విజయనగరం అర్బన్ : క్లస్టర్ సూళ్ల ప్రయోగం సర్కార్ విద్యకు కొత్త కష్టాలు తెచ్చిపెట్టేదిలా ఉంది. పాఠశాలల కుదింపే లక్ష్యంగా ప్రభుత్వం ఈ మార్గాన్ని ఎంచుకుందని విద్యావంతులు, ఉపాధ్యాయ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ప్రజలకు విద్యనందించే భారాన్ని తగ్గిం చుకొనే విధంగా సర్కార్ ఈ ఎత్తుగడ వేసినట్టు సమాచారం. కొత్త రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఉపాధ్యాయుల కొరత తీర్చడం నుంచి, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం వరకూ ఏ ఒక్క సమస్యను పరిష్కరించిన దాఖలాలు లేవు. చివరకు కేంద్రప్రభుత్వ నిధులను ఇచ్చే అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లను భర్తీచేయడానికి కూడా ముందుకు రావడం లేదు. ఎలాగూ పాఠశాల సంఖ్యను తగ్గిస్తాం... కాబట్టి టీచర్ల కొరతను తీర్చక్కర్లేదు అన్నట్టుగా డీఎస్సీ-14 నోటిఫికేషన్ కూడా నీరుకార్చే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా చేపట్టిన క్లస్టర్ స్కూళ్ల ఏర్పాటు కూడా ఇందులో భాగమే. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు సంపూర్ణంగా కల్పిం చాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేస్తున్న క్లస్టర్ స్కూళ్ల వెనుక పెద్ద కుట్రే ఉందని ఉపాధ్యాయ సంఘాల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందించడంలో భాగంగా ఒక్కో మండలంలో 10 నుంచి 15 క్టస్టర్ స్కూళ్లు ఏర్పాటుచేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. పాఠశాలల పునఃప్రారంభానికి ముందు క్లస్టర్ స్కూళ్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. క్లస్టర్ పాఠశాలకు నిర్ధేశించిన మౌలిక సదుపాయాలున్న పాఠశాలలకు గుర్తించి జాబితాలను సిద్ధం చేయాలని పాఠశాల విద్య కమిషనర్ ఉషారాణి నుంచి జిల్లా విద్యాశాఖకు ఆదేశాలొచ్చాయి. గుర్తించిన పాఠశాలల జాబితాను ఎంఈఓలు నవంబర్ ఒకటవ తేదీలోపు జల్లా కేంద్రాలకు అందజేయాలని ఆదేశించారు. ఈ మేరకు గుర్తించే ప్రక్రియలో ఎంఈఓలు ఉన్నారు. తొలుత ఎలాంటి నిధులు వినియోగించకుండా సమీప పాఠశాల విద్యార్థులను కలిపేసి సంబంధిత పాఠశాలల్లో క్లస్టర్ పాఠశాలను నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. తాజాగా అందిన సమాచారం మేరకు జిల్లాలోని పలు మండలాల్లో క్లస్టర్ స్కూళ్లకు అనుకూలంగా ఐదుకు మించి పాఠశాలలు లేవని తెలుస్తోంది. జిల్లాలో మొత్తం 2,927 పాఠశాలలున్నాయి.
వీటిలో ప్రాథమిక పాఠశాలలు 2,320, మిగిలినవి ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలున్నాయి. మండలానికి సరాసరిన 68 ప్రాథమిక, 20 ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలు ఉన్నాయి. మండలాలనికి కేవలం 15లోపు మాత్రమే క్లస్టర్ స్కూళ్లుంటాయని నిర్ధేశిస్తున్న నేపధ్యంలో మిగిలిన స్కూళ్లను ఏం చేస్తారని ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. ఇదే జరిగితే జిల్లాలో సుమారు సగానికిపైగా ప్రాథమిక పాఠశాలలు మూతపడతాయి. దీనికి గ్రామస్తులు అంగీకరిస్తారా? అనే విషయంపైనే ప్రస్తుతం చర్చనడుస్తోంది. మిగిలిన స్కూళ్లలో పనిచేసే ఉపాధ్యాయుల పరిస్థితి ఏంటి? ఇప్పటికే పాఠశాలల్లో ఉన్న భవనాల సంగతి ఏంటనే విషయాలపై స్పష్టత ఇవ్వలేదు. ఇప్పటికే వెనుకబడిన ప్రాంతాల్లో నిర్వహిస్తున్న మోడల్ స్కూళ్లకు అన్ని సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. తాజాగా ఏర్పాటు చేయనున్న క్లస్టర్ స్కూళ్ల కూడా అదే గతి పడుతుందని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి.
క్లస్టర్ స్కూల్ ఎంపిక తీరు
ప్రస్తుతానికి ప్రాథమిక పాఠశాలల వరకు క్లస్టర్ స్కూళ్లు ఏర్పాటు చేసేందుకు వివరాలను తీసుకుంటున్నారు. మండలానికి 10 నుంచి 15 వరకు పెట్టుకోవచ్చు. స్మార్ట్, గ్రీన్ స్కూళ్లగా వీటిని తీర్చిదిద్దుతారు. ఎంపిక చేసే వాటిలో పక్కా భవనం, ఫర్నిచర్, ప్రహరీ, కంప్యూటర్లు ఉండాలి. గ్రామాల నుంచి విద్యార్థులు వచ్చేందుకు పూర్తిస్థాయిలో రవాణా సౌకర్యం ఉండాలి. ప్రధానోపాధ్యాయుడు, ప్రతి తరగతికి ఒక టీచర్ ఉండాలి. అలాగే విద్యార్థుల నమో దు అధికంగా ఉండటం తప్పనిసరి. ఎక్కువ ఉండే గ్రామాలకు క్లస్టర్ స్కూల్ సెంటర్ పాయింట్‌గా ఉండాలి. ఒక్కో క్లస్టర్ స్కూల్‌కు కనీసం 5 నుంచి 6 పాఠశాలలు అటాచ్ అవ్వాలి. అవసరమైతే అదనంగా తరగతి గదులు, హాస్టల్ భవనాలు క ట్టుకునేందుకు అవకాశం ఉండాలి. జిల్లా విద్యాశాఖాధికారి, సర్వశిక్షా అభియాన్ పీఓల సహకారంతో ఎంఈఓలు మ్యాపింగ్ చేయాలి.
డీఎస్సీ లేనట్టే...?
క్లస్టర్ స్కూళ్ల ఏర్పాటయితే దాదాపు సగం పాఠశాలలను మూసే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ పోస్టులు పూర్తిగా తగ్గిపోతాయి. దీంతో డీఎస్సీ తీయడానికి పోస్టులు ఖాళీగా ఉండవు.
సర్కార్ స్కూళ్లపై ‘క్లస్టర్’ కుట్ర!
Published Sat, Nov 1 2014 1:08 AM | Last Updated on Sat, Sep 2 2017 3:39 PM
Advertisement
Advertisement