land pooling scam
-
మాజీ మంత్రి నారాయణపై మరో కేసు
సాక్షి, అమరావతి: మాజీ మంత్రి నారాయణపై మరో కేసు నమోదైంది. అమరావతి ల్యాండ్ పూలింగ్ కేసులో అవినీతి అంశానికి సంబంధించి ఏపీ సీఐడీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 2014-19 మధ్య భూసేకరణలో అవకతవకలు జరిగాయంటూ కేసు నమోదు అయ్యింది. దీనిపై సోమవారం(మే9వ తేదీన) ఏపీ సీఐడీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎమ్మెల్యే ఆర్కే ఫిర్యాదుతో మంగళగిరి పీఎస్‌లో కేసు నమోదు చేయగా, దీనిపై ఏపీ సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. మాస్టర్ ప్లాన్‌లో ఇన్నర్ రింగ్ రోడ్డు డిజైన్ మార్చారనే ఫిర్యాదుపై చంద్రబాబు, నారాయణ, లింగమనేని రమేష్‌లపై కేసు నమోదు చేశారు. చదవండి👉 ప్రూవర్‌గా మారిన వైస్ ప్రిన్సిపల్ గిరిధర్.. నారాయణ ప్రోద్బలంతోనే.. చదవండి👉🏻‘లీక్ చేసేది వీళ్లే.. గందరగోళం చేసేది వీళ్లే’ -
పూలింగ్.. ప్రపంచంలోనే పెద్ద స్కామ్
సాక్షి, అమరావతి: అమరావతి ల్యాండ్ పూలింగ్ వ్యవహారం ప్రపంచంలోనే అతి పెద్ద కుంభకోణమని ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డ టీడీపీ సర్కారు పేదల భూములను బలవంతంగా లాక్కుందన్నారు. అసైన్డ్ భూములను బెదిరించి తీసుకుందని, చంద్రబాబు ఆయన బినామీలకే పెద్ద ఎత్తున మేలు చేకూరిందని ధ్వజమెత్తారు. సీఐడీ విచారణలో ఈ వాస్తవాలు వెలుగులోకి వస్తాయనే భయంతోనే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఒకరిద్దరిని ప్రలోభపెట్టి కేసే లేదని చెప్పడం పేదలకు అన్యాయం చేయడం కాదా? అని ప్రశి్నంచారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో సజ్జల శుక్రవారం మీడియాతో మాట్లాడారు. అమరావతిపై బాబు కపట ప్రేమ పేదల భూములు లాక్కున్నాక ల్యాండ్‌పూలింగ్‌లో మార్పులు చేస్తూ టీడీపీ సర్కారు జీవో 41 ఇచ్చింది. ఈ కేసులో ఏ1గా చంద్రబాబు, ఏ2గా మాజీ మంత్రి నారాయణ నిందితులు. చంద్రబాబుకు అమరావతిపై ఏమాత్రం ప్రేమ లేదని వైఎస్సార్సీపీ మొదట్నుంచీ చెబుతూనే ఉంది. అదే ఉంటే విజయవాడ, గుంటూరు మధ్యే రాజధాని పెట్టేవారు. వేల ఎకరాలు దోచుకోవడం, భారీగా కూడబెట్టుకోవడమే చంద్రబాబు దురాలోచన. లాండ్‌పూలింగ్‌లో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగింది. దీనిపై విచారణ చేస్తామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చెప్పాం. ఇంతకన్నా ఇంకేం ఆధారాలు కావాలి? ఎవరినో బెదిరించి, బలవంతంగా సంతకాలు చేయించి సీఐడీ కేసు దాఖలు చేసిందని టీడీపీ నేతలు ఆరోపణలు చేయడం దారుణం. ఒకరిద్దరిని ప్రలోభపెట్టి స్ట్రింగ్ ఆపరేషన్ అని చెప్పుకోవడం దుర్మార్గం. ఇలాంటి చీప్ ట్రిక్స్‌తో అవినీతి బయటకు రాకుండా అడ్డుకోగలరా? పేదలకు చెందిన అసైన్డ్ భూములన్నీ చంద్రబాబు, తన బినామీదారులు రాయించుకున్న తర్వాత ల్యాండ్ పూలింగ్ నిబంధనలు మార్చారు. సీఆర్డీఏకు చంద్రబాబే చైర్మన్. ఆయన ఉద్దేశం మంచిదైతే ఆరు నెలల వ్యవధిలోనే ల్యాండ్ పూలింగ్ నిబంధనలు మార్చాల్సిన అవసరం ఏమిటి? సీఐడీ విచారణలో 800 ఎకరాల వరకూ అసైన్డ్ భూములను చంద్రబాబు బినామీలు లాక్కుని ప్రభుత్వం నుంచి లబ్ధి పొందినట్లు తేలింది. అవినీతి జరిగిందనడానికి ఇంతకన్నా ఆధారాలు ఏం కావాలి? ఇది కుంభకోణం అని చెప్పడానికి ఏ న్యాయవాద డిగ్రీలు కావాలి? వారే వచ్చి చెప్పాలా? కుంభకోణం జరిగిందని చెప్పడానికి ఫిర్యాదుదారుడు అవసరమా? మోసం జరిగిందని మోసానికి గురైన వారే వచ్చి చెప్పాలా? మరి ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు (పిల్) ఎలా సాగుతున్నాయి? పేద రైతులను మోసగించిన మాట వాస్తవమే కదా? అందుకు ఎప్పటికైనా దోషిగా నిలబడక తప్పదు కదా? కొంతమంది గత సర్కారు జారీ చేసిన జీవో 41తో ఈ ప్రభుత్వం జారీ చేసిన జీవో 72ని పోలుస్తున్నారు. ఇది పేదలకు ఇంటి స్థలాలిచ్చి పక్కా ఇళ్లు కట్టించడం కోసం జారీ చేసిన జీవో. విశాఖలోనే దాదాపు 1.50 లక్షల మంది నిరుపేద కుటుంబాలకు ఇళ్ల స్థలాలిచ్చి ఇళ్లు కట్టించడం కోసం జీవో నెం.72 జారీ అయింది. బడ్జెట్‌కు సంబంధించి ఆర్డినెన్స్ జారీకి కారణాలను స్పష్టంగా చెప్పినా యనమల వక్రీకరించడం దారుణం. -
అమరావతి : రాజధాని ‘చిత్రాల్లో’ ఇదో ‘సిత్రం’..!
సాక్షి, అమరావతిబ్యూరో : రికార్డులు చూడలేదు.. సర్వే చేయలేదు.. భూమికి సంబంధించిన పత్రాలున్నాయో లేదో అసలే పట్టించుకోలేదు.. అయినా రాజధాని ప్రాంతంలో ప్లాట్లు కేటాయించేశారు. అధికార పార్టీ నేతల కనుసన్నల్లో రాజధానిలో మరో భూ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. సాధారణ రైతులకు ప్లాట్లు కేటాయించేటప్పుడు సవాలక్ష నిబంధనలను పాటించే అధికారులు.. అధికార పార్టీ నాయకుల బినామీలకు మాత్రం ఆగమేఘాల మీద.. పత్రాలు ఏవీ పరిశీలించకుండానే ప్లాట్లు కేటాయించారు. అంతేకాకుండా నాలుగేళ్లుగా కౌలు చెక్కులు కూడా చెల్లిస్తున్నారు. 9.14 అగ్రిమెంట్ చేసుకోకుండానే ప్లాట్లు గుంటూరు జిల్లా రాజధాని గ్రామమైన మందడానికి చెందిన బేతపూడి సురేష్‌బాబు అనే వ్యక్తి ల్యాండ్ పూలింగ్‌లో భాగంగా మంగళగిరి మండలం కురగల్లు గ్రామంలో తనకు భూమి లేకపోయినా ఉందని పేర్కొంటూ, ఎకరం భూమిని సీఆర్డీఏకు ఇస్తున్నట్లు అంగీకార పత్రం అందజేశారు. భూములు తీసుకునే సమయంలో రైతుల నుంచి సీఆర్డీఏ అధికారులు తప్పనిసరిగా 9.14 కింద అగ్రిమెంట్ చేసుకుంటారు. రైతుకు సంబంధించిన భూ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, సర్వే చేసిన అనంతరం అవి నిజమని నిర్ధారించుకున్న తర్వాత 9.18ఏ కింద ప్లాట్లను ఎంచుకోవాలని సంబంధిత రైతులకు సూచించిన అనంతరం సదరు రైతుకు పరిహారం కింద వచ్చే ప్లాట్లను కేటాయిస్తారు. ఇక్కడ సురేష్ బాబుతో 9.14 అగ్రిమెంట్ చేయించుకోకుండానే అధికారులు అతనికి ప్లాట్లు కేటాయించారు. భూమి సర్వే చేయకుండానే అఫిడవిట్ ఆధారంగా ప్లాట్లు కేటాయించడం వెనక అధికార పార్టీ నేతల హస్తం ఉన్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. అఫిడవిట్‌ను ఆధారంగా చేసుకుని సురేష్‌బాబుకు 27–797–3779–3–బి1, 27–797–3779– 23– బి1 నంబర్లలో 250 గజాల నివాస, 24–762–3766– 39– సి2 నంబర్లో 500 గజాల విల్లా, 24–764–3777– 19– ఐ2 నంబర్లో 250 గజాల కమర్షియల్ ప్లాట్లను కేటాయించారు. నాలుగేళ్లుగా అతనికి కౌలు చెక్కులు చెల్లిస్తున్నారు. గతంలోనూ ఇలాంటి సంఘటనే... ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. మందడం గ్రామ రెవెన్యూ పరిధిలో 207/1లో ఎకరం 70 సెంట్ల భూమి కృష్ణా నదిలో కలిసిపోయింది. అయితే ఈ సర్వే నంబర్లో గుంటూరు జిల్లాకు చెందిన పఠాన్ గౌస్‌కు భూమి ఉందని సీఆర్డీఏ అధికారులు డాక్యుమెంట్లు పుట్టించారు. భూమి లేకుండానే అతనికి 1,450 గజాల ప్లాట్లు కేటాయించారు. అందులో 250 గజాల ప్లాట్‌ను కూడా నిందితుడు విక్రయించి సొమ్ము చేసుకున్నాడు. రెండో ప్లాట్‌ను విక్రయించే సమయంలో కొనుగోలుదారులకు అనుమానం వచ్చి డాక్యుమెంట్లను పరిశీలించగా పత్రాలన్నీ నకిలీవని తేలింది. ఈ ఘటనలో ప్రధాన నిందితులను ఇప్పటివరకు పోలీసులు అరెస్ట్ చేయలేదు. అధికార పార్టీ నాయకులు గౌస్‌ను ఇరికించారని అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. నేతలకు బినామీయేనా? సాధారణంగా సీఆర్డీఏ అధికారులు 9.14 అగ్రిమెంట్ చేసుకోకుండా ఎలాంటి పరిస్థితుల్లో ప్లాట్లు కేటాయించరు. అలాంటిది భూమి పత్రాలు కూడా ఇవ్వకుండా కేవలం అంగీకార పత్రంతో ప్లాట్లు కేటాయించడం వెనక అధికార పార్టీకి చెందిన బడా నాయకుల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. సురేష్‌బాబుకు కేటాయించిన 1,250 గజాల స్థలం విలువ దాదాపు రూ. మూడు కోట్లు పలుకుతోంది. అధికార పార్టీ నేతలు సీఆర్డీఏ అధికారులతో కుమ్మక్కై బినామీ పేర్లతో ప్లాట్లను కేటాయించుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భూమి ఇచ్చిన రైతుల వివరాలను సర్వే నంబర్లతో సహా సీఆర్డీఏ అధికారులు వెబ్సైట్లో ఉంచుతారు. సీఆర్డీఏ వెబ్సెట్లో బేతపూడి సురేష్‌బాబు.. ప్రభుత్వానికి భూమి ఇచ్చినట్లు ఎక్కడా చూపించడం లేదు. -
కబ్జా రైతులకు పరిహారం లేదు
యాచారం: ఫార్మాసిటీకి భూసేకరణలో అసైన్డు భూములున్న రైతులకు సంతృప్తికర పరిహారం అందజేస్తామని, కబ్జా రైతులకు పరిహారం ఇచ్చేదిలేదని జాయింట్ కలెక్టర్ సుందర్ అబ్నార్ పేర్కొన్నారు. ఫార్మా భూసేకరణలో ఆక్రమణ దారులకు పరిహారం అందిందనే ఫిర్యాదుల నేపథ్యంలో శుక్రవారం యాచారం తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులను తనిఖీ చేశారు. పలువురి రైతులను పిలిచి పరిహారం ఎన్ని ఎకరాలకు వచ్చింది.. అసైన్డు రైతులా.. కబ్జా రైతులా తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఉదయం 11 గంటలకు తహసీల్దార్ కార్యాలయంకు ఇబ్రహీంపట్నం ఆర్డీఓ మధుకర్‌రెడ్డితో వచ్చిన జేసీ.. తహసీల్దార్ పద్మనాభరావు, సర్వేయర్లు, రెవెన్యూ కార్యదర్శులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నక్కర్తమేడిపల్లిలోని 184, 213, 247 సర్వే నంబర్లకు సంబంధించి రైతుల పరిహారం రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఫార్మాసిటీ భూసేకరణలో అక్రమాలు జరిగితే చూస్తూ ఊరుకోబోమని అన్నారు. అక్రమంగా ఏ రైతుకు పరిహారం అందజేసినా రికవరీ చేస్తామని హెచ్చరించారు. అధికారుల హస్తం ఉందని తేలితే వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని తెలిపారు. అధికారుల చేతివాటం..! సర్వే నంబర్ 184లో 471 ఎకరాలు, 213లో 639 ఎకరాలు, 247లో 481 ఎకరాల భూమిలో పరిహారం పొందిన ప్రతి రైతు భూమిని పరిశీలించనున్నట్లు తెలిపారు. పలువురు అసైన్డు రైతులకు పట్టాదారు, పాసుపుస్తకాల్లో ఉన్న భూమి కంటే తక్కువగా రావడం, కొందరికి సాగు యోగ్యమైన భూమికే పరిహారం అందడం, కొందరి రైతులకు అసలే పరిహారం రాకపోవడం గుర్తిచారు. ఈ మూడు సర్వే నంబర్లలో వందలాది మంది పేద రైతులకు భూపంపిణీ కింద అసైన్డు సర్టిఫికెట్లు ఇచ్చిన భూమి చూపించలేదు. నకిలీ పట్టాదారులకు ప్రస్తుత ఫార్మాలో పరిహారం అసైన్డు కింద వచ్చిందా.. లేక కబ్జా కింద అందిందా అనే వివరాలను తెలుసుకున్నారు. 184, 213, 274 సర్వే నంబర్లల్లోని భూముల్లో కొంతమంది ఆక్రమణదారులకు భూములున్నట్లు సర్వే మ్యాప్ వేసి పరిహారం కోసం నివేదిక ఇచ్చిన విషయం జేసీ గుర్తించారు. సర్వేయర్లు రైతులకు పరిహారం అందజేసే విషయంలో పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. -
స్కాంలో ఎవరున్నారో క్లైమాక్స్‌లో తెలుస్తుంది
-
పూలింగ్ స్కాంలో ఎవరున్నారో క్లైమాక్స్‌లో తెలుస్తుంది
విశాఖపట్నంలో ల్యాండ్ పూలింగ్ పేరుతో పెద్ద కుంభకోణం జరిగిందని బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు విష్ణు కుమార్ రాజు అన్నారు. దీనిపై అసెంబ్లీలో చర్చించాలని ఆయన డిమాండ్ చేశారు. కుంభకోణంలో ఎవరున్నారో క్లైమాక్స్‌లో తెలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సోమవారం ఉదయం ఆయన మీడియా పాయింట్లో విలేకరులతో మాట్లాడారు. ఇక వైఎస్ఆర్సీపీ శాసనసభ్యురాలు రోజా సస్పెన్షన్‌ను మరింత కాలం పొడిగించడం సమంజసం కాదని, అలాంటి చర్యలకు తాము వ్యతిరేకమని చెప్పారు. ఇప్పటికే ఏడాది పాటు రోజాపై సస్సెన్షన్ విధించగా, దాన్ని మరింత కాలం పొడిగించాలని అధికార పక్షం యోచిస్తున్నట్లు మీడియాకు లీకులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై కూడా విష్ణుకుమార్ రాజు స్పందించారు. -
రూ.600 కోట్ల భూములు కొట్టేసిన టీడీపీ నేతలు