పదో తరగతి విద్యార్థులకు వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు | YS Jagan Best Wishes To 10th Students In AP, Check Tweet Inside | Sakshi
Sakshi News home page

పదో తరగతి విద్యార్థులకు వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు

Published Mon, Mar 17 2025 8:33 AM | Last Updated on Mon, Mar 17 2025 9:44 AM

YS Jagan Best Wishes To 10th Students In AP

సాక్షి, తాడేపల్లి: ఏపీలో నేటి నుంచి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ శుభాకాంక్ష తెలిపారు. మంచి ఫలితాలు సాధించాలని కోరుకున్నారు.

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ట్విట్టర్‌ వేదికగా..‘పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు శుభాకాంక్షలు. ప్రశాంతంగా పరీక్షలపై దృష్టి సారించండి. మంచి ఫలితాలు సాధించాలి’ అని కోరుకుంటున్నట్టు తెలిపారు.

ఇక.. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పదో తరగతి పరీక్షలు జరుగనున్నాయి. చివరి పరీక్షను రంజాన్‌ సెలవు ఆధారంగా ఈ నెల 31 లేదా ఏప్రిల్‌ ఒకటో తేదీన నిర్వహిస్తారు. 2024–25 విద్యా సంవత్సరానికిగాను రాష్ట్రవ్యాప్తంగా 6,49,884 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో 6,19,275 మంది రెగ్యులర్, 30,609 మంది ప్రైవేటు విద్యార్థులు ఉన్నారు.

రెగ్యులర్‌ విద్యార్థుల్లో ఇంగ్లిష్‌ మీడియంలో 5,64,064 మంది, తెలుగు మీడియంలో 51,069 మంది, ఉర్దూలో 2,471 మంది, హిందీలో 16 మంది, కన్నడలో 623 మంది, తమిళంలో 194 మంది, ఒడియాలో 838 మంది పరీక్షలు రాసేందుకు ఎన్‌రోల్‌ చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3,450 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు. వాటిలో 163 సమస్యాత్మక సెంటర్లుగా గుర్తించి సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement