి ముందు సుమారు వంద మంది ఆందోళనకు దిగారు. తెలంగాణకు చెంది న ఇన్విజిలేటరు కక్షసాధింపు ధోరణితోనే సీమాంధ్ర కానిస్టేబుల్స్ జవాబు పత్రాలను పక్కన పెట్టారని నిరసన చేశారు. సుమారు గంటపాటు ఆందోళన తరువా త అదనపు ఎస్పీ మోహనరావు రంగంలోకి దిగి ఆం దోళన సద్దుమణిగేలా చేశారు. విజయనగరం డీఎస్పీ శ్రీనివాసరావు, ఇతర పోలీసు అధికారులు వచ్చి ఆందోళనకు దారితీసిన పరిస్థితులపై సమీక్షించారు.
Advertisement