పూలింగ్ స్కాంలో ఎవరున్నారో క్లైమాక్స్‌లో తెలుస్తుంది | land pooling scam culprits will come out in climax, says vishnu kumar raju | Sakshi
Sakshi News home page

పూలింగ్ స్కాంలో ఎవరున్నారో క్లైమాక్స్‌లో తెలుస్తుంది

Published Mon, Mar 6 2017 10:29 AM | Last Updated on Mon, Jul 23 2018 6:55 PM

పూలింగ్ స్కాంలో ఎవరున్నారో క్లైమాక్స్‌లో తెలుస్తుంది - Sakshi

పూలింగ్ స్కాంలో ఎవరున్నారో క్లైమాక్స్‌లో తెలుస్తుంది

విశాఖపట్నంలో ల్యాండ్ పూలింగ్ పేరుతో పెద్ద కుంభకోణం జరిగిందని బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు విష్ణు కుమార్ రాజు అన్నారు. దీనిపై అసెంబ్లీలో చర్చించాలని ఆయన డిమాండ్ చేశారు. కుంభకోణంలో ఎవరున్నారో క్లైమాక్స్‌లో తెలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సోమవారం ఉదయం ఆయన మీడియా పాయింట్‌లో విలేకరులతో మాట్లాడారు.

ఇక వైఎస్ఆర్‌సీపీ శాసనసభ్యురాలు రోజా సస్పెన్షన్‌ను మరింత కాలం పొడిగించడం సమంజసం కాదని, అలాంటి చర్యలకు తాము వ్యతిరేకమని చెప్పారు. ఇప్పటికే ఏడాది పాటు రోజాపై సస్సెన్షన్ విధించగా, దాన్ని మరింత కాలం పొడిగించాలని అధికార పక్షం యోచిస్తున్నట్లు మీడియాకు లీకులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై కూడా విష్ణుకుమార్ రాజు స్పందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement