
సాక్షి, కడప: వైఎస్‌ఆర్ కడప జిల్లాలో పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్ అయింది. జిల్లాలోని బద్వేల్‌లో శనివారం జరుగుతున్న టెన్త్ క్లాస్ హిందీ పరీక్ష ప్రశ్నాపత్రం వాట్సాప్‌లో హల్ చల్ చేయడం కలకలం రేపుతోంది. పరీక్ష ప్రారంభమైన అరగంటకే క్వశ్చన్ పేపర్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. దీంతో జిల్లాలో ఒక్కసారిగా అలజడి రేగింది.
ప్రశ్నాపత్రం లీక్‌పై పలువురు విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. కష్టపడి చదివి పరీక్షలు రాస్తుంటే.. కొంతమంది అక్రమార్కులు పేపర్ లీక్ చేసి తమ జీవితాలతో ఆడుకుంటున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నాపత్రం లీకేజీ విషయంపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని వారు కోరుతున్నారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.