ఇక అసెంబ్లీ అమరావతిలోనే
⇒ మార్చి 3 నుంచి బడ్జెట్ సమావేశాలు
⇒ ఈనెల 25, 26వ తేదీల నాటికి హైదరాబాద్ నుంచి తరలింపు
⇒ స్పీకర్ కోడెల శివప్రసాదరావు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభా సమావేశాలను ఇక మీదట అమరావతి నుంచే నిర్వహించనున్నామని అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు చెప్పారు. ఈనెల 25, 26వ తేదీలకల్లా హైదరాబాద్ లో ఉన్న అసెంబ్లీ కార్యాలయాలు, సిబ్బంది అమరావతికి తరలనున్నట్లు తెలిపారు. హైదరా బాద్‌లోని అసెంబ్లీ కమిటీ హాలులో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడా రు. బడ్జెట్ సమావేశాలనే కాకుండా రానున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలన్నిటినీ అమరా వతిలోనే నిర్వహిస్తామని వివరించారు.
తాత్కాలిక అసెంబ్లీ, శాసన మండలిలో ఇప్ప టికే అక్కడి అన్ని వసతులు కల్పించా మని, ఇంకా చిన్న చిన్న ఏర్పాట్లు ఉన్నందున వాటిని కూడా త్వరలోనే పూర్తి చేయిస్తామని చెప్పా రు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 3వ తేదీ నుంచి నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. హైదరాబాద్‌లోని ఫైళ్లు, ఉద్యోగులు, లైబ్రరీ విభజన దాదాపు పూర్తయ్యిందని తెలిపారు. ఈనెల 25, 26వ తేదీలకల్లా అమరావతికి సిబ్బందితో పాటు కార్యాలయాలు వెళ్తాయని చెప్పారు. అసెం బ్లీ భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగిస్తారా? అన్న ప్రశ్నకు బదులు ఇస్తూ ప్రస్తుతానికి విభజన చట్టం ప్రకారం పదేళ్లు తమ అధీనంలో ఉంటాయన్నారు. తెలంగా ణకు అప్పగించే అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవలసి ఉంటుందన్నారు.