టెన్త్‌ పరీక్షలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం | Andhra Pradesh SSC Exams 2020 To Be Conducted In July 10 To 15 | Sakshi
Sakshi News home page

జూలై 10 నుంచి 15 వరకు టెన్త్ పరీక్షలు

Published Thu, May 14 2020 5:39 PM | Last Updated on Thu, May 14 2020 6:13 PM

Andhra Pradesh SSC Exams 2020 To Be Conducted In July 10 To 15 - Sakshi

సాక్షి, అమరావతి: పదో తరగతి పరీక్షలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్‌ నేపథ్యంలో 11 పేపర్లను 6 పేపర్లుగా కుదించింది. భౌతిక దూరం పాటిస్తూ జూలై 10వ తేదీ నుంచి 15 వరకూ పరీక్షలు నిర్వహించనుంది. ప్రతి పేపర్‌కు 100 ​మార్కులు ఉంటాయి.  తెలుగు, ఇంగ్లీష్, హిందీ, గణితం, సైన్స్, సోషల్ సబ్జెక్టులకు సంబంధించి ఒక్కో పేపర్ మాత్రమే ఉంటుంది. విద్యార్థుల ఆరోగ్య రక్షణకు అన్నివిధాలా కట్టుదిట్టమైన చర్యలను తీసుకోబోతున్నట్టు వెల్లడించింది. పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు కానీ, తల్లిదండ్రులు కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పింది. 

కాగా,లాక్‌డౌన్‌ కారణంగా మార్చి 31 నుంచి జరగాల్సిన పదో తరగతి పరీక్షలను వాయిదా పడిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు విద్యార్థులందరినీ ప్రమోట్ చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ఇదివరకే ఉత్తర్వులు జారీ చేసింది.

►జూలై 10న ఫస్ట్ లాంగ్వేజ్ (9.30am- 12.45pm)

►జూలై11న సెకండ్ లాంగ్వేజ్ (9.30am- 12.45pm)

►జూలై 12న ఇంగ్లీషు (9.30am- 12.45pm)

►జూలై 13న మ్యాథ్స్ ‌(9.30am- 12.45pm)

►జూలై14న జనరల్ సైన్స్ (9.30am- 12.45pm)

►జూలై 15న సోషల్ స్టడీస్‌ (9.30am- 12.45pm)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement