అమరావతి: ఏపీ బడ్జెట్ సమావేశాలు సోమవారం తిరిగి ప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం 9 గంటలకు ప్రశ్నోత్తరాలతో అసెంబ్లీ సమావేశాలు మొదలవుతాయి. గవర్నర్ ప్రసంగంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమాధానం ఇవ్వనున్నారు. బడ్జెట్‌పై చర్చ కొనసాగనుంది.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాపై సస్పెన్షన్ కు సంబంధించి ప్రివిలేజ్ కమిటీ సమర్పించిన నివేదికపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రివిలేజ్ కమిటీ గురువారం శాసనసభలో నివేదికను సమర్పించింది. నిర్ణయం తీసుకునే విషయాన్ని స్పీకర్‌కు వదిలేసింది.