hindi paper
-
హిందీ‘టెన్’షన్
సాక్షిప్రతినిధి, వరంగల్: టెన్త్ హిందీ ప్రశ్నపత్రం కూడా అవుటైంది. టెన్త్ పరీక్షలు ప్రారంభమైన తొలిరోజే తాండూరులో తెలుగు ప్రశ్నపత్రం లీకవడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే కాగా.. ఈ వ్యవహారం సద్దుమణగక ముందే, రెండోరోజే హిందీ పేపర్ కూడా బయటకు రావడం తీవ్ర కలకలం సృష్టించింది. అధికారులు, విద్యార్థులు, తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేసింది. మంగళవారం పరీక్ష ప్రారంభమైన కొన్ని నిమిషాలకే వాట్సాప్ గ్రూపులలో హిందీ ప్రశ్నపత్రం చక్కర్లు కొట్టడం ప్రారంభమయ్యింది. ఈ మేరకు అందిన సమాచారంతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెంటనే ఉమ్మడి వరంగల్ కలెక్టర్లు, పోలీసు కమిషనర్, ఎస్పీలు, డీఈవోలతో మాట్లాడారు. సమగ్ర విచారణకు ఆదేశించారు. దీంతో వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ పర్యవేక్షణలో పోలీసులు సోషల్ మీడియాలో వైరలైన పోస్టింగ్‌ల ఆధారంగా దర్యాప్తు జరిపారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నుంచి హిందీ క్వశ్చన్ పేపర్ బయటకు వచ్చినట్లు తేల్చారు. ఓ మైనర్ బాలుడితో పాటు నలుగురిపై కేసు నమోదు చేసి ముగ్గురుని అరెస్టు చేశారు. మంగళవారం రాత్రి పోలీసు కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ ఏవీ రంగనాథ్ వివరాలను వెల్లడించారు. కమలాపూర్ మండలానికి చెందిన ఓ బాలుడు (16) తన స్నేహితుడికి చిట్టీలు అందించడం కోసం ఈ పని చేశాడని, దీన్ని సోషల్ మీడియాలో వైరల్ చేసి పరీక్ష రాసే విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేసేలా ç‘పేపర్ లీక్’ అంటూ ప్రచారం చేశారని చెప్పారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. గోడెక్కి ఫొటో తీసి.. కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి పరీక్ష రాస్తున్న తన మిత్రుడికి సహాయం చేసేందుకు కమలాపూర్ ప్రభుత్వ బాలుర పాఠశాల పరీక్ష కేంద్రంలోని చెట్టు సహాయంతో గోడెక్కాడు. మొదటి అంతస్తులోని మూడవ సంబర్ గది కిటికి పక్కనే పరీక్ష రాస్తున్న విద్యార్థి నుంచి క్వశ్చన్ పేపర్ తీసుకుని తన సెల్ఫోన్లో 9.45కు ఫొటో తీశాడు. 9.46కు మౌటం శివ గణేష్‌కు వాట్సాప్‌లో పంపాడు. మౌటం శివ గణేష్ ఉదయం 9.59 గంటలకు తన సెల్‌ఫోన్ ద్వారా 31 మంది సభ్యులున్న ఎస్సెస్సీ 2019–20 అనే వాట్సాప్ గ్రూపులో ఫార్వర్డు చేశాడు. ఆ గ్రూపులో ఉన్న గుండెబోయిన మహేశ్ అనే మాజీ రిపోర్టర్ (పస్తుతం కేఎంసీలో ల్యాబ్ అసిస్టెంట్) దూడం ప్రశాంత్ (మాజీ జర్నలిస్టు)కు పంపించాడు. అతను ‘బ్రేకింగ్ న్యూస్.. రెండోరోజు పదో తరగతి పేపర్ లీక్..’ అంటూ 10.46 కల్లా హిందీ ప్రశ్నపత్రం ఓ జర్నలిస్టుల గ్రూపుతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి, మరో 110 మందికి పోస్టు చేశాడు. చివరికిది సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యింది. ఎక్కడినుంచి పేపర్ లీకయ్యిందో స్పష్టత లేకపోవడంతో ప్రత్యేక దర్యాప్తు బృందం రంగంలోకి దిగింది. సైబర్‌క్రైం పోలీసులు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయమై ఆరా తీశారు. తీగలాగితే డొంక కదిలినట్లు ఒకరి తర్వాత మరొకరికి పోస్టయిన విషయం వెలుగులోకి వచ్చింది. అందరికీ నోటీసులు ఇస్తాం: సీపీ బాలుడితో పాటు ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నామని, మైనర్‌ను జువైనల్ హోంకు, శివ గణేష్, ప్రశాంత్‌ను రిమాండ్‌కు పంపినట్లు సీపీ రంగనాథ్ తెలిపారు. మహేశ్ పరారీలో ఉన్నాడని, సోషల్ మీడియాలో వైరల్ చేసిన వారందరికీ నోటీసులు ఇచ్చి విచారిస్తామని తెలిపారు. ఎప్పుడైనా పరీక్షకు ముందే పేపర్ బయటకు వస్తే దాన్ని లీక్ అంటామని.. పరీక్ష కేంద్రంలో క్వశ్చన్ పేపర్ ఇచ్చాక బయటకు వస్తే కాపీయింగ్ అంటామని కమిషనర్ వివరణ ఇచ్చారు. ఇలావుండగా పేపర్ అవుట్ కలకలం సృష్టించడంతో స్నేహితుడి కోసం బాలుడు చేసిన ప్రయత్నం ఫలించలేదు. -
సంస్కృతం బదులు.. హిందీ ప్రశ్నపత్రం
స్టేషన్‌ఘన్‌పూర్: ఇంటర్ సెకండియర్ పరీక్షల్లో సిబ్బంది సంస్కృతం బదులు.. హిందీ ప్రశ్నపత్రం ఇచ్చిన ఘటన జనగామ జిల్లా నమిలిగొండ శివా రు మోడల్ స్కూల్లో చోటుచేసుకుంది. మహబూబాబాద్‌కు చెందిన హర్షి త శనివారం సంస్కృతం పేపర్ రాసేందుకు నమిలిగొండ శివారు మోడల్ స్కూల్లోని పరీక్ష కేంద్రానికి హాజరైంది. ఆమెకు ఇన్విజిలేటర్ సంస్కృతం పేపర్‌కు బదులు హిందీ ప్రశ్నపత్రం ఇచ్చారు. అది తన సబ్జెక్ట్ కాదని తెలిసినా.. ఏం చేయాలో తోచక సదరు విద్యార్థిని పరీక్ష ముగిసే వరకు కూర్చుండిపోయింది. బయటకు వచ్చాక తండ్రికి విషయం చెప్పగా.. ఆయన సిబ్బందికి, సెంటర్ ఇన్చార్జి శ్రీకాంత్ డీఐవో శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో బోర్డు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
వాట్సాప్‌లో ‘పది’ ప్రశ్నాపత్రం.. అలజడి
సాక్షి, కడప: వైఎస్ఆర్ కడప జిల్లాలో పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్ అయింది. జిల్లాలోని బద్వేల్లో శనివారం జరుగుతున్న టెన్త్ క్లాస్ హిందీ పరీక్ష ప్రశ్నాపత్రం వాట్సాప్‌లో హల్ చల్ చేయడం కలకలం రేపుతోంది. పరీక్ష ప్రారంభమైన అరగంటకే క్వశ్చన్ పేపర్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. దీంతో జిల్లాలో ఒక్కసారిగా అలజడి రేగింది. ప్రశ్నాపత్రం లీక్‌పై పలువురు విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. కష్టపడి చదివి పరీక్షలు రాస్తుంటే.. కొంతమంది అక్రమార్కులు పేపర్ లీక్ చేసి తమ జీవితాలతో ఆడుకుంటున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నాపత్రం లీకేజీ విషయంపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని వారు కోరుతున్నారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. -
తప్పులు.. తిప్పలు
– డిగ్రీ రెండో సెమిస్టర్ హిందీ ప్రశ్నాపత్రంలో సిలబస్‌లో లేని ప్రశ్నలు – పరీక్షను వాయిదా వేసిన పరీక్షల విభాగం అధికారులు ఎస్కేయూ : డిగ్రీ పరీక్షల విభాగం అస్తవ్యస్తంగా తయారైంది. అధికారుల నిర్లక్ష్యానికి విద్యార్థుల జీవితాలు నాశనం అవుతున్నాయి. ప్రశ్న పత్రాల్లో తరచూ తప్పులు వస్తుండటంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. హిందీ పరీక్ష వాయిదా : డిగ్రీ రెండో సెమిస్టర్ పరీక్ష మంగళవారం ప్రారంభమైంది. పోయిట్రీ మూడో సెమిస్టర్‌లోనూ, ప్రోసన్ రెండో సెమిస్టర్లో సిలబస్‌ను ఖరారు చేశారు. అయితే రెండూ కలిపిన సిలబస్‌తో కూడిన ప్రశ్నపత్రాన్ని తాజాగా మంగళవారం జరిగిన పరీక్షలో విద్యార్థులకు అందజేయడంతో గందరగోళం నెలకొంది. పాఠ్యాంశాలకు విరుద్ధంగా ప్రశ్నలు రావడంతో విద్యార్థులకు దిక్కుతోచలేదు. ఈ నేపథ్యంలో పరీక్ష కేంద్రాల పరిశీలకులకు ఫిర్యాదు చేశారు. ఈ అంశాన్ని వర్సిటీ పరీక్షల విభాగం అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరీక్షను వాయిదా వేసినట్లు ప్రకటించారు. వాయిదా వేసిన పరీక్షను మే 6న నిర్వహిస్తున్నట్లు అధికారులు చెప్పారు. గతంలోనూ ఇదే తంతు ఇయర్లీ ఎగ్జామ్స్ (సాంవత్సరిక పరీక్షలు)ల్లోనూ ఇవే తప్పిదాలు చోటు చేసుకున్నాయి. ఈ నెల 10న జరిగిన డిగ్రీ ఫైనలియర్ స్టాటిస్టిక్స్ ప్రశ్నప్రతంలో పూర్తీగా గణితం సిలబస్‌ను ఇచ్చారు. ఈ నెల 12న జరిగిన పేపర్–4 ప్రశ్నాపత్రం బదులు, మూడో పేపర్‌ను ఇచ్చారు. దీంతో విద్యార్థులు ఆందోళన కూడా నిర్వహించారు. సెమిస్టర్ పరీక్షల్లో అయినా .. ఈ తప్పిదాలకు చోటు చేసుకోకుండా సజావుగా జరుగుతాయని భావించిన నేపథ్యంలో మళ్లీ తప్పులు పునరావృతం అయ్యాయి. సెమిస్టర్ పరీక్ష ప్రారంభంలోనే ఇంగ్లీష్ ప్రశ్నపత్రంలో (ఈ నెల 15న జరిగిన పరీక్ష) 15 మార్కులు సిలబస్‌లో లేని ప్రశ్నలు వచ్చాయి. దీంతో విద్యార్థులు పూర్తీగా నష్టపోతున్నారు. కాలం చెల్లిన విధానాలు ప్రశ్నాపత్రం రూపకల్పనలో కాలం చెల్లిన విధానాలు అనుసరిస్తుండడంతో తప్పిదాలకు ఆస్కారం ఏర్పడుతోందని పరిశీలకులు భావిస్తున్నారు. ప్రశ్నాప్రతం రూపకల్పన అనంతరం సంబంధిత సబ్జెక్టు బోర్డ్ ఆఫ్ స్టడీస్ , పరీక్షల డీన్ సమక్షంలో పరిశీలన జరగాలి. అనంతరం ప్రశ్నాపత్రం ప్రింటింగ్ ప్రెస్‌కు పంపాలి. ఇలాంటి సాంప్రదాయం కొన్ని వర్సిటీలలో విజయవంతంగా అమలు చేస్తున్నారు. కానీ అధ్యాపకుడు రూపొందించిన ప్రశ్నాపత్రాన్ని నేరుగా ప్రెస్‌కు పంపుతుండటంతో ప్రశ్నాపత్రాల్లో తప్పులు వస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పశ్నాపత్రం తయారు చేసిన వారిదే తప్పు సెమిస్టర్ పరీక్షలో సాంవత్సరిక సిలబస్‌తో కూడిన ప్రశ్నాపత్రం రూపకల్పన చేశారు. ఇది పూర్తీగా ప్రశ్నాపత్రం తయారు చేసిన వారి తప్పిదమే. అందుకే పరీక్షను వాయిదా వేశాము. తిరిగి 6న హిందీ పరీక్ష నిర్వహిస్తాం. – ఆచార్య రెడ్డివెంకటరాజు, డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్