సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు రద్దు నిర్ణయం సరైనదని జనసేన పార్టీ పేర్కొంది. రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో విద్యార్థుల జీవితాలను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం అభినందనీయమని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్ శనివారం ప్రకటించారు.
దీనిపై స్పందించిన పవన్.. ‘ప్రభుత్వం సముచిత నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మనస్పూర్తిగా అభినందిస్తున్నాను’ అని పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ అడ్వాన్స్, సప్లిమెంటరీ రద్దు చేసి ఉత్తీర్ణత ప్రకటించడం సరైన నిర్ణయమని పవన్ కల్యాణ్ కొనియాడారు. (కరోనా: ఏపీలో 8 వేలు దాటిన కేసులు)
పదో తరగతి పరీక్షల రద్దు సముచిత నిర్ణయం.
— JanaSena Party (@JanaSenaParty) June 20, 2020
- JanaSena Chief Sri @PawanKalyan pic.twitter.com/POGimecY5n
Comments
Please login to add a commentAdd a comment